List Of Bollywood Celebrities Who Paid Most Salaries For Their Bodyguard - Sakshi
Sakshi News home page

Celebrities Bodyguards Salaries: సెలబ్రిటీల బాడీగార్డులు.. కోట్లలో జీతాలు

Published Tue, Mar 15 2022 3:51 PM | Last Updated on Tue, Mar 15 2022 4:13 PM

Bollywood Celebrities And Their Bodyguards Salaries - Sakshi

Bollywood Celebrities And Their Bodyguards Salaries: సినిమాల్లో హీరోయిన్స్‌ తమ అందచందాలతో, గ్లామర్‌తో కట్టిపడేస్తుంటారు. అందుకే వారి వెంట విలన్లు వెంటపడుతుంటారు. ఆ విలన్ల నుంచి కాపాడుతూ హీరోలు ఎప్పుడూ హీరోయిన్లను ప్రొటెక్ట్‌ చేస్తుంటారు. ఇది సినిమా వరకే. మరీ రియల్‌ లైఫ్‌లో.. నిజ జీవితంలో హీరోయిన్లను ప్రతీక్షణం కాపాడేందుకు హీరోలకు బదులు బాడీగార్డ్‌లు ఉంటారు.

అభిమానులు సెల్ఫీలు తీసుకునే దగ్గరి నుంచి పెద్ద పెద్ద గుంపుల్లో ఆకతాయిలు చేసే అల్లరి పనుల వరకు వారి వెంట ఉండి ప్రొటెక్ట్‌ చేస్తారు. హీరోయిన్లే కాదు హీరోలు సైతం తమ రక్షణార్థం బాడీగార్డ్‌లను పెట్టుకుంటారు. బాడీగార్డ్‌లను ఊరికే పెట్టుకోరుగా.. వారికి సాలరీస్‌ కూడా ఇవ్వాలి. ప్రస్తుతం బాలీవుడ్‌ హీరోహీరోయిన్ల బాడిగార్డ్స్‌ జీతాలు హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈ హీరోహీరోయిన్లు వారి బాడీగార్డ్స్‌కు ఏకంకా కోట్లలోనే సాలరీస్‌ ఇస్తున్నారు. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దామా. 

1. కంగనా రనౌత్‌-కుమార్‌ (90 లక్షలు)
2. దీపికా పదుకొణె-జలాల్‌ (కోటి)
3. కత్రీనా కైఫ్-దీపక్ సింగ్‌ (కోటి)
4. అనుష్క శర్మ-ప్రకాష్‌ సింగ్‌ (1.2 కోట్లు)
5. అక్షయ్‌ కుమార్‌-శ్రేయసే తేలే (1.20 కోట్లు)
6. అమితాబ్‌ బచ్చన్-జితేందర్ షిండే (1.5 కోట్లు)
7. సల్మాన్‌ ఖాన్‌- షెరా (2 కోట్లు)
8. అమీర్‌ ఖాన్‌- యువరాజ్‌గోర్పడే (2 కోట్లు)
9. షారుక్‌ ఖాన్ -రవి సింగ్ (2.6 కోట్లు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement