14 డెక్కలతో జన్మించిన లేగ దూడ
కుంటాల: నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని దౌనెల్లి సతీశ్‌కు చెందిన ఆవుకు గురువారం రాత్రి లేగ దూడ జన్మించింది. దూడకు ముందటి కాళ్లకు నాలుగుకు బదులు ఆరు డెక్కలు, వెనుక కాళ్లకు నాలుగుకు బదులు ఎనిమిది డెక్కలు ఉన్నాయి.
దీంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని దూడను పరిశీలించారు. సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసుకున్నారు. జన్యు లోపంతోనే లేగ దూడ 14 డెక్కలతో జన్మించిందని పశువైద్యాధికారి ప్రకాశ్ తెలిపారు. (క్లిక్ చేయండి: గేటు పడింది.. గుండె ఆగింది)
Comments
Please login to add a commentAdd a comment