Hisar
-
రాజ్యాంగ విధ్వంసకారి కాంగ్రెస్: ప్రధాని మోదీ
హిసార్: కాంగ్రెస్ పార్టిపై ప్రధాని మోదీ మరోసారి నిప్పులు చెరిగారు. రాజ్యాంగ విధ్వంసకారిగా కాంగ్రెస్ మారిపోయిందంటూ ధ్వజమెత్తారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను రెండో తరగతి పౌరులుగా మార్చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల వల్ల సాధారణ ముస్లింలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్‌ను కాంగ్రెస్ ఘోరంగా అవమానించిందని మండిపడ్డారు. సోమవారం హరియాణా రాష్ట్రం హిసార్‌లోని మహారాజా అగ్రసేన్ ఎయిర్‌పోర్టులో నూతన టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం హిసార్–అయోధ్య మధ్య తొలి కమర్షియల్ విమానాన్ని ప్రారంభించారు. అలాగే యమునానగర్ జిల్లాలోని దీనబందు చోటూ రామ్ థర్మల్ పవర్ ప్లాంట్‌లో 800 మెగావాట్ల అల్ట్రా–క్రిటికల్ మోడ్రన్ థర్మన్ పవర్ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. రెండుచోట్లా సభల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రమాదంలో పడ్డప్పుడల్లా రాజ్యాంగాన్ని అణచివేశారని చెప్పారు. మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే... ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను విస్మరించిన కాంగ్రెస్ ‘‘దేశంలో నేడు దురదృష్టం ఏమిటో చూడండి. రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన వ్యక్తులే నేడు అదే రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభివృద్ధికి పాలకులు కృషి చేయాలని రాజ్యాంగం చెబుతుండగా, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆయా వర్గాలను విస్మరించాయి. సమాజంలో సమానత్వం రావాలని అంబేడ్కర్ ఆశించారు. కానీ, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు అనే వైరస్‌ను వ్యాప్తి చేసింది. పవిత్రమైన రాజ్యాంగాన్ని కేవలం అధికారం కోసం ఆయుధంగా వాడుకుంది. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో మంచినీరు ఆ పార్టీ నాయకుల స్విమ్మింగ్ పూల్స్‌కు చేరింది కానీ గ్రామాలకు చేరుకోలేదు. స్వాతంత్య్రం వచ్చి70 ఏళ్లు గడిచినా గ్రామాల్లో 16% ఇళ్లకు కూడా కుళాయి నీరు రాలేదు. కాంగ్రెస్ విధానాల వల్ల నష్టపోయింది ఎవరు? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు కాదా? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలకు తాగునీరు అందించడంపై దృష్టి పెట్టాం. గత ఏడేళ్లలో 12 కోట్ల కుళాయి నీటి కనెక్షన్లు ఇచ్చాం. దేశంలో ప్రస్తుతం 80% ఇళ్లకు కుళాయిల ద్వారా తాగునీరు సరఫరా అవుతోంది. మిగతా ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడం తథ్యం. కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహరి్నశలూ శ్రమిస్తున్నాం. హవాయి చెప్పులు ధరించేవారు కూడా విమానాల్లో ప్రయాణించేలా చేయాలన్నదే మా లక్ష్యం. అది ఇప్పుడిప్పుడే సాకారం అవుతోంది. గత పదేళ్లలో కోట్లాది మంది ప్రజలు తొలిసారిగా విమాన ప్రయాణం చేశారు. గతంలో సరైన రైల్వేస్టేషన్లు లేనిచోట కూడా ఇప్పుడు ఎయిర్‌పోర్టులు నిర్మిస్తున్నాం. 2014 కంటే ముందు దేశంలో 74 ఎయిర్‌పోర్టులు ఉండేవి. ప్రస్తుతం ఆ సంఖ్య 150కు చేరింది. మన ఎయిర్‌లైన్ సంస్థలు 2,000 కొత్త విమానాల కోసం ఆర్డర్ ఇచ్చాయి. కొత్త విమానాలతో ఎన్నో ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. పరుగు ఆపని అభివృద్ధి, వేగవంతమైన అభివృద్ధి.. ఇదే బీజేపీ ప్రభుత్వాల మంత్రం. పేదలు, గిరిజనులు, మహిళల జీవితాల్లో మార్పులు తీసుకురావాలన్నదే మా ధ్యేయం. మా ప్రతి నిర్ణయం, ప్రతి విధానం అంబేడ్కర్‌కే అంకితం. సామాజిక న్యాయంపై కాంగ్రెస్ పెద్దపెద్ద మాటలు చెబుతోంది. కానీ, అంబేడ్కర్‌కు, చౌదరి చరణ్‌సింగ్‌కు కాంగ్రెస్ భారతరత్న పురస్కారాలు ఇవ్వలేదన్న సంగతి మనం మర్చిపోవద్దు. అంబేడ్కర్‌కు మరణానంతరం భారతరత్న దక్కిందంటే అందుకు కారణం బీజేపీ. చౌదరి చరణ్‌సింగ్‌కు బీజేపీ ప్రభుత్వమే భారతరత్న ఇచ్చింది. అంబేడ్కర్ జయంతి చాలా ముఖ్యమైన రోజు. ఇది మనందరికీ రెండో దీపావళి. మతం ఆధారంగా రిజర్వేషన్లా? 2013 చివర్లో కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్ చట్టానికి హడావుడిగా సవరణలు తీసుకొచ్చింది. ఎన్నికల్లో ఓట్ల కోసమే కుతంత్రాలకు పాల్పడింది. రాజ్యాంగాన్ని ధిక్కరించి మరీ వక్ఫ్ చట్టంలో సవరణలు చేశారు. ఇది అంబేడ్కర్‌ను అవమానించడం కాదా? ఓటు బ్యాంకు కోసం ఆరాటపడింది ఎవరు? ముస్లింలపై కాంగ్రెస్‌కు నిజంగా అభిమానం ఉంటే ఆ పార్టీ అధినేతగా ముస్లింను నియమించాలి. ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 50 శాతం టికెట్లు ముస్లింలకే ఇవ్వాలి. కానీ, కాంగ్రెస్ ఆ పని చేయదు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొద్దని అంబేడ్కర్ చెప్పారు. రాజ్యాంగం సైతం ఇలాంటి రిజర్వేషన్లపై నిషేధం విధించింది. కానీ, కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ప్రభుత్వ టెండర్లలో మతం ఆధారంగా రిజర్వేషన్లు తీసుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను కొల్లగొడుతున్నారు. లూటీని ఆపడానికే వక్ఫ్చట్టం దేశంలో వక్ఫ్ బోర్డులకు లక్షల ఎకరాల భూములున్నాయి. అవి పేద ముస్లింలకు, మహిళలకు, చిన్నారుల అభివృద్ధి కోసం ఉపయోగపడాలి. ఆ భూములను సక్రమంగా ఉపయోగించుకొని ఉంటే నేడు ముస్లిం యువత టైర్ల పంక్చర్ దుకాణాల్లో పనిచేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. వక్ఫ్ భూములు కేవలం భూమాఫియాకే ఉపయోగపడుతున్నాయి. పేద ముస్లింలకు ఒరిగిందేమీ లేదు. దళితులు, వెనుకబడివర్గాలు, ఆదివాసీలు, వితంతువులను భూ మాఫియా లూటీ చేసింది. ఈ లూటీని ఆపడానికే వక్ఫ్(సవరణ) చట్టం తీసుకొచ్చాం. ఆదివాసీల భూములు, ఆస్తులను ఇకపై వక్ఫ్ బోర్డు తాకను కూడా తాకలేదు. వక్ఫ్ స్ఫూర్తిని మేము గౌరవిస్తున్నాం. ముస్లిం మహిళలు, పేదలు, చిన్నారుల హక్కులకు ఎప్ప టికీ రక్షణ లభించే ఏర్పాటు చేశాం. ఇదే అసలైన సామాజిక న్యాయం’’’ అని మోదీ ఉద్ఘాటించారు. -
‘నాడు 74.. నేడు 150’.. హిసార్- అయోధ్య విమాన ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) సోమవారం హర్యానాలోని హిసార్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. దీనిలో భాగంగా ఆయన హిసార్ నుంచి అయోధ్యకు మొదటి వాణిజ్య విమానానికి పచ్చజెండా చూపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ 2014కు ముందు దేశంలో 74 ఎయిర్‌పోర్టులు మాత్రమే ఉండేవని, నేడు అవి 150కి చేరుకున్నాయని తెలిపారు.#WATCH | Addressing a public event in Haryana's Hisar, PM Modi says, "Before 2014, there were 74 airports in the country, but today there are over 150 airports...Imagine 74 airports in 70 years?... Every year, there are record airline passengers in the country. The airline… pic.twitter.com/uf0CXsWZLI— ANI (@ANI) April 14, 2025ప్రతీయేటా విమాన ప్రయాణికుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నదన్నారు. దేశంలోని పలు విమానయాన సంస్థలు 2000 ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఆర్డర్ ఇచ్చాయని ప్రధాని పేర్కొన్నారు. నూతనంగా ప్రారంభిస్తున్న ప్రాజెక్టులు హర్యానా(Haryana) అభివృద్ధికి ఊతమిస్తాయని, ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని ప్రధాని పేర్కొన్నారు. హిసార్ శ్రీ కృష్ణుని పవిత్ర భూమి అని, అయోధ్య శ్రీ రాముని నగరమని.. ఈ నూతన విమాన సర్వీసు రెండు పవిత్ర నగరాలను ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రధాని మోదీ నూతనంగా ప్రారంభించిన విమాన సర్వీసు హర్యానా- ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లను అనుసంధానం చేస్తుంది. ఈ సర్వీసు వారానికి రెండు సార్లు నడుస్తుంది. ప్రధాని మోదీ హిసార్‌లోని మహారాజా అగ్రసేన్ విమానాశ్రయంలో 410 కోట్ల వ్యయంతో నిర్మించబోయే నూతన టెర్మినల్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ టెర్మినల్‌లో ఆధునిక ప్యాసింజర్ టెర్మినల్, కార్గో టెర్మినల్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) భవనం ఉంటాయి. హిసార్ విమానాశ్రయం నుంచి అయోధ్యతో పాటు, జమ్ము, అహ్మదాబాద్, జైపూర్, చండీగఢ్‌లకు వారానికి మూడు విమాన సర్వీసులు నడుస్తాయి. ప్రధాని మోదీ యమునానగర్‌లో 800 మెగావాట్ల సూపర్‌క్రిటికల్ థర్మల్ పవర్ యూనిట్‌కు కూడా శంకుస్థాపన చేశారు. ఇది రూ. 7,272 కోట్లతో 2028 నాటికి పూర్తవుతుందని అంచనా. ఈ ప్రాజెక్టు హర్యానాలో విద్యుత్ స్వయం సమృద్ధిని పెంచడంతో పాటు నిరంతర విద్యుత్ సరఫరాను అందించనుంది.ఇది కూడా చదవండి: Bangladesh: చరిత్రను చెరిపేస్తున్నారు: షేక్ హసీనా ఆగ్రహం -
బీజేపీకి బిగ్ షాక్
లోక్‌సభ ఎన్నికల ముందర బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ ఎంపీ బ్రిజేందర్ సింగ్ Brijendra Singh(51) ఆదివారం బీజేపీకి రాజీనామా ప్రకటించారు. రాజీనామా ప్రకటించిన కొన్నిగంటలకే ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిపోయారు. హర్యానా రాజకీయ దిగ్గజం, కేంద్ర మాజీ మంత్రి చౌద్రీ బీరేందర్ సింగ్(77) తనయుడే ఈ బ్రిజేందర్ సింగ్. హర్యానా హిసార్ పార్లమెంటరీ స్థానం నుంచి బ్రిజేందర్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముందుగా తన రాజీనామాను ఎక్స్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేశారాయన. I have resigned from the primary membership of BJP,due to compelling political reasons. I extend gratitude to the party, National President Sh. JP Nadda, Prime Minister Sh. Narendra Modi, & Sh Amit Shah for giving me the opportunity to serve as the Member of Parliament for Hisar. — Brijendra Singh (@BrijendraSpeaks) March 10, 2024 ఆ తర్వాత బ్రిజేందర్ సింగ్.. ఖర్గేతోపాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాజకీయ, సైద్ధాంతిక విబేధాల వల్లే తాను బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరినట్లు మీడియాకు బ్రిజేందర్ తెలియజేశారు. రైతుల ఆందోళన, రెజ్లర్ల నిరసనలు.. ఇలా చాలాకారణాలు ఉన్నాయని చెప్పారాయన. అలాగే.. కాంగ్రెస్ చేరిక సంతోషాన్ని ఇస్తోందని బ్రిజేందర్ చెప్పారు. గతంలో 42 ఏళ్ల పాటు కాంగ్రెస్‌తో అనుబంధం కొనసాగించిన బీరేందర్ సింగ్.. 2014లో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఇక ఆయన తనయుడైన బ్రిజేందర్ 1998లో సివిల్స్ 9వ ర్యాంకర్. ఐఏఎస్ అధికారిగా 21 ఏళ్లపాటు సొంత రాష్ట్రానికి సేవలు అందించిన బ్రిజేందర్ గత సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. హిసార్ ఎంపీగా.. పార్లమెంట్లో పలు కమిటీలకు సైతం బ్రిజేందర్ పని చేశారు. తండ్రి బీరేందర్‌తో బ్రిజేందర్ జాట్ కమ్యూనిటీకి చెందిన బ్రిజేందర్ కుటుంబానికి ముందు తరాల నుంచే హర్యానా రాజకీయాల్లో మంచి పలుకుబడి ఉంది. అయితే ఈసారి ఎన్నికల్లో ఆయనకు సీటు దక్కకపోవచ్చనే సంకేతాలు అందుతున్నాయి. దీంతో కాంగ్రెస్‌లో చేరి ఆయన పోటీ చేయొచ్చని తెలుస్తోంది. -
Niharika Gonella: తెలంగాణ బాక్సర్ నిహారిక శుభారంభం
National Boxing Championship: జాతీయ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ మహిళా బాక్సర్ గోనెళ్ల నిహారిక శుభారంభం చేసింది. హిస్సార్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో 63–66 కేజీల విభాగం తొలి రౌండ్లో నిహారిక 5–0తో డాలీ సింగ్ (బిహార్)పై నెగ్గింది. 2015లో ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో నిహారిక భారత్‌కు రజత పతకం అందించింది. నిహారిక సోదరి నాగనిక ప్లస్ 81 కేజీల విభాగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. చదవండి: క్వార్టర్ ఫైనల్లో సింధుకు చుక్కెదురు -
భారత్‌లో మొదటి ఎయిర్ ట్యాక్సీ సర్వీసు
చండీగఢ్: దేశంలోనే మొట్టమొదటి ఎయిర్ ట్యాక్సీ సర్వీసు చండీగఢ్‌లో ప్రారంభమయ్యింది. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ చండీగఢ్ విమానాశ్రయంలో ఈ సర్వీసును ప్రారంభించారు. ఉడాన్ పథకంలో భాగంగా ప్రభుత్వం దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ట్యాక్సీ చండీగఢ్ నుంచి హిసార్ వరకు ప్రయాణికులను చేరవేయనుంది. రెండో దశలో హిసార్ నుంచి డెహ్రాడూన్ వరకు మరో ఎయిర్ ట్యాక్సీని వచ్చేవారం ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు. మూడో దశలో చండీగఢ్ నుంచి డెహ్రాడూన్, హిసార్ నుంచి ధర్మశాల వరకు ఈ సేవలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం సిమ్లా, కులూతోపాటు ఇతర పర్యాటక ప్రాంతాలను సైతం ఇందులో చేర్చాలని యోచిస్తున్నారు. ఎయిర్ ట్యాక్సీ కోసం టెక్నామ్ పీ2006టీ విమానాన్ని ఉపయోగిస్తున్నారు. ఇందులో నాలుగు సీట్లు ఉంటాయి. ప్రయాణ చార్జీల్లో ప్రభుత్వం కొంత రాయితీ ఇవ్వనుంది. మెట్రో 2 టైర్, 3 టైర్ నగరాలను ఎయిర్ ట్యాక్సీలతో అనుసంధానిస్తామని కేంద్రం గతంలో ప్రకటించింది. చదవండి: ట్రాఫిక్ జామ్.. నెలకు రూ.2లక్షల ఆదాయం ‘నేను అబ్బాయి దేహంలో ఉన్న అమ్మాయిని’ -
బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ అరెస్ట్
చంఢీగడ్: టిక్‌టాక్ స్టార్, బీజేపీ నేత సోనాలి ఫోగట్‌ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ అధికారిని అడ్డుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ అరెస్ట్ చోటు చేసుకుంది. ఈ నెల ప్రారంభంలో సోనాలి ఫోగట్ బాలాస్మంద్‌లోని ధాన్యం మార్కెట్‌ను సమీక్షించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడున్న మార్కెట్ సెక్రటరీ సుల్తాన్సింగ్తో ఆమెకు వాదులాట జరిగింది. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన సోనాలి అతడిని చెప్పుతో కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలయ్యింది. ఈ క్రమంలో సదరు అధికారి దుర్భాషలాడుతూ, తనను అవమానించడం వల్లే కొట్టాల్సి వచ్చిందని సోనాలి పేర్కొన్నారు. ఈ క్రమంలో సుల్తాన్ సింగ్ ఆమె మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాక తానేమీ అనకముందే సోనాలి తనపై దాడి చేసిందని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో పోలీసులు బుధవారం సోనాలిని అరెస్ట్ చేశారు. కాగా టిక్‌టాక్‌తో గుర్తింపు సంపాదించుకున్న సోనాలి ఫోగట్‌కు బీజేపీ గతేడాది ఎన్నికల్లో హర్యానాలోని ఆదంపూర్ నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చింది. ఆమె గెలుపు తథ్యమనుకున్నప్పటికీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఓటమిపాలైంది. -
'ఆట కంటే డ్యూటీనే కష్టంగా ఉంది'
హిసార్ : 'క్రికట్ కంటే నాకు ఈ పోలీస్ డ్యూటీనే కష్టంగా ఉందంటూ' 2007 టీ20 ప్రపంచకప్ హీరో జోగిందర్ శర్మ పేర్కొన్నాడు. జోగిందర్ శర్మ క్రికెట్‌కు దూరమైన తర్వాత హర్యానాలోని హిసార్ జిల్లా డీఎప్పీగా విధుల నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం కరోనా మహమ్మారి దేశంలోకి ప్రవేశించి అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. జోగిందర్ కూడా అందరి పోలీసుల్లాగే డీఎస్పీగా కరోనా విధులు నిర్వహిస్తున్నాడు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు తాను 24 గంటల పాటు విధులు నిర్వహిస్తున్నానని జోగి చెప్పుకొచ్చాడు. ఆటతో పోలిస్తే ఈ డ్యూటీ కొంచెం కష్టంగానే అనిపిస్తున్నప్పటికి తాను దేశం కోసమే సేవ చేస్తుండడంతో బాధ అనేది లేదని పేర్కొన్నాడు. (ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ అవసరమా?) 'పొద్దున ఉదయం 6గంటలకు లేవడంతో నా డ్యూటీ మొదలవుతుంది. రోజూ ఉదయం 9గంటలకు డ్యూటీ నిమ్మిత్తం వెళ్లి రాత్రి 8గంటల తర్వాత కూడా ఎమర్జెన్సీ కాల్స్ ఉండడంతో 24 గంటల పాటే విధులు నిర్వహిస్తున్నా. నా పరిధిలో హిసార్ జిల్లా రూరల్ భాగం ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రతీరోజు చెక్‌పోస్ట్ వద్ద నిలబడి బస్ డ్రైవర్లకు, ప్రైవేటు వాహనాలకు కరోనాపై అవగాహన కల్పిస్తున్నాం. ఇంట్లోనే ఉంటూ సురక్షితంగా ఉండండి.. అవసరం ఉంటేనే బయటికి రండి అని సూచిస్తున్నాం. ఇంకా కొన్ని సందర్భాల్లో దేశంలో లాక్డౌన్ ఉండడంతో యూపీ, బీహార్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు కాలి నడకన వారి సొంతూళ్లకు చేరుకుంటున్నారు. నేను నా టీంతో కలిసి వారిని ఆపి కరోనాపై అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లకు తరలిస్తున్నాం. ఇదంతా కష్టంగా అనిపిస్తున్నా దేశంకోసమే చేస్తున్నాననుకొని సరిపెట్టుకుంటున్నా. నా కుటుంబంతో కలిసి రోహ్తక్లో నివసిస్తున్న నాకు హిసార్ ప్రాంతం 110 కిలోమీటర్లు ఉంటుంది. ఇంటికి వెళ్లే అవకాశం ఉన్నా.. డ్యూటీ నేపథ్యంలో రోజుకు ఎంతోమందిని కలవడంతో ఇంటికి వెళ్లకూడదని నిశ్చయించుకున్నా' అంటూ చెప్పుకొచ్చాడు.(నెట్వర్క్ కోసం చెట్లు ఎక్కుతూ అంపైర్ పాట్లు!) 2007 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో ఆఖరి ఓవర్ వేసిన జోగిందర్ అద్భుతమైన బౌలింగ్‌తో భారత్‌ను గెలిపించాడు. దీంతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయిన జోగిందర్ 2018లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్లో అందించిన సేవలకుగానూ హర్యానా ప్రభుత్వం అతన్ని డీఎస్పీ (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్)గా నియమించిన విషయం తెలిసిందే. జోగిందర్ శర్మ టీమిండియా తరపున 4 వన్డేలు, 4 టీ20లు ఆడాడు. ఇప్పటివరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 6వేలకు పైగా చేరుకోగా, మృతుల సంఖ్య 206కు చేరింది. -
మార్కులు తక్కువ వచ్చాయని చిన్నారిని హింసించిన టీచర్
-
మార్కులు తక్కువ వచ్చాయని..
చండీగఢ్ : మార్కులు తక్కువగా వచ్చాయనే ఆగ్రహంతో నాలుగో తరగతి చదివే చిన్నారి ముఖంపై నల్లరంగు పూసి స్కూల్లో అందరి ముందూ తిప్పిన టీచర్ ఉదంతం హరియాణాలోని హిసార్‌లో వెలుగుచూసింది. టీచర్ చిన్నారిని హింసించడంతో బాలిక తల్లితండ్రులు స్కూల్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు నిరసన చేపట్టారు. ఈ ఘటన చోటుచేసుకున్న ప్రైవేట్ పాఠశాలను తక్షణమే మూసివేయాలని బాధిత బాలిక తండ్రి డిమాండ్ చేశారు. ఈనెల 6న నిర్వహించిన పరీక్షలో తమ కుమార్తెకు మార్కులు తక్కువగా రావడంతో మహిళా టీచర్ తమ కుమార్తె ముఖానికి స్కెచ్ పెన్‌తో నల్లరంగు అద్దారని, స్కూల్ చుట్టూ తిప్పారని ఆయన ఆరోపించారు. చిన్నారికి పరీక్షలో మార్కులు తక్కువగా వచ్చినా టీచర్ ఇలా చేసి ఉండాల్సింది కాదని అన్నారు. మరోవైపు ఈ బాలికతో పాటు మరో ముగ్గురు బాలికల పట్ల కూడా మార్కులు తక్కువ వచ్చాయంటూ టీచర్ ఇదే తీరుగా వ్యవహరించారని విద్యార్ధులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
హరియాణ్ హిస్సార్‌లో ఆసక్తికర రాజకీయ పోరు
-
ఫుట్‌పాత్ మీద నిద్రిస్తున్న వారిపై..
చండీగఢ్ : అతివేగంతో దూసుకెళ్లిన కారు ఐదుగురి ప్రాణాలను హరించింది. హర్యానాలోని హిసార్‌లో మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఫ్లైఓవర్ ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కార్మికులపై కారు దూసుకెళ్లడంతో ఐదుగురు బిహారీ కార్మికులు మరణించారు. అదుపు తప్పిన ఈ వాహనం కార్మికులపైకి దూసుకెళ్లిన అనంతరం ఫ్లైఓవర్ పైనుంచి కిందకు పడిపోయినట్టు స్ధానికులు వెల్లడించారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితులను గుర్తించి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందచేస్తామని, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణాలు ఇంకా పూర్తిగా వెల్లడికాలేదని చెప్పారు. -
నీటి కోసం ఘర్షణ : 300 మందిపై కేసు!
చంఢీఘర్ : నీటి కోసం హర్యానాలోని రెండు గ్రామాల మధ్య సోమవారం అర్ధరాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో 12మందికి గాయాలు కాగా.. దీనితో సంబంధం ఉన్న 300 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. హిసర్ జిల్లాలోని పుతి మంగల్ఖాన్, పీరాన్‌వాలీ గ్రామాల మధ్య దగ్గర్లోని కెనాల్ నుంచి నీటి తరలింపు విషయంలో వివాదం తలెత్తింది. పీరాన్‌వాలీ గ్రామస్థులు కెనాల్ నుంచి అనుమతులు లేకుండా పంపుసెట్ ఏర్పాటు చేసి నీటి తరలింపు చేపడుతున్నారని ఆరోపిస్తూ మంగల్ఖాన్ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. దీంతో పీరాన్‌వాలీ ప్రజలు భారీగా అక్కడికి చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. చిన్నగా మొదలైన గొడవ ఇరు వర్గాల మధ్య పెనుగులాటకు దారితీసింది. ఈ దాడుల్లో బైకులకు కూడా నిప్పు పెట్టారు. కొత్తగా ఏర్పాటు చేసిన పంపుసెట్ కూడా కాలిపోయింది. ఇరు గ్రామాలకు చెందిన వందలాది మంది ఘర్షణలో పాల్గొన్నారు. ఈ ఘటనలో 12 మందికి గాయాలు కాగా, 8 బైక్‌లు దగ్ధమయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న దాదాపు 300 మందిపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరు గ్రామాల మధ్య మళ్లీ ఘర్షణలు తలెత్తకుండా భారీగా బలగాలను మోహరించారు. -
మహిళా ఉద్యోగిపై దాడి.. ప్రముఖ బాక్సర్‌పై కేసు
చండీగఢ్ : మహిళా ఉద్యోగిపై దాడి చేశారని ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహిత జై భగవాన్‌పై హరియాణా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒలంపిక్ విజేత జై భగవాన్ ఫతేహాబాద్లో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు హిసార్‌లో లోని లక్ష్మీవిహార్ సమీపంలో మద్యం షాపు ఉంది. నిబంధనలకు విరుద్దంగా మద్యం అమ్ముతున్నారని ఆరోపనలు రావడంతో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. గత నెల 19న రాత్రి 9 గంటలకు హీసార్ మహిళా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీవిహార్కు చేరుకొని మద్యం షాపు డాక్యుమెంట్లను చూపించాలని కోరారు. ఆ సమయంలో అక్కడే ఉన్న జైభగవాన్ ఆమెపై దాడికి పాల్పడ్డారు. నిబంధనల ప్రకారమే మద్యం విక్రయిస్తున్నామంటూ ఆమెను అడ్డుకున్నారు. తన మనుషులతో ఆమెను చుట్టుముట్టారు. అసభ్యకరపదజాలంతో దూషించారు. గంటకు పైగా ఆమె కారును చుట్టిముట్టారు. దీంతో ఈ విషయాన్ని ఆమె పై అధికారుల వద్దకు తీసుకెళ్లారు. జై భగవాన్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా హిసార్ డిప్యూటీ ఎక్సైజ్ అండ్ టాక్సేషన్ కమిషనర్(డీఈటీసీ) ని కోరారు. జై భగవాన్ వివాదంపై విచారణ చేపట్టాల్సిందిగా డీఈటీసీ హిరాస్ ఎస్పీని ఆదేశించారు. దీంతో ఈ నెల జూన్12 న భగవాన్‌పై కేసు నమోదు చేశారు. -
‘ఢిల్లీ రికార్డ్‌ను బద్ధలు కొడతాం’
హరియాణా : ఢిల్లీలో మాదిరిగానే హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సత్తా చాటుతామని ఆమ్ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆదివారం హిసర్‌లో కేజ్రీవాల్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2019 ఎన్నికల్లో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ‘హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి.. గతంలో ఢిల్లీలో నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేస్తాం. గత యాభైఏళ్లుగా హరియాణాను అభివృద్ధి చేయటంలో పాలకులు విఫలమయ్యారు. పుట్టినగడ్డ రుణం తీర్చుకునే అవకాశం నాకు కల్పించండి’ అని ప్రజలను ఉద్దేశించి కేజ్రీవాల్ ప్రసంగించారు. ఢిల్లీలో తన పాలనలో ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులను అభివృద్ధి చేశానని, ఒక్క అవకాశం ఇస్తే హరియాణాలోనూ అదే అభివృద్ధిని చేపడతాని ఆయన అన్నారు. హరియాణా ప్రభుత్వం ప్రజల మధ్య మతఘర్షణలను పోత్సహిస్తోందని సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌ను ఉద్దేశించి కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. ‘కాంగ్రెస్ అవినీతితో విసిగిపోయిన హరియాణా ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. కానీ, బీజేపీ కూడా అదే అడుగుజాడల్లో నడుస్తోంది. కాబట్టి, మాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి’ అని ఆయన ప్రజలను కోరారు. ఇక కేంద్రంలో ఉన్న బీజేపీ.. రైతులను ఆదుకోవడంలో విఫలమైందని.. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని సుప్రీంకోర్టు చెప్పినా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
మాజీ డీఎస్పీ కుమార్తె, కిడ్నాప్
హిసార్: మాజీ డిప్యూటీ డీఎస్పీ కుమార్తెను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన హర్యానాలోని హిసార్ లో శనివారం చోటు చేసుకుంది. బీఎస్ఎఫ్ విశ్రాంత డిప్యూటీ డీఎస్పీ కుమార్తె(24)ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. రూ.20 లక్షలు ఇస్తేనే ఆమెను వదిలిపెడతామని బెదిరించారు. బాధితురాలి ఫోన్ నుంచే కిడ్నాపర్లు ఈ డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 'మా అమ్మాయి బట్టలు కొనుక్కుంటానని శనివారం సాయంత్రం తన స్కూటర్ పై మార్కెట్ కు వెళ్లింది. మా అమ్మాయిని కిడ్నాప్ చేశారని ఆమె సెల్ ఫోన్ నుంచి కాల్ వచ్చిన తర్వాతే తెలిసింది. రూ. 20 లక్షల తీసుకుని జింద్ రోడ్డుకు రావాలని కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. ఈ విషయం నా భర్తకు చెప్పడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశార'ని బాధిత యువతి తల్లి శకుంతలా దేవి తెలిపారు. కిడ్నాపర్లను పట్టుకునేందుకు ఐదు బృందాలను రంగంలోకి దించినట్టు హిసా ఎస్పీ అశ్విని షెన్వీ తెలిపారు. -
స్వామీజీ ఆశ్రమంలో మృతదేహాలు లభ్యం!
-
స్వామీజీ ఆశ్రమంలో మృతదేహాలు లభ్యం!
బల్వారా: హర్యానా బల్వారా పట్టణంలోని వివాదాస్పద స్వామీజీ రామ్‌పాల్ ... సత్యలోక్ ఆశ్రమంలో మృతి చెందిన నాలుగురు మహిళ మృతదేహాలను ఆశ్రమవాసులు తమకు అప్పగించారని ఆ రాష్ట్ర డీజీపీ ఎస్.ఎన్. వశిష్ట బుధవారం వెల్లడించారు. ఆశ్రమంలో అనారోగ్యంతో ఉన్న మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా...వారు చికిత్స పొందుతూ మరణించారని చెప్పారు. మృతుల్లో ఏడాదిన్నర చిన్నారితోపాటు 70 ఏళ్ల వృద్ధురాలు కూడా ఉందన్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం అఘోరాలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. మృతులు ఢిల్లీకి చెందిన సవిత (31), రోహితక్కి చెందిన సంతోష్ (45) బిజినోర్‌కు చెందిన రాజ్ బాల (70) పంజాబ్‌లోని సంగురూర్కి చెందిన మలికిత్ కౌర్ (50) గా గుర్తించినట్లు చెప్పారు. రామ్ పాల్ ఆచూకీ మాత్రం ఇంతవరకు లభ్యం కాలేదని తెలిపారు. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సత్లోక్ ఆశ్రమ స్వామీజీ రామ్పాల్పై హర్యానా పంజాబ్ ఉమ్మడి హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో స్వామీజీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆశ్రమానికి చేరుకున్నారు. స్వామీజీని అరెస్ట్ చేసేందుకు వీలు లేదంటూ ఆయన భక్తులు, అనుచరులు పోలీసులతో ఘర్షణకు దిగారు. దీంతో స్థానికంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్ చేసి భాష్పవాయువు ప్రయోగించారు. దాంతో పలువురు భక్తులు, అనుచరులు గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రులకు తరలించారు. -
ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లారు!
హిస్సార్: ఏటీఎం మిషన్ ను పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లడం లాంటి తరచుగా వార్తల్లో వింటుంటాం. కాని ఏకంగా ఏటిఎంనే మాయం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన హర్యానా హిస్సార్ లో మోడల్ టౌన్ మార్కెట్ లో జరిగింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎం ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని పోలీసులు తెలిపారు. ఈ ఏటిఎంకి కాపలాగా సెక్యూరిటీ సిబ్బంది లేరని, సీసీటీవీ కెమెరా అమర్చలేదని పోలీసులు తెలిపారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఏటీఎంను దొంగిలించారని పోలీసులు వెల్లడించారు. నిందితులను పట్టుకునేందుకు ఫోరెన్సిక్ లాబరేటరీ నిపుణులు రంగంలోకి దిగారు. చేతి గుర్తుల ఆధారంగా దొంగల్ని పట్టుకునేందుకు ఫోరెన్సిక్ నిపుణుల ప్రయత్నాలు ప్రారంభించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.