5 లక్షలకు అమ్ముడుపోయిన ‘సల్మాన్‌ ఖాన్‌’ | Salman Khan Named Goat Sell For 5 Lakh Rupees | Sakshi
Sakshi News home page

5 లక్షలకు అమ్ముడుపోయిన ‘సల్మాన్‌ ఖాన్‌’

Aug 22 2018 3:18 PM | Updated on Aug 22 2018 3:53 PM

Salman Khan Named Goat Sell For 5 Lakh Rupees - Sakshi

అక్షరాల ఐదు లక్షల రూపాయలు చెల్లించి ఆ ‘సల్మాన్‌ ఖాన్‌’ను అభిమాని సొంతం చేసుకున్నాడు

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌కు ఉన్న క్రేజ్‌, స్టార్‌డమ్‌ ఎలాంటిదో అందరికి తెలిసిన సంగతే. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా అభిమానులు ఆయన ఆరాధిస్తుంటారు. చిన్న యాడ్‌లో నటింపజేయడం కోసం కంపెనీలు ఆయనకు కోట్ల రూపాయల పారితోషికం ఆఫర్‌ చేస్తాయి. అలాంటిది ఈ స్టార్‌ హీరో కేవలం 5 లక్షల రూపాయలు పలకడం ఏంటి అనుకుంటున్నారా.. అసలు సంగతేంటంటే ఇంత ధర పలికింది బాలీవుడ్‌ హీరో సల్లు భాయ్‌ కాదు.. ఆయన పేరు పెట్టిన ఒక మేక.

బక్రీద్‌ సందర్భంగా ముస్లింలు గొర్రె/మేకలను బలి ఇస్తారనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌, గోరఖ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి తాను పెంచుకుంటున్న మేకకు ‘సల్మాన్‌ ఖాన్‌’ పేరు పెట్టి అమ్మకానికి తీసుకొచ్చాడు. ఇంకేముంది తమ అభిమాన నటుడి పేరుతో ఉన్న ఆ మేకను కొనడానికి జనాలు ఎగబడ్డారు. చివరకు ఓ వీరాభిమాని అక్షరాల ఐదు లక్షల రూపాయలు చెల్లించి ఆ ‘సల్మాన్‌ ఖాన్‌’ను అదే మేకను సొంతం చేసుకున్నాడు.

ఇబ్రహీం ప్రవక్త త్యాగానికి చిహ్నంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు నేడు బక్రీద్‌ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ముస్లింల విశ్వాసం ప్రకారం ఇదే రోజున ఇబ్రహీం ప్రవక్త దేవుని అనుగ్రహం కోసం తన కుమారున్ని బలి ఇవ్వడానికి సిద్ధపడతాడు. ఆ సమయంలో దేవుడు ఇబ్రహీం కుమారుని స్థానంలో ఒక గొర్రెను ఉంచుతాడు. ఫలితంగా నాటి నుంచి నేటి వరకూ బక్రీద్‌ పర్వదినాన ముస్లింలు గొర్రెను బలి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement