
సాక్షి, చాంద్రాయణగుట్ట(హైదరాబాద్): కుమారుడు అల్లరి చేస్తున్నాడని ఇరుగు పొరుగు వారు చెప్పడంతో సహనం కోల్పోయిన ఓ వ్యక్తి తన ఎనిమిదేళ్ల కొడుకును చితకబాదాడు. ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. తన కుమారుడికి భయం చెబుతున్నానని.. అందరికీ చూపించేందుకు సదరు వ్యక్తి తన కూతురుతోనే కొట్టే దృశ్యాలను వీడియో తీయించి, ఇరుగు పొరుగు వారికి పంపడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
లాల్‌దర్వాజాలోని నాగం కాంప్లెక్స్‌లో కర్ణాటక చెందిన అశోక్ ఘంటే భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడి ఎనిమిదేళ్ల కుమారుడు అల్లరి చేస్తున్నాడని ఇరుగు పొరుగు వారు పలుమార్లు చెప్పడంతో శనివారం మధ్యాహ్నం కొడుకును కర్రతో ఇష్టానుసారంగా చితకబాదాడు. వీడియోను చూసిన అతడి భార్య ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment