assaulting woman
-
మూడేళ్ల క్రితం భర్త మృతి.. ఒంటరి మహిళపై అత్యాచారం ఆ తర్వాత..
మండ్య: వితంతు మహిళను దుండగులు అత్యాచారం జరిపి, హత్య చేసి కాల్చివేశారు. ఈ దారుణ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. ఈ షాకింగ్ ఘటన మద్దూరు తాలూకా మారసింగనహళ్లిలో సోమవారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన దివంగత కుమార ఆరాధ్య భార్య ప్రేమ (42)ను హతురాలిగా గుర్తించారు. వివరాల ప్రకారం.. మృతురాలికి ఒక కుమారుడు ఉండగా బెంగళూరులోని ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆమె కోడలు మండ్య మహిళా కాలేజీలో చదువుతోంది. మారసింగనహళ్లిలో టైలరింగ్ పనిచేస్తున్న ప్రేమ భర్త కుమార ఆరాధ్య పక్షవాతంతో మూడేళ్ల క్రితం మరణించాడు. తరువాత ప్రేమ గ్రామంలోని తన సొంతింట్లో చీటీలు నడుపుకుంటూ ఒంటరిగా జీవిస్తోంది. సోమవారం రాత్రి ఆమె ఇంట్లోకి నిద్రిస్తుండగా చొరబడిన దుండగులు తల దిండుతో ఊపిరి ఆడకుండా చేసి ఆమెను చంపేశారు. మంచంతో సహా మృతదేహాన్ని కాల్చివేసి పరారయ్యారు. ఇంట్లో నుంచి పొగలు వస్తుండడంతో.. మంగళవారం ఉదయం ప్రేమ ఇండి పడక గదిలో నుంచి పొగలు వస్తుండడాన్ని గమనించి ఇరుగుపొరుగు వాసులు వచ్చి చూడగా ప్రేమ మరణించి ఉండడం చూసి నిర్ఘాంత పోయారు. బేసగరహళ్లి పోలీసులు జాగిలాల సహాయంతో పరిశీలించారు. హత్యకు ముందు నిందితులు పడక గదిలోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారం జరిపి ఆ తర్వాత హత్య చేసినట్లు గుర్తించారు. మండ్య మిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ పుట్టస్వామి నేతృత్వంలోని సిబ్బంది మంగళవారం సాయంత్రం ఘటన జరిగిన స్థలంలోనే పోస్టుమార్టమ్ నిర్వహించారు. మద్దూరు రూరల్ సీఐ మనోజ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ ఎన్.యతీశ్, డీఎస్పీ నవీన్ కుమార్, పీఎస్ఐ నవీన్‌కుమార్ తదితరులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. -
పాక్‌లో దారుణం: మహిళా టిక్‌టాకర్‌పై 300 మంది దాడి!
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళా టిక్‌టాకర్‌పై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్ట్14 పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఓ టిక్‌టాకర్ తన ఆరుగురు స్నేహితులతో కలిసి లాహోర్‌లోని మినార్-ఇ-పాకిస్తాన్ వద్ద టిక్‌టాక్ వీడియోను చిత్రీకరించాలనుకున్నారు. ఆ సమయంలో సుమారు 300మంది ఆమెను చుట్టిముట్టి దాడికి పాల్పడ్డారు. ఆమెను గాల్లోకి ఎగరేస్తూ దుస్తులు చించడానికి యత్నించారు. ఆమె చుట్టూ చేరిన వందలాది మంది నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించారు. కానీ ఎంతకు సాధ్యం కాలేదు. ఈ పరిస్థితిని గమనించిన సెక్యూరిటీ గార్డు మినార్-ఇ-పాకిస్తాన్ గేటు తెరవటంతో అక్కడి నుంచి తన స్నేహితులతో ఆమె బయటపడింది. బలవంతంగా ఆమె చేతి ఉన్న ఉంగరం, చెవి రింగులు, తన స్నేహితుల వద్ద ఉన్న మోబైల్ ఫోన్, ఐడీ కార్డు, రూ.15 వేలను లాక్కున్నారు. ఈ ఘటనపై సదరు టిక్‌టాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది. వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. This is one of the many videos that are being shared on WhatsApp groups showing how men were groping her and touching her. Look at the number of people in this video!! All she wanted to do was celebrate Independence Day at minar e Pakistan. Is that a crime? pic.twitter.com/9LPaWAo4wQ — Nida Abbas (@OutOnAbudget) August 16, 2021 -
కోవిడ్ సెంటర్లలో రెచ్చిపోతున్న కామాంధులు
భువనేశ్వర్ : దేశంలో కరోనా దెబ్బకి ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. దీంతో తమని కాపాడాలంటూ కరోనా బాధితులు హాహాకారాలు చేస్తుంటే కామాంధులు మాత్రం మాత్రం రెచ్చిపోతున్నారు. మహిళ ఒంటిరిగా కనిపిస్తే చాలు మీద పడిపోతున్నారు. అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఒడిస్సా కు చెందిన కోవిడ్ వార్డ్ లో దారుణం జరిగింది. కరోనా వార్డ్ లో చికిత్స పొందుతున్న కరోనా బాధితురాలిపై ఓ కామాంధుడు కన్నేశాడు. ఏప్రిల్ 26న కరోనా సోకి నుపాడా జిల్లా ఆస్పత్రిలో ఓ మహిళ అడ్మిట్ అయ్యింది. అయితే అప్పటికే అదే ఆస్పత్రిలో చేరిన కరోనా సోకిన కామాంధుడు బాధితురాలిపై అఘాయిత్యానికి యత్నించాడు. దీంతో నిందితుడి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు కేకలు వేసింది. బాధితురాలి కేకలు విన్న తోటి కరోనా పేషెంట్లు, ఆస్పత్రి సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను రక్షించారు. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ ‘నిందితుడు నాపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. నన్ను నేను రక్షించుకునేందుకు కేకలు వేయడంతో కరోనా బాధితులు తనని రక్షించార’ని పోలీసులకు తెలిపింది. ఆస్పత్రి సిబ్బంది ఫిర్యాదుతో సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు నుపాడా పీఎస్సై సంజుక్తా బార్లా తెలిపారు. ప్రస్తుతం నిందితుడి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం నిందితుడ్ని మరో కోవిడ్ సెంటర్ తరలించినట్లు చెప్పారు. -
70 ఏళ్ల వృద్దురాలిపై అత్యాచారం, హత్య
భోపాల్: ఎన్ని చట్టాలు చేసిన, నిందితులని ఉరి తీస్తున్న దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు ఆగడంలేదు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని పురాతన నగరం విదిశలో 70 ఏళ్ల వృద్దురాలిని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. వృద్దురాలి సొంత వ్యవసాయ క్షేత్రంలో గురువారం ఉదయం మృతదేహన్ని కనుగొన్నారు. బుధవారం రాత్రి పొలానికి కాపలాకి వెళ్లిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె శరీరంలోని రహస్యప్రదేశాలలో తీవ్ర గాయాలున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
దారుణం: జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ..
సాక్షి, హైదరాబాద్ : కన్నతల్లిలా చూసుకోవాల్సిన అత్తను జట్టు పట్టుకొని కోడలు.. విచక్షణారహితంగా కొడుతున్న హృదయ విదారక సన్నివేశం హైదరాబాద్‌లోని మల్లేపల్లిలో వెలుగు చూసింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే.. ఉబైద్ అలీ ఖాన్ అనే వ్యక్తి తల్లి తషనిమా సుల్తానా, తండ్రి అహ్మద్ సాహిద్ ఖాన్‌తో కలిసి హైదరాబాద్‌లోని మల్లేపల్లి ప్రాంతంలో నివసిస్తున్నాడు. కాగా ఉబైద్ వృత్తిరీత్యా గత పదేళ్లుగా సౌదీలో ఉంటున్నాడు. (చదవండి : చిత్తూరులో సైకో వీరంగం) ఈ మధ్యనే ఉబైద్ మొదటి భార్య చనిపోవడంతో 2019లో ఉజ్మా బేగం అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. కాగా పెళ్లైన నెల రోజులకే ఉబైద్ సౌదీ వెళ్లిపోయాడు. అప్పటినుంచి కోడలు ఉజ్మా బేగం అత్త తషనిమా సుల్తానాను వేధింపులకు గురి చేసేది. కొన్నిరోజుల కిందట హుమయూన్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో అత్తా కోడలు ఒకరినొకరు ఫిర్యాదు చేసుకున్నారు. తన మీద ఫిర్యాదు చేసిందన్న కోపంతో ఉజ్మాబేగం అత్తను ఇంటి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించింది. మల్లేపల్లిలోని వారి నివాసం నుంచి తషనిమాను జట్టు పట్టుకొని రోడ్డుపై పడేసి విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. ఇంతలో ఉజ్మా బేగం తల్లి కూడా అక్కడికి చేరుకొని కూతురితో కలిసి తషనిమాను విపరీతంగా కొట్టింది. ఇదంతా గమనిస్తున్న ఒక బాలుడు ఫోన్లో వీడియో తీయబోతుంటే ఉజ్మా బేగం అందుకు అడ్డుకుని, అతడిని అక్కడ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించింది. అయితే ఉజ్మా బేగం చర్యలన్నీ రోడ్డుపై ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ ఘటన బుధవారం(అక్టోబర్ 8న) చోటుచేసుకున్నట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసిన మల్లేపల్లి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
ప్రేమ జంటలే టార్గెట్
ఏకాంతం కోరుకునే ప్రేమికులు, ఇతర జంటలను టార్గెట్ చేస్తూ ఓ ముఠా దోపిడీలు, లైంగిక దాడులకు పాల్పడుతోంది. వీరు తమ అఘాయిత్యాలకు కారంచేడు సమీపంలోని కాలువకట్టను అనువైన ప్రదేశంగా ఎంచుకున్నారు. ఆవైపు ఎవరైనా జంటలు సరదాగా వస్తే వారిని వెంబడించి బెదిరించి డబ్బు, బంగారం, సెల్ఫోన్లు దోపిడీ చేయడం, పరిస్థితులను బట్టి మహిళలు, యువతులపై లైంగిక దాడులకు పాల్పడటం చేస్తున్నారు. ఈ ప్రదేశంలో ఇటువంటి సంఘటనలు గతంలో పలుమార్లు జరిగాయి. తాజాగా శుక్రవారం నాటి సంఘటనతో పోలీసులు, ప్రజలు ఉలిక్కిపడ్డారు. సాక్షి, పర్చూరు: కొత్తవారు ఎవరైనా కారంచేడులో అడుగు పెట్టిన వెంటనే ఓ ముఠా ప్రేమజంటలను టార్గెట్ చేస్తోంది. చీరాలకు చెందిన ఒక ముఠా కొన్నేళ్లుగా ప్రేమ జంటలను టార్గెట్ చేసి వారి వద్ద డబ్బు, విలువైన వస్తువులతో పాటు కొన్ని సందర్భాల్లో లైంగికదాడులకు సైతం పాల్పడుతున్నారు. కేవలం కొందరు ప్రేమజంటలు, వివాహేతర సంబంధాలున్న జంటలు ఈ ముఠాకు బలి అవుతున్నారు. – ప్రస్తుతం జరిగింది ఇలా.. మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి లైంగిక దాడికి పాల్పడటంపై కారంచేడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. సంచలనం రేపిన ఈ కేసును ఛేదించడం పోలీసులకు సవాల్‌గా మారింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చీరాల విఠల్ నగర్‌కు చెందిన మహిళకు చెరుకుపల్లికి చెందిన వ్యక్తితో మూడేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఓ పాప ఉంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ఒకటిన్నర సంవత్సరం కిందట ఇద్దరూ విడిపోయారు. భర్తతో విడిపోయిన ఆ యువతి తల్లిదండ్రుల వద్ద చీరాలో ఉంటోంది. ఆమెకు కొత్తపాలెంనకు చెందిన శివారెడ్డితో పరిచయమైంది. అది వారిద్దరి మధ్య మరింత సాన్నిహిత్యాన్ని పెంచింది. ఈనెల 19వ తేదీ శుక్రవారం సాయంత్రం 7.30 గంటల సమయంలో వారిరువురు కలిసి ద్విచక్రవాహనంపై కారంచేడు కాలువ కట్ట వద్దకు వెళ్లారు. ఆ సమయంలో గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వారి వద్దకు వచ్చి ఒకరు శివారెడ్డిని గట్టిగా పట్టుకొన్నారు. మిగిలిన ఇద్దరు వ్యక్తులు మహిళను బలవంతంగా పక్కకు ఈడ్చుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆగంతకులు శివారెడ్డి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను, రూ. 2,300 నగదును తీసుకొని పారిపోయినట్లు బాధితులు చెప్తున్నారు. శనివారం బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై బి. నరసింహారావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. విచారణ వేగవంతం.. మహిళపై గుర్తు తెలియని వ్యక్తుల సామూహిక లైంగిక దాడికి సంబంధించిన ఫిర్యాదుపై విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే నిందితులను గుర్తించినట్లు సమాచారం. త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని పోలీసు అధికారులు చెప్తున్నారు. గతంలో జరిగింది ఈ ప్రాంతంలోనే.. 2018 నవంబరు 25న చీరాల హయ్యర్‌పేటకు చెందిన బొనిగల సాల్మన్, మరొక మహిళ ద్విచక్రవాహనంపై కారంచేడు రోడ్డులోని కుర్తుల చప్టా మీదుగా వెళుతుండగా చీరాలలోని దండుబాటలో నివసించే దాన గోపి, జయశంకర్ నగర్‌కు చెందిన అన్నం సుధాకర్‌బాబులు పోలీసుల మని చెప్పి వారిని అడ్డుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 4500 నగదులో పాటు సెల్‌ఫోన్‌ను బలవంతంగా తీసుకున్నారు. సాల్మన్‌తో పాటు ఉన్న మహిళను బలవంతంగా లాక్కొని వెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం నిందితులు ద్విచక్రవాహనం పై పారిపోయారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి రూరల్ సీఐ పి. భక్తవత్సలరెడ్డి నేతృత్వంలో ఎస్సై పున్నారావు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకొని అరెస్ట్ చేశారు. ప్రియుడి ప్లానేనా..? – బాధితురాలిని పరామర్శించిన మహిళా కమిషన్ సభ్యురాలు చీరాల: అత్యాచారానికి గురైన బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని మహిళా కమిషన్ సభ్యురాలు రమాదేవి అన్నారు. చీరాల–కారంచేడు రోడ్డులో కారంచేడు సమీపంలోని కాలువ బ్రిడ్జి వద్ద రెండు రోజులు క్రితం చీరాల విఠల్‌నగర్‌కు చెందిన మహిళ, మరో వ్యక్తి ఏకాంతంగా మాట్లాడుతున్న సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన ఇరువురు దాడి చేసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు కారంచేడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఘటనలో బాధితురాలిని చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. బాధితురాలిని ఆదివారం మహిళా కమిషన్ సభ్యురాలు రమాదేవి ఏరియా వైద్యశాలకు వెళ్లి పరామర్శించారు. జరిగిన సంఘటన గురించి వివరాలను అమెను అడిగి తెలుసుకున్నారు. కారకులైన వారికి శిక్ష పడేలా చేసి న్యాయం చేస్తామన్నారు. ఆమె వెంట ఐసీడీఎస్ అర్బన్ సీడీపీఓ బి.నాగమణి ఉన్నారు. ఈ సంఘటనలో లైంగికదాడి చేసిన వారితో ఆమె ప్రియుడికి కూడా సంబంధం ఉందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. -
కేసు కొట్టేశారు కానీ...
హాలీవుడ్ బడా నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు నటి యాష్లీ జడ్. ‘‘అవకాశం కావాలంటే అడిగినవాటికి అంగీకరించాలని పెట్టిన కండీషన్‌కి ఒప్పుకోలేదని తన స్టేటస్‌ని ఉపయోగించి జూడ్ ఇమేజ్‌ని చెడగొట్టి, హార్వీ అవకాశాలు తగ్గేలా చేశాడు’ అన్నది ఆ ఆరోపణల సారాంశం. ఈ ఆరోపణ తర్వాత దాదాపు 80 మంది నటీమణులు వెయిన్‌స్టీన్ మీద లైంగిక ఆరోపణలు చేశారు. వెయిన్‌స్టీన్ పై కేసులు కూడా నమోదు అయ్యాయి. ‘అడ్జస్ట్ మెంట్స్’ అన్నీ పరస్పర అంగీకారంతోనే జరిగాయని, ఎవ్వర్నీ కావాలని ఇబ్బందికి గురి చేయలేదని వెయిన్‌స్టీన్ వాదించారు. ఈ ఆరోపణలే ‘మీటూ’ ఉద్యమానికి కారణమయ్యాయి. 2017 చివరి నుంచి నడుస్తున్న ఓ కేసు తీర్పు ఇటీవల వెలువడింది. సరైన ఆధారాలను పొందుపరచని కారణంగా వెయిన్‌స్టీన్‌పై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది కాలిఫోర్నియా న్యాయస్థానం. లైంగిక వేధింపుల కేసు కొట్టిపారేసినా పరువు నష్టం దావా విషయంలో లీగల్‌గా ముందు వెళ్లొచ్చని పేర్కొంది. ఇదిలా ఉంటే ఇంకా పలు కేసుల నిమిత్తం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు వెయిన్‌స్టీన్. -
వీరిని ‘మీ టూ’ చేరేదెలా?
లైంగిక వేధింపులపై నిరసనగా ప్రారంభమైన ‘మీ టూ’ ఉద్యమం.. పెద్ద మనుషులుగా చెలామణీ అవుతున్న కొందరు వ్యక్తుల నిజ రూపాలు బట్టబయలు చేసింది. వినోదం, మీడియా రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు ‘మీ టూ’ ఉద్యమం కారణంగా తెరపైకి వచ్చాయి. అయితే, పలు ఇతర రంగాల్లోని మహిళలు పని ప్రదేశాల్లో ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు బట్టబయలయ్యే స్థాయికి ఈ ఉద్యమం చేరుకోలేదు. అసంఘటిత రంగంలోని శ్రామిక మహిళలు భరిస్తున్న వేధింపుల వేదన వారి పెదవి దాటడం లేదు. పనిప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించే చట్టం గురించి గానీ, మీటూ ఉద్యమం గురించి గానీ తెలియని లక్షలాది మంది మహిళలు మనదేశంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. ఇళ్ళల్లో పనిచేసే మహిళలపై జరుగుతున్న లైంగిక హింస తీవ్రత పూర్తి స్థాయిలో బయటకు తెలియడం లేదు. దీనికి సంబంధించి పలు రాష్ట్రాల్లో కొన్ని సర్వేలు జరిగాయి. గ్రామాలను వీడి పట్టణాలకు వలస వచ్చిన లక్షలాది మందిలో అత్యధికులు ఇళ్లల్లో పనివారుగా చేరుతారు. వారిలో మహిళలే ఎక్కువ. ఆ మహిళలపై జరిగే లైంగిక హింసకు అంతే లేని పరిస్థితి ఉంది. తామున్న దుర్భర ఆర్థిక పరిస్థితుల కారణంగా తమపై జరుగుతున్న లైంగిక దాడుల గురించి వారు బయటకు చెప్పుకోలేరు. కుటుంబం నుంచి లభించే సహానుభూతి తక్కువే. ఇంటిపని చేసే స్త్రీల సమస్యలపై పనిచేసే హరియాణాలోని గురుగావ్‌లో ఉన్న ‘మహిళా కామ్‌గార్ సంఘటన్’ ఇటీవలే అసంఘటిత రంగ శ్రామిక మహిళల్లో మీటూ ఉద్యమ చైతన్యాన్ని నింపే కార్యక్రమాన్ని చేపట్టింది. తమపై జరిగే లైంగిక వేధింపులు, హింస పట్ల నిశ్శబ్దాన్ని వీడాలని ప్రచారం చేస్తోంది. ఈ సంస్థలో దాదాపు 7000 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఇళ్ళల్లో పనిచేసుకునే మహిళలపై జరిగే లైంగిక వేధింపులు పెద్దగా బయటకు రావని, రేప్ జరిగినప్పుడే ఫిర్యాదు చేసే పరిస్థితి ఉందని ఆ సంస్థ వ్యవస్థాపకురాలు అనితాయాదవ్ చెప్పారు. వేధింపులపై సర్వే దేశంలో మొత్తం 42 లక్షల మంది ఇళ్లల్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అందులో 29 లక్షల మంది మహిళలు, 13 లక్షల మంది పురుషులు ఉన్నారు. గురుగ్రామ్, ఫరీదాబాద్, దక్షిణ ఢిల్లీ ప్రాంతాల్లో ఇళ్లల్లో పనిచేసుకునే పార్ట్‌టైం శ్రామిక మహిళలపై మార్తా ఫారెల్ ఫౌండేషన్ ఇటీవల జరిపిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూసాయి. ఆ వివరాలు.. ► పనిప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురైన వారు 29% కాగా, వారిలో 19% ఆ వేధింపులను మౌనంగా భరించారు. వారిలో 10% కుటుంబ సభ్యులకు, తోటి పనివారికి చెప్పారు. ► వేధింపులు తాళలేక పని వదిలేసి వెళ్ళిన వారు 2.3% ► యజమానుల చేతిలో అవమానాలకు గురైన వారు 61.8%. 2012లొ ఆక్స్‌ఫామ్ ఇండియా అధ్యయనంలో కూడా శ్రామిక మహిళల్లో 29 శాతం మంది పని ప్రదేశాల్లో తీవ్రమైన వేధింపులను ఎదుర్కొంటున్నట్టు వెల్లడైంది. ఇళ్ళల్లో పనిచేసుకుని బతికే స్త్రీల్లో 23 శాతం మంది, చిన్నతరహా పరిశ్రమల్లో పనిచేసే మహిళల్లో 16 శాతం మంది నిత్యం లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. డొమెస్టిక్ వర్కర్స్ రక్షణ కోసం రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కమిటీలను ఏర్పాటు చేసి వాటిని జిల్లాలోని లోకల్ కంప్లెయింట్స్ కమిటీలకు అనుసంధానం చేయాలని హార్వర్డ్ మిట్టల్ ఇనిస్టిట్యూట్ ఇండియా డైరెక్టర్ సంజయ్‌కుమార్ సూచిస్తున్నారు. -
వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ఆత్మహత్య
మొయినాబాద్(చేవెళ్ల) : పదకొండేళ్లు భర్త వేధింపులను భరించింది. అయినా భర్తలో మార్పు రాకపోగా వేధింపులు మరింత ఎక్కువ కావడంతో ఓ వివాహిత భరించలేక తనువు చాలించింది. ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కనకమామిడి గ్రామానికి చెందిన చనుగొముల శ్రీనివాస్‌కు సరూర్‌నగర్ మండలం నాదర్గుల్కు చెందిన అరుణ(30)ను ఇచ్చి 11 సంవత్సరాల క్రితం వివాహం జరిపించారు. వీరికి కూతురు తేజ(8), కొడుకు సోను(6) ఉన్నారు. కొంతకాలం పాటు వారి కాపురం సాఫీగానే సాగింది. ఆ తరువాత భర్త శ్రీనివాస్ భార్యను వేధించడం మొదలు పెట్టాడు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరగడంతో పలుమార్లు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి సర్ది చెప్పారు. అయినా వారి తీరులో మార్పు రాలేదు. దీంతో రెండేళ్ల క్రితం అరుణ.. భర్త, పిల్లలను వదిలి తల్లిగారింటికి వెళ్లింది. అప్పటి నుంచి శ్రీనివాస్ మొయినాబాద్ మండల కేంద్రంలోని విజయనగర్ కాలనీలో ఇస్త్రీ డబ్బా పెట్టుకుని జీవిస్తున్నాడు. కాగా గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు సర్ది చెప్పడంతో రెండు నెలల క్రితం అరుణ మళ్లీ భర్త వద్దకు చేరుకుంది. విజయనగర్కాలనీలోనే ఇళ్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. కాగా శుక్రవారం భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ జరిగింది. శుక్రవారం రాత్రి పిల్లలతో కలిసి ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. శనివారం ఉదయం శ్రీనివాస్ పాల ప్యాకెట్ తేవడానికి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి అరగంట తరువాత తిరిగి వచ్చాడు. అప్పటికే అరుణ చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అప్పటికీ పిల్లలు నిద్ర లేవలేదు. గమనించిన చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. కడుపునొప్పితో నవ వధువు.. తాండూరు రూరల్: కడుపునొప్పి భరించలేక ఓ నవ వధువు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని నారాయణపూర్‌లో గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. కరన్‌కోట్ ఎస్సై రేణుకారెడ్డి కథనం ప్రకారం... నారాయణపూర్ గ్రామానికి చెందిన కుర్వ జ్యోతి(24)ని తాండూరు మండలం చంద్రవంచ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌కు ఇచ్చి మూడు నెలల క్రితం వివాహం చేశారు. కొన్ని రోజులుగా జ్యోతి కడుపునొప్పితో బాధపడుతోంది. ఏరువాక పండుగ సందర్భంగా జ్యోతి తన భర్త శ్రీనివాస్‌తో కలిసి పుట్టిళ్లు అయిన నారాయణపూర్‌కు వచ్చింది. కడుపునొప్పి భరించలేక జ్యోతి శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగింది. వెంటనే ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జ్యోతి శనివారం ఉదయం మృతి చెందింది. జ్యోతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కడుపునొప్పికి తాళలేక యువకుడు.. శంకర్పల్లి: కడుపునొప్పి భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలకేంద్రంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్పల్లి పట్టణ కేంద్రానికి చెందిన ప్రవీణ్‌గౌడ్(22) కుటుంబ సభ్యులతో కలిసి రిత్విక్ వెంఛర్‌లో ఉంటాడు. గత కొన్ని రోజుల నుంచి తీవ్ర కడుపునొప్పితో బాధ పడుతుండేవాడు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాత్రి 10గంటల సమయంలో ఉరి వేసుకున్నాడు. చుట్టు పక్కల వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకొని బోరున విలపించారు. తండ్రి వెంకటేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
పోలీస్ అని చెప్పి...
పంజగుట్ట : పోలీస్ అనిచెప్పి మహిళ సెల్‌ఫోన్, నగదు లాక్కుని ఆమె మొబైల్ నుండే బాధితురాలి కుటుంబ సభ్యులకు అసభ్యకర మెసేజ్‌లు పెడుతున్న వ్యక్తిని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పంజగుట్ట క్రైమ్ ఇనిస్పెక్టర్ షేక్ షఫీ తెలిపిన మేరకు హుజూర్‌నగర్‌కు చెందిన కంభంపాటి సాహితి అమీర్‌పేట బిగ్‌బజార్ సమీపంలో ఓ హాస్టల్లో ఉంటూ యానిమేషన్ కోర్సు చేస్తుంది. ఈ నెల 23వ తేదీన సాహితి తన స్నేహితుడు షేక్ రహమాన్‌తో కలిసి అమీర్‌పేట షాలీమార్ జంక్షన్ వద్ద నుండి నడుచుకుంటూ వస్తుండగా ఓ గుర్తుతెలియని వ్యక్తి వచ్చి తాను పోలీసునని ఇక్కడ ఏంచేస్తున్నారంటూ గద్దించాడు. మీపైన కేసులు బనాయించి స్టేషన్లో పెడాతానని భయపెట్టి వారి మొబైల్ఫోన్లు లాక్కున్నారు. మరుసటి రోజు నగదు తీసుకువచ్చి మొబైల్ఫోన్లు తీసుకువెళ్లాలని ఆదేశించారు. మరుసటిరోజు వీరు నాలుగువేలు తీసుకుని అతనివద్దకు వెళ్లగా ఉన్న నగదు లాక్కుని మొబైల్స్ కూడా ఇవ్వకుండా బెదిరించి పంపించేశాడు. అంతటితో ఆగక బాధితురాలి ఫోన్ నుండే ఆమె తల్లికి సామాజిక మాధ్యమాలద్వారా అసభ్యకర సందేశాలు పంపిస్తున్నాడు. అతని బాధ భరించలేక శుక్రవారం బాధితులు పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు వికారాబాద్‌కు చెందిన పి.రాణాప్రతాప్ (22) నగరంలో ఎర్రగడ్డలో నివసిస్తూ ఈ తతంగం చేస్తున్నాడని గుర్తించారు. ఎర్రగడ్డలో మొబైల్‌ఫోన్ అమ్మేందుకు యత్నిస్తుండగా అరెస్టు చేసి అతని వద్ద నుండి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. -
మహిళా ఉద్యోగిపై దాడి.. ప్రముఖ బాక్సర్‌పై కేసు
చండీగఢ్ : మహిళా ఉద్యోగిపై దాడి చేశారని ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహిత జై భగవాన్‌పై హరియాణా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒలంపిక్ విజేత జై భగవాన్ ఫతేహాబాద్లో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు హిసార్‌లో లోని లక్ష్మీవిహార్ సమీపంలో మద్యం షాపు ఉంది. నిబంధనలకు విరుద్దంగా మద్యం అమ్ముతున్నారని ఆరోపనలు రావడంతో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. గత నెల 19న రాత్రి 9 గంటలకు హీసార్ మహిళా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీవిహార్కు చేరుకొని మద్యం షాపు డాక్యుమెంట్లను చూపించాలని కోరారు. ఆ సమయంలో అక్కడే ఉన్న జైభగవాన్ ఆమెపై దాడికి పాల్పడ్డారు. నిబంధనల ప్రకారమే మద్యం విక్రయిస్తున్నామంటూ ఆమెను అడ్డుకున్నారు. తన మనుషులతో ఆమెను చుట్టుముట్టారు. అసభ్యకరపదజాలంతో దూషించారు. గంటకు పైగా ఆమె కారును చుట్టిముట్టారు. దీంతో ఈ విషయాన్ని ఆమె పై అధికారుల వద్దకు తీసుకెళ్లారు. జై భగవాన్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా హిసార్ డిప్యూటీ ఎక్సైజ్ అండ్ టాక్సేషన్ కమిషనర్(డీఈటీసీ) ని కోరారు. జై భగవాన్ వివాదంపై విచారణ చేపట్టాల్సిందిగా డీఈటీసీ హిరాస్ ఎస్పీని ఆదేశించారు. దీంతో ఈ నెల జూన్12 న భగవాన్‌పై కేసు నమోదు చేశారు. -
అందంగా ఉన్నావంటూ చేతులేసి...
బీజింగ్: మహిళా ప్రయాణికురాలిపై లైంగిక దాడికి యత్నించిన క్యాబ్ డ్రైవర్‌ను చైనా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన సిచువాన్ ప్రావిన్సులోని లేషాన్లో గత వారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఫయూన్ టాక్సీ కంపెనీకి చెందిన క్యాబ్‌ను సదరు మహిళ బుక్ చేసుకుంది. క్యాబ్‌లో ఎక్కిన తర్వాత డ్రైవర్ ఆమెతో మాటలు కలిపాడు. అందంగా ఉన్నావంటూ ఆమె వివరాలు తెలుసుకునే యత్నం చేశాడు. ఆపై ఆమెపై చేతులేసి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె ప్రతిఘటించేసరికి లైంగిక దాడికి యత్నించాడు. ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదంతా పగటిపూటే చోటు చేసుకోవటం గమనార్హం. ఇక కారులోని కెమెరాను పరిశీలించిన పోలీసులు డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించింది నిజమేనని నిర్ధారించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితునిపై కేసు నమోదు చేసి 10 రోజుల రిమాండ్‌కు పంపించారు. అతని లైసెన్స్ కూడా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక క్యాబ్ డ్రైవర్ నిర్వాకంపై ‘లేషాన్ ఫయూన్ టాక్సీ కంపెనీ’ స్పందించింది. సదరు డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించినట్లు ప్రకటించింది.ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది. కాగా, చైనాలో ఈ తరహా నేరాలు ఇటీవల తరచుగా చోటుచేసుకుంటున్నాయి. ఈ మధ్యే హెనాన్ ప్రావిన్సులోని జెంగ్జావూలో ఓ యువతి అతికిరాతకంగా అత్యాచారం, హత్యకు గురైంది. -
ముస్లిం స్నేహితుడితో వెళ్తున్న యువతిపై దాడి..
-
యువతి జుట్టు పట్టుకుని..ఈడ్చి కొట్టారు..
గుహవటి: స్నేహితునితో కలిసి మెడికల్ షాప్‌కు వెళ్తున్న 22 ఏళ్ల గారో తెగకు చెందిన యువతిపై మద్యం మత్తులో ఉన్న కొందరు వ్యక్తులు దాడి చేశారు. అస్సాంలోని గొలపర జిల్లాలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. తమ కులం, మతం కాని వ్యక్తితో తిరుగుతోందని తాగుబోతులు ఈ అకృత్యానికి పాల్పడ్డారు. ఆమెను జుట్టు పట్టుకుని కొట్టారు. దుర్భాషలాడతూ కాళ్లతో తన్నారు. ఆమెతో ఉన్న ముస్లిం యువకుడిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. భయంతో యువతి తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా మరోమారు ఆమెను కాలితో తన్ని ఫోన్ లాక్కున్నారు. అంతేకాకుండా తమ నిర్వాకాన్ని వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. యువతీ, యువకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జిల్లా ఎస్పీ అమితాబ్ సిన్హా కేసు వివరాలు వెల్లడించారు. యువతికి ఇటీవలే వివాహం నిశ్చయమైందనీ, ఆమె తన ముస్లిం స్నేహితునితో కలిసి మెడికల్ షాప్‌కు వెళ్తుండగా వారిని అపార్థం చేసుకుని నిందితులు ఈ దాడికి పాల్లడ్డారని ఆయన తెలిపారు. వారిద్దరి మధ్య ఉన్న సంబంధమేంటో చెప్పాలని ఆమెను నిలదీశారని ఆయన చెప్పారు. ఈ ఘటనలో 12 మందిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ పేర్కొన్నారు. దాడికి ప్రోత్సహించిన ప్రధాన నిందితుడిని విచారిస్తున్నామని సిన్హా అన్నారు. ఉద్దేశ పూర్వకంగా ఈ దాడి జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. ఈ గొడవతో మత ఘర్షణలు తెలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. అమానుషంగా, అనైతికంగా బాధిత యువతిపై దాడి చేస్తున్నప్పుడు అక్కడున్న వారెవరూ అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం బాధాకరమని మేఘాలయ ఉమెన్ రైట్స్ కార్యకర్త జైనీ సంగ్మా ఆగ్రహం వ్య్తక్తం చేశారు. -
పార్కింగ్ స్థలం కోసం మహిళపై నటుడి దాడి
