అమ్మకానికి సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ | salman khan and sharukh khan market in luknow | Sakshi
Sakshi News home page

అమ్మకానికి సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్

Published Fri, Sep 25 2015 5:06 PM | Last Updated on Sun, Sep 3 2017 9:58 AM

అమ్మకానికి సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్

అమ్మకానికి సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్

లక్నో: పైన శీర్షిక చూసి ఐపీఎల్‌లో క్రికెటర్ల వేలం మాదిరిగా సినీతారల వేలం కూడా నిర్వహిస్తున్నారని అనుకుంటున్నారా? నో నో.. అదేం లేదు. సల్మాన్, షారుఖ్ అనేవి మేకల పేర్లు. శుక్రవారం ఈద్‌ను పురస్కరించుకొని ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో వ్యాప్తంగా వెలిసిన మేకల మార్కెట్లలో వినిపిస్తున్న పేర్లివి. వినియోగదారులను ఆకర్షించడానికి విక్రయదారులకు మేకలకు బాలీవుడ్ తారల పేర్లు పెడుతున్నారు. ఓల్డ్ సిటీ, ఆలంబాగ్, నిషత్‌గంజ్, జామా మసీదు రోడు బకర్ మండీలో ఇలాంటి మేకలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరు ఖాన్ ల మధ్య శత్రుత్వం ఉండడంతో మేకలకు సల్మాన్, షారుఖ్ పేర్లు పెట్టామని అమ్మకందారులు చెబుతున్నారు.

దిట్టంగా బలిసిన మేకలకు సల్మాన్ ఖాన్ పేరు, నల్లగా ఉన్న వాటికి షారుఖ్ ఖాన్ పేరుతో వ్యవహరిస్తూ బోర్డులు కూడా పెట్టారు. ఇలా సినీతారల పేర్లున్న మేకల ధర రూ.15 వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతోంది.  కొన్ని మేకలకు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేరు పెట్టారు.  ఈ సందర్భంగా సాజిద్ అనే మేకల వ్యాపారి మాట్లాడుతూ అత్యంత  జాగ్రత్తగా వీటిని పెంచుతామని చెప్పారు. ఏకంగా 125 కేజీల మాంసం ఇవ్వగల బర్ఫీ అనే మేక కూడా తన దగ్గరుందని చెప్పారు. మేకలు అందంగా, బలిష్టంగా కనిపిం చేందుకు   బాదాములు, తేనె,  తినిపిస్తున్నారు. చంద్రవంక, నక్షత్ర వంటి గుర్తు లున్న మేకలకు కూడా గిరాకీ బాగుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement