నాలుగేళ్ల బాలుడిపై 10 ఏళ్ల బాలిక రేప్ | 10-year-old girl accused of raping 4-year old boy! | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల బాలుడిపై 10 ఏళ్ల బాలిక రేప్

Published Wed, Aug 28 2013 2:27 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

10-year-old girl accused of raping 4-year old boy!

మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో ఓ నాలుగేళ్ల బాలుడిపై 10 ఏళ్ల బాలిక 'అశిలి' రేప్ చేసిన సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని స్థానిక మీడియా బుధవారం ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది మేలో అశిలి తన ఇంటి పరిసరాల్లోని చిన్నారులతో కలసి 'డాక్టర్' ఆట ఆడిందని, ఆ సమయంలో ఆ బాలుడిపై అశిలి రేప్ చేసిందని పేర్కొంది. అశిలి తనతో ప్రవర్తించిన తీరును ఆ బాలుడు తన తల్లితండ్రులకు వివరించాడని తెలిపింది. దాంతో వారు ఆ ఆస్ట్రేలియా పోలీసులను ఆశ్రయించారు.

పోలీసులు అశిలిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని వెల్లడించింది. అనంతరం ఆమెను హ్యరీస్ కౌంటీ జువైనల్ కేంద్రానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయితే అశిలి తల్లి మాత్రం తన కుమార్తెను సమర్థించుకుంది. ఆ ఘటన పీడకల అని ఆమె వ్యాఖ్యానించింది. అశిలిని విచారిస్తున్నప్పుడు తాను పక్కనే ఉంటాను అన్న ఆ తల్లి అభ్యర్థనను హౌస్టన్ పోలీసు ఉన్నతాధికారులు విచారించారు. దాంతో చేసేది లేక ఆ చిన్నారిని వదిలి జువైనల్ గది నుంచి వెలుపలకు వచ్చింది. ఆ రేప్ కేసులో అశిలికి ఆక్టోబర్లో కోర్టు శిక్ష విధించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement