మనిషి రూపంలో దూడ.. విష్ణు మూర్తేనంటూ..
చూడటానికి మనిషి ముఖంలా కనిపిస్తున్న ఆకారంతో జన్మించిన ఆవు దూడకు ఓ గ్రామ ప్రజలు పూజలు చేస్తున్నారు. హిందూవులు గోవును ఆరాధిస్తారన్న విషయం తెలిసిందే. అచ్చూ మనిషిలాగే ఉండే చెవులు, ముక్కు, కళ్లతో ఉన్న దూడకు ఓ ఆవు జన్మనిచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో చోటు చేసుకుంది.
మనిషి పోలికలతో ఆవు దూడ జన్మించిన విషయం గ్రామంలో అగ్నిలా వ్యాపించింది. దీంతో జనం తండోపతండాలుగా అక్కడికి చేరుకుని దూడను చూసేందుకు ఎగబడ్డారు. భూమి మీద పడి గంట కూడా గడవక ముందే ఆ లేగ దూడ మరణించింది. ఆరెంజ్ కలర్ దుప్పటిపై లేగ దూడ కళేబరాన్ని ఉంచి దండలు వేసి పూజలు చేశారు.
చనిపోయిన దూడను చూడాటానికి వచ్చిన వారిలో ఓ వ్యక్తి విష్ణువే దూడ రూపంలో జన్మించాడని అన్నాడు. దేవుడి ఆశీస్సులు తీసుకునేందుకే తాను ఇక్కడికి వచ్చానని చెప్పాడు. కాగా, మనిషి పోలీకలతో దూడ జన్మించడంపై మాట్లాడిన తల్లి ఆవు యజమాని రాజా మిశ్రా.. తమ కొట్టంలో ఈ ఘటన జరగడం ఆ దేవుడి మాపై ఉందనడానికి నిదర్శనమని అన్నాడు.
మూడు రోజుల్లో మరణించిన దూడకు అంత్యక్రియలు పూర్తి చేస్తామని చెప్పాడు. త్వరలో దూడకు ఓ గుడి కూడా కట్టిస్తామని తెలిపాడు. దేవుడి ఎంచుకున్న ఈ రూపం చాలా మందిలో భక్తి భావాన్ని మరింత పెంపొందించిందని అన్నాడు. కాగా, ఈ ఘటనపై స్పందించిన జంతు నిపుణులు దాని చుట్టూ అల్లుతున్నవి మూఢ నమ్మకాలని కొట్టిపారేశారు.