వచ్చే నెలలో ఇండియన్‌ బాక్సింగ్‌ లీగ్‌ | India Boxing League To Start In Next Month | Sakshi
Sakshi News home page

వచ్చే నెలలో ఇండియన్‌ బాక్సింగ్‌ లీగ్‌

Published Sat, Nov 16 2019 10:02 AM | Last Updated on Sat, Nov 16 2019 10:02 AM

India Boxing League To Start In Next Month - Sakshi

న్యూఢిల్లీ: క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఫుట్‌బాల్, కబడ్డీ, రెజ్లింగ్, టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాంశాల్లో భారత్‌లో లీగ్‌లు జరుగుతుండగా... వీటి సరసన బాక్సింగ్‌ కూడా చేరనుంది. తొలిసారి ఒలింపిక్‌ స్టయిల్‌ ఇండియన్‌ బాక్సింగ్‌ లీగ్‌కు వచ్చే నెలలో తెర లేవనుంది. డిసెంబర్‌ 2 నుంచి 21 వరకు జరిగే ఈ లీగ్‌లో ఆరు ఫ్రాంచైజీలు పాల్గొంటాయి.

మూడు నగరాల్లో ఈ లీగ్‌ను నిర్వహిస్తామని లీగ్‌ నిర్వాహక సంస్థలు ప్రొ స్పోర్టీఫై–స్పోర్ట్‌జ్‌ లైవ్‌ తెలిపాయి. లీగ్‌ను స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. భారత మేటి బాక్సర్లు మేరీకోమ్, అమిత్‌ పంఘాల్, మనోజ్‌కుమార్, సోనియా లాథెర్‌ తదితరులు ఈ లీగ్‌లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement