Ashley
-
ముంబైలో లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొన్న ఎబ్కో డైరెక్టర్
-
నటి దారుణ హత్య.. 47 కత్తిపోట్లు: నిందితుడికి ఉరిశిక్ష
వాషింగ్టన్/కాలిఫోర్నియా: ప్రముఖ హాలీవుడ్ నటి ఆష్లే షెర్లిన్‌తో పాటు మరో మహిళను హత్య చేసినందుకు గాను ‘హాలీవుడ్ రిప్పర్’గా ప్రసిద్ధి చెందిన మైఖెల్ గార్గిలోకు లాస్ ఏంజిల్స్ కోర్టు మరణశిక్ష విధించింది. 20 ఏళ్ల క్రితం జరిగిన ఈ నేరాలతో పాటు మరో హత్యాయత్నం కేసులో 2019లోనే మైఖెల్ దోషిగా తేలాడు. ఈ క్రమంలో కోర్టు 2021, జూలైలో అతడికి మరణ శిక్ష విధించింది. నిందితుడు మైఖెల్.. హాలీవుడ్ నటి ఆష్లే ఎల్లరిన్తో పాటు మరో మహిళ మరియా బ్రూనోను దారుణంగా హత్య చేయడమే కాక మరో స్త్రీపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. 'హాలీవుడ్ రిప్పర్'గా పిలిచే మైఖేల్ 2001, ఫిబ్రవరిలో కాలిఫోర్నియాలో ఆష్లే ఎల్లెరిన్(22) నివాసంలోనే ఆమెను దారుణంగా పొడిచి చంపాడు. ఆమె శరీరంపై 47 కత్తిపోట్లు ఉన్నాయి. హత్యకు గురైన నాటి రాత్రి ఆష్లే, తన సహానటుడు ఆస్టన్ కుచర్‌తో డేట్‌కు వెళ్లాల్సి ఉంది. ఎల్లెరిన్ కోసం హాలీవుడ్‌లోని ఆమె ఇంటికి వెళ్లిన నటుడు కుచర్ తలుపు తట్టినా ఆమె తీయలేదు. కిటికీలోంచి ఆయన చూడగా నేలపై ఏదో పడినట్లు కనిపించింది. వైన్ పడి ఉంటుందని భావించి వెళ్లిపోయాడు కుచర్. ఆ మరసుటి రోజు ఎల్లరిన్ శవాన్ని ఆమె ఇంట్లో గుర్తించారు. ఈ క్రమంలో నటుడు కుచర్ ఈ కేసులో ముఖ్య సాక్షిగా మారాడు. ఆ తర్వాత మైఖెల్ 2005లో మారియా బ్రూనో(32) అనే మహిళను దారుణంగా హత్య చేశాడు. బ్రూనో హత్య జరిగిన మూడేళ్ల తర్వాత అనగా 2008, జూన్‌లో మైఖేల్ మరో మహిళ మిషెల్లె మర్ఫీపైన దాడి చేశాడు. ఆమె ఇంట్లో ప్రవేశించి.. కత్తితో దాడి చేసి హత్య చేయాలని భావించాడు. కానీ అదృష్టవశాత్తు మర్ఫీ తప్పించుకున్నారు. అనంతరం మర్ఫీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మైఖెల్ నేరాలు వెలుగు చూశాయి. ఇక మర్ఫీపై దాడి తరువాత అక్కడి నుంచి పారిపోయినప్పటికీ సంఘటనా స్థలంలో మైఖేల్ రక్తం ఉండటంతో దాని ఆధారంగా శాంటమోనికా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. మర్ఫీ ఈ కేసులో ప్రధాన సాక్ష్యిగా ఉన్నారు. రెండు హత్యలు, ఒక హత్యాయత్నం అభియోగాలు ఎదుర్కొన్న మైఖేల్ విచారణ సందర్భంగా తాను అమాయకుడినకని కోర్టుకు తెలిపేవాడు. లాస్ ఏంజిల్స్‌లోని ఓ న్యాయస్థానం ఈ కేసులకు సంబంధించి మైఖెల్‌కు మరణశిక్ష విధించింది. కాకపోతే ఈ శిక్ష అమలు చేయడానికి వీలు లేదు. ఎందుకంటే కాలిఫోర్నియా రాష్ట్రంలో 2019 నుంచి మరణశిక్షల అమలుపై నిషేధం ఉంది. 2006 తరువాత కాలిఫోర్నియాలో మరణశిక్షలు అమలు కాలేదు. మరోవైపు 1993లో ఒక 18 ఏళ్ల అమ్మాయిని చంపిన కేసులోనూ మైఖేల్ ముద్దాయిగా ఉన్నాడు. ఇందుకు సంబంధించి ఇల్లినాయిస్లో ఈ కేసు విచారణ జరిగింది. -
కేసు కొట్టేశారు కానీ...
హాలీవుడ్ బడా నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు నటి యాష్లీ జడ్. ‘‘అవకాశం కావాలంటే అడిగినవాటికి అంగీకరించాలని పెట్టిన కండీషన్‌కి ఒప్పుకోలేదని తన స్టేటస్‌ని ఉపయోగించి జూడ్ ఇమేజ్‌ని చెడగొట్టి, హార్వీ అవకాశాలు తగ్గేలా చేశాడు’ అన్నది ఆ ఆరోపణల సారాంశం. ఈ ఆరోపణ తర్వాత దాదాపు 80 మంది నటీమణులు వెయిన్‌స్టీన్ మీద లైంగిక ఆరోపణలు చేశారు. వెయిన్‌స్టీన్ పై కేసులు కూడా నమోదు అయ్యాయి. ‘అడ్జస్ట్ మెంట్స్’ అన్నీ పరస్పర అంగీకారంతోనే జరిగాయని, ఎవ్వర్నీ కావాలని ఇబ్బందికి గురి చేయలేదని వెయిన్‌స్టీన్ వాదించారు. ఈ ఆరోపణలే ‘మీటూ’ ఉద్యమానికి కారణమయ్యాయి. 2017 చివరి నుంచి నడుస్తున్న ఓ కేసు తీర్పు ఇటీవల వెలువడింది. సరైన ఆధారాలను పొందుపరచని కారణంగా వెయిన్‌స్టీన్‌పై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది కాలిఫోర్నియా న్యాయస్థానం. లైంగిక వేధింపుల కేసు కొట్టిపారేసినా పరువు నష్టం దావా విషయంలో లీగల్‌గా ముందు వెళ్లొచ్చని పేర్కొంది. ఇదిలా ఉంటే ఇంకా పలు కేసుల నిమిత్తం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు వెయిన్‌స్టీన్. -
నాలుగేళ్ల బాలుడిపై 10 ఏళ్ల బాలిక రేప్
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో ఓ నాలుగేళ్ల బాలుడిపై 10 ఏళ్ల బాలిక 'అశిలి' రేప్ చేసిన సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని స్థానిక మీడియా బుధవారం ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది మేలో అశిలి తన ఇంటి పరిసరాల్లోని చిన్నారులతో కలసి 'డాక్టర్' ఆట ఆడిందని, ఆ సమయంలో ఆ బాలుడిపై అశిలి రేప్ చేసిందని పేర్కొంది. అశిలి తనతో ప్రవర్తించిన తీరును ఆ బాలుడు తన తల్లితండ్రులకు వివరించాడని తెలిపింది. దాంతో వారు ఆ ఆస్ట్రేలియా పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు అశిలిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని వెల్లడించింది. అనంతరం ఆమెను హ్యరీస్ కౌంటీ జువైనల్ కేంద్రానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయితే అశిలి తల్లి మాత్రం తన కుమార్తెను సమర్థించుకుంది. ఆ ఘటన పీడకల అని ఆమె వ్యాఖ్యానించింది. అశిలిని విచారిస్తున్నప్పుడు తాను పక్కనే ఉంటాను అన్న ఆ తల్లి అభ్యర్థనను హౌస్టన్ పోలీసు ఉన్నతాధికారులు విచారించారు. దాంతో చేసేది లేక ఆ చిన్నారిని వదిలి జువైనల్ గది నుంచి వెలుపలకు వచ్చింది. ఆ రేప్ కేసులో అశిలికి ఆక్టోబర్‌లో కోర్టు శిక్ష విధించే అవకాశం ఉంది.