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. పార్కింగ్ స్థలం విషయమై ఆయన తనపై భౌతికంగా దాడి చేసి, అసభ్యంగా ప్రవర్తించినట్టు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముంబైలోని యారి రోడ్డులో ఉన్న జోహ్రా అఘాది నగర్ హౌసింగ్ సొసైటీలో ఈ ఘటన జరిగింది. నవాజుద్దీన్‌తోపాటు ఫిర్యాదుదారు కూడా ఇదే సొసైటీలో నివాసం ఉంటున్నారు. ఏడాది కిందట ఈ హౌసింగ్ సొసైటీలోకి మకాం మార్చిన నవాజుద్దీన్ సిద్దిఖీ పార్కింగ్ స్థలాన్ని పూర్తిగా ఆక్రమించారని, ఈ విషయమై ఆదివారం మధ్యాహ్నం వాగ్వాదం జరుగడంతో అతను, అతని సోదరుడు, సిబ్బంది తన కూతురితో అసభ్యంగా ప్రవర్తించి, తోసేశారని సొసైటీ చైర్మన్ సోనా దండేకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ సెక్షన్ 354 (మహిళపై దాడి, నేరపూరిత బలప్రయోగం) ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మూడేళ్ల ఫ్రెండ్షిప్..మూన్నాళ్ల ముచ్చటే
-
ప్రియురాలికి చిత్రహింసలు.. పోలీసులకు తిట్లు
సింగపూర్: ప్రియురాలిని చిత్రహింసలు పెట్టడమే కాకుండా పోలీసులను నోటికొచ్చినట్టు తిట్టినందుకు సింగపూర్ లో భారతీయుడొకరు జైలు పాలయ్యాడు. నిందితుడు మురుగన్ సుబ్రమణియన్(44)కు కోర్టు 8 నెలల జైలు శిక్ష, సుమారు రూ. 2 లక్షల జరిమానా విధించిందని స్థానిక మీడియా వెల్లడించింది. తన మాజీ భర్త ఫోటోలు ఫేస్ బుక్ లో పెట్టినందుకు ప్రియురాలు రాధిక రాజావర్మ(31)తో మురుగన్ ఘర్షణ పడ్డాడు. అక్కడితో ఆగకుండా ఆమె ముఖంపై సిగరెట్ తో వాతలు పెట్టాడు. మార్చి 31న అతడీ దారుణానికి పాల్పడ్డాడు. దీనికి 15 రోజుల ముందు స్నేహితుల ముందు తనను అవమానించిందని రాధికతో గొడవపడ్డాడు. ఆమె గదిలోకి వెళ్లి తలుపులు వేసుకోవడంతో పూలకుండీలు ధ్వంసం చేసి రభస సృష్టించాడు. సమాచారం అందుకుని తన ఇంటికి వచ్చిన పోలీసులపై నోరు పారేసుకున్నాడు. తన సోదరి మేడమ్ విలాహ్, ఆమె 16 ఏళ్ల కుమార్తెను కత్తితో బెదిరించాడు. ప్రియురాలిని హింసించిన కేసులో అతడికి విధించిన జైలు శిక్ష ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వస్తుందని కోర్టు ప్రకటించింది. -
ఆమే నన్ను మోసం చేసింది!
నాగార్జున ‘గగనం’, కల్యాణ్‌రామ్ ‘కత్తి’, మనోజ్ ‘మిస్టర్ నూకయ్య’ చిత్రాల్లో నటించిన సనాఖాన్ మనవాళ్లకు పరిచయమే. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే నటి ఆమె. వ్యక్తిగత విషయాలను మీడియాకు లీక్ చేశారని ఆరోపిస్తూ, మీడియా కన్సల్టెంట్ అయిన ఒక మహిళపై దాడి చేసినందుకు గాను సల్మాన్‌ఖాన్ ‘జై హో’ చిత్ర ఫేమ్ సనా ఖాన్‌నూ, ఆమె బాయ్‌ఫ్రెండ్ ఇస్మాయిల్ ఖాన్‌నూ ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారంలో వారిని ఆనక జామీనుపై విడుదల చేశారు. అయితే, ఈ మొత్తం వ్యవహారంపై సనా ఖాన్ వాదన మాత్రం మరోలా ఉంది. నిజానికి, మీడియా కన్సల్టెంట్ అయిన పూనమ్ ఖన్నాయే తమను మోసం చేశారంటున్నారు. ‘‘ఆధ్యాత్మిక శక్తులున్న వ్యక్తిలా నటిస్తూ, పూనమ్ ఖన్నా మాకు దగ్గరయ్యారు. మా కుటుంబంలో నేనొక్కదాన్నే సంపాదనపరురాలిని కావడంతో, భవిష్యత్తు కోసం స్థిరాస్తులు కొనాలనుకున్నాను. అక్కడ కూడా డబ్బుల విషయంలో ఆమె మమ్మల్ని నమ్మించి, మోసం చేశారు. విషయం తెలిసి ఆమెకు కొంతకాలంగా దూరంగా ఉంటున్నా. నా డబ్బులు వాపసు ఇవ్వాల్సిందిగా అడిగినప్పుడల్లా ఆరోగ్యం బాగా లేదంటూ ఆసుపత్రిలో చేరుతోందామె’’ అని సనా ఖాన్ వాదిస్తున్నారు. పూనమ్ చేతుల్లో ఇప్పటికే చాలా మంది మోసపోయారనీ, ఆమెపై ఇప్పటికే 8 కేసులు పెండింగ్‌లో ఉన్నాయనీ ఆమె పేర్కొన్నారు. ‘‘ఈ వ్యవహారం చివరికంటా తేల్చుకుంటాను. నిజం నిరూపిస్తాను’’ అని ఈ నటి అంటున్నారు. మొత్తానికి, సనా ఖాన్ వాదనతో కథ కొత్త మలుపు తిరిగింది.