
బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయమై ఎంతో మంది బాలీవుడ్ స్టార్స్ బాద్‌షాకి సపోర్టుగా నిలిచారు. చాలామంది సోషల్ మీడియా వేదికగా తమ మద్దతును తెలుపగా.. కండలవీరుడు సల్మాన్ ఖాన్ మాత్రం ఇంటికి వెళ్లి మరీ షారుక్‌తో మాట్లాడాడు.
ఈ తరుణంలో తన ఫ్యామిలీ సమస్యల్లో ఉన్నప్పుడు సల్లు భాయ్ సపోర్టుగా నిలుస్తాడని షారుక్ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో సల్మాన్ హోస్ట్ చేసిన ‘దస్ కా దమ్’ షో గ్రాండ్ ఫినాలే ఎపీసోడ్‌ది. అందులో రాణి ముఖర్జీతో కలిసి బాద్‌షా గెస్ట్‌గా పాల్గొన్నాడు.
ఆ షోలో హోస్ట్ సల్మాన్ ‘మీరు సమస్యల్లో ఉన్నప్పుడు ఎవరు మీకు తోడుగా నిలుస్తారు?’ అని షారుఖ్ అడిగాడు. దానికి బదులుగా.. ‘సల్మాన్ యార్.. నేను, నా ఫ్యామిలీ ప్రాబ్లెమ్స్ ఉన్నప్పుడు నువు కచ్చితం నాతో ఉంటావు’ అని తెలిపాడు. దీనికి అవునంటూ సల్లుభాయ్ తలూపాడు. అనంతరం ఎమోషనల్ అయిన ఇద్దరూ స్టార్ హగ్ చేసుకున్నారు.
ఆర్యన్ డ్రగ్స్ కేసు విషయంలో షారుక్‌ని సల్మాన్ పరామర్శించడంతో.. తమ అభిమాన హీరో మాట నిలబెట్టుకున్నాడంటూ ఫ్యాన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో 2018కి చెందిన ఆ పాత వీడియోని షేర్ చేశారు. దీంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: ఆర్యన్‌ఖాన్‌కు మద్దతుగా మరో హీరో.. హృతిక్ పోస్ట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment