Man Who Went To Stop Two Women Fighting Has Lost His Life In Warangal - Sakshi
Sakshi News home page

అడ్డుకోబోతే.. ప్రాణం పోయింది

Published Sat, Jul 17 2021 4:55 PM | Last Updated on Sun, Jul 18 2021 12:48 PM

Two Womans Fight Each Other Tragedy In Warangal - Sakshi

సాక్షి, వర్ధన్నపేట(వరంగల్‌): ఇద్దరు మహిళలు గొడవపడుతుండగా.. ఆపడానికి వెళ్లిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన వర్ధన్నపేట పట్టణ పరిధి డీసీ తండా శివారు నీలగిరి తండాలో చోటుచేసుకుంది. వర్ధన్నపేట ఎస్సై వంశీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. నీలగిరి తండాకు చెందిన బానోతు కిషన్‌(50) కొంత కాలంగా అనారో గ్యంతో బాధపడుతున్నాడు.

ఈ క్రమంలో కిష న్‌ భార్య దుభిలి ఇంటి పక్కనే ఉన్న బానోతు గమిలీతో గురువారం గొడవ పడింది. ఈ క్రమంలో గొడవను ఆపేందుకు వెళ్లిన కిషన్‌ను గమిలీ నెట్టడంతో ప్రమాదవశాత్తు కింద పడ్డా డు. అతడిని వరంగల్‌లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి భార్య దుభిలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement