జెన్నీఫర్ ఆనిస్టన్, టేలర్ íస్విఫ్ట్, మెరిల్ స్ట్రీప్స్, కేట్ హడ్సన్, జెస్సికా బేల్
మీటూ.. నాలుగు నెలలుగా ప్రపంచాన్ని ఊపేస్తోన్న ఉద్యమం. హార్వీ వెయిన్‌స్టీన్ అనే నిర్మాత తమపై చేసిన లైంగిక వేధింపులను ఒక్కొక్కరుగా హాలీవుడ్ నటీమణులు బయటపెట్టడంతో ఈ ఉద్యమం మొదలైంది. ఈ నాలుగు నెలల్లో ఈ ఉద్యమం హాలీవుడ్ స్టార్స్ దగ్గర్నుంచి ఇండియాలోని సాధారణ యువతి వరకూ చేరింది. ఆడవాళ్లు తమపై జరిగిన లైంగిక దాడులను బయటకొచ్చి చెప్పుకునేందుకు ఈ ఉద్యమం తోడుగా నిలిచింది. అలాంటి ఉద్యమానికి కొనసాగింపుగా హాలీవుడ్‌లో తాజాగా ‘టైమ్ ఈజ్ అప్’ అనే ఉద్యమం ఊపందుకