
ఏక్తా కపూర్
హార్వీ వెయిన్‌స్టీన్ ఎవరో తెలుసా? తెలియకుండా ఎలా ఉంటాడు? నటీమణుల పట్ల రాక్షసుడిలాంటి వాడని హాలీవుడ్ కోడై కూస్తోంది. అది అన్ని వుడ్స్‌కీ పాకింది. అంతే.. ఇక్కడ కూడా ఇలాంటి కిరాతకులు ఉన్నారని కొందరు నటీమణులు బాహాటంగా ‘క్యాస్టింగ్ కౌచ్’ గురించి మాట్లాడుతున్నారు. ఈ లిస్ట్‌లో బాలీవుడ్ టీవీ, ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ చేరారు. ‘మీటూ’ అంటూ ప్రతి ఇండస్ట్రీలోని నటీమణులు బడా బడా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ బండారం బయటపెడుతున్న ఈ ఉద్యమం నేపథ్యంలో ఏక్తా కపూర్ కూడా తన గళం విప్పారు.
‘‘కాయిన్‌కి ఒకవైపే కాదు రెండో వైపు కూడా చూడాలి’’ అంటూ క్యాస్టింగ్ కౌచ్ గురించి పలు ఆసక్తికర విషయాలు ప్రస్తావించారామె. ‘‘బాలీవుడ్‌లో కూడా హార్వీ వెయిన్‌స్టీన్‌లు ఉన్నారు. కానీ వారితో పాటు అంతే సమానంగానే కథకు మరోవైపు కూడా హార్వీ వెయిన్‌స్టీన్ (బాధితులు)లు ఉన్నారు. కానీ వారి గురించి మనం ఎవ్వరం మాట్లాడం. అవును పవర్‌లో ఉన్న కొద్దిమంది నిర్మాతలు వాళ్ల పలుకుబడిని ఉపయోగించి అడ్వాంటేజ్ తీసుకొని ఉండొచ్చు.
సేమ్ టైమ్ అవకాశం కోసం చూస్తున్న కొందరు యాక్టర్స్ దిగజారి, తమ పనులు జరిగేలా చూసుకుంటున్నారు. నేను నమ్మేదేంటంటే ‘పదవి, పవర్ ఉన్నవాళ్లనే ఎప్పుడూ దోషులుగా చిత్రీకరించకూడదు. అలాగే పవర్‌లో లేనివాళ్లను బాధితులుగా పరిగణించకూడదు’’ అని పేర్కొన్నారు ఏక్తా కపూర్. కేవలం నటీమణులకే కాదు.. ఓ ప్రొడ్యూసర్‌గా నాకూ కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. కొంతమంది మగాళ్లు చాలా అసభ్యకరంగా ప్రవర్తించేవాళ్లు. మరి అలాంటి సిచ్యువేషన్స్‌లో నిందితులు ఎవరు? పవర్‌లో ఉన్న ప్రొడ్యూసరా? లేక పవర్ లేనివాళ్లా?
Comments
Please login to add a commentAdd a comment