
హార్వీ వెయిన్‌స్టీన్
హాలీవుడ్ బడా నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు నటి యాష్లీ జడ్. ‘‘అవకాశం కావాలంటే అడిగినవాటికి అంగీకరించాలని పెట్టిన కండీషన్‌కి ఒప్పుకోలేదని తన స్టేటస్‌ని ఉపయోగించి జూడ్ ఇమేజ్‌ని చెడగొట్టి, హార్వీ అవకాశాలు తగ్గేలా చేశాడు’ అన్నది ఆ ఆరోపణల సారాంశం. ఈ ఆరోపణ తర్వాత దాదాపు 80 మంది నటీమణులు వెయిన్‌స్టీన్ మీద లైంగిక ఆరోపణలు చేశారు. వెయిన్‌స్టీన్ పై కేసులు కూడా నమోదు అయ్యాయి. ‘అడ్జస్ట్ మెంట్స్’ అన్నీ పరస్పర అంగీకారంతోనే జరిగాయని, ఎవ్వర్నీ కావాలని ఇబ్బందికి గురి చేయలేదని వెయిన్‌స్టీన్ వాదించారు.
ఈ ఆరోపణలే ‘మీటూ’ ఉద్యమానికి కారణమయ్యాయి. 2017 చివరి నుంచి నడుస్తున్న ఓ కేసు తీర్పు ఇటీవల వెలువడింది. సరైన ఆధారాలను పొందుపరచని కారణంగా వెయిన్‌స్టీన్‌పై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది కాలిఫోర్నియా న్యాయస్థానం. లైంగిక వేధింపుల కేసు కొట్టిపారేసినా పరువు నష్టం దావా విషయంలో లీగల్‌గా ముందు వెళ్లొచ్చని పేర్కొంది. ఇదిలా ఉంటే ఇంకా పలు కేసుల నిమిత్తం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు వెయిన్‌స్టీన్.
Comments
Please login to add a commentAdd a comment