ప్రిక్వార్టర్స్‌లో అమిత్, గౌరవ్‌ | Amit, Gaurav give India winning start at World Boxing Championships | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో అమిత్, గౌరవ్‌

Published Sun, Aug 27 2017 1:46 AM | Last Updated on Sun, Sep 17 2017 5:59 PM

ప్రిక్వార్టర్స్‌లో అమిత్, గౌరవ్‌

ప్రిక్వార్టర్స్‌లో అమిత్, గౌరవ్‌

హంబర్గ్‌ (జర్మనీ): భారత బాక్సర్లు అమిత్‌ ఫంగల్, గౌరవ్‌ బిధురి సత్తా చాటారు. ప్రపంచ పురుషుల సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో వీరిద్దరూ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల 49 కేజీల కేటగిరీ తొలి రౌండ్లో అమిత్‌ 4–1తో ఫెడెరికొ సెర్రా (ఇటలీ)పై గెలుపొందాడు. 56 కేజీల విభాగంలో గౌరవ్‌ 5–0తో ప్రపంచ యూత్‌ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత సామ్‌ గుడ్‌మాన్‌ (ఆస్ట్రేలియా)ను కంగుతినిపించాడు. ప్రిక్వార్టర్స్‌లో అమిత్‌... ఏడో సీడ్‌ కార్లస్‌ క్విపో (ఈక్వెడార్‌)తో, గౌరవ్‌... ఆఫ్రికా చాంపియన్‌ జీన్‌ జోర్డి వాడముటూ (మారిషస్‌)తో తలపడతారు. ఈ చాంపియన్‌షిప్‌లో 250 మంది అంతర్జాతీయ బాక్సర్లు తలపడుతుండగా... భారత్‌ తరఫున ఎనిమిది మంది పోటీపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement