
National Boxing Championship: జాతీయ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ మహిళా బాక్సర్ గోనెళ్ల నిహారిక శుభారంభం చేసింది. హిస్సార్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో 63–66 కేజీల విభాగం తొలి రౌండ్‌లో నిహారిక 5–0తో డాలీ సింగ్ (బిహార్)పై నెగ్గింది. 2015లో ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో నిహారిక భారత్‌కు రజత పతకం అందించింది. నిహారిక సోదరి నాగనిక ప్లస్ 81 కేజీల విభాగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment