
చండీగఢ్ : మహిళా ఉద్యోగిపై దాడి చేశారని ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహిత జై భగవాన్‌పై హరియాణా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒలంపిక్ విజేత జై భగవాన్ ఫతేహాబాద్‌లో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఆయన కుటుంబ సభ్యులకు హిసార్‌లో లోని లక్ష్మీవిహార్ సమీపంలో మద్యం షాపు ఉంది. నిబంధనలకు విరుద్దంగా మద్యం అమ్ముతున్నారని ఆరోపనలు రావడంతో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. గత నెల 19న రాత్రి 9 గంటలకు హీసార్ మహిళా ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీవిహార్‌కు చేరుకొని మద్యం షాపు డాక్యుమెంట్లను చూపించాలని కోరారు.
ఆ సమయంలో అక్కడే ఉన్న జైభగవాన్ ఆమెపై దాడికి పాల్పడ్డారు. నిబంధనల ప్రకారమే మద్యం విక్రయిస్తున్నామంటూ ఆమెను అడ్డుకున్నారు. తన మనుషులతో ఆమెను చుట్టుముట్టారు. అసభ్యకరపదజాలంతో దూషించారు. గంటకు పైగా ఆమె కారును చుట్టిముట్టారు.
దీంతో ఈ విషయాన్ని ఆమె పై అధికారుల వద్దకు తీసుకెళ్లారు. జై భగవాన్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా హిసార్ డిప్యూటీ ఎక్సైజ్ అండ్ టాక్సేషన్ కమిషనర్(డీఈటీసీ) ని కోరారు. జై భగవాన్ వివాదంపై విచారణ చేపట్టాల్సిందిగా డీఈటీసీ హిరాస్ ఎస్పీని ఆదేశించారు. దీంతో ఈ నెల జూన్12 న భగవాన్‌పై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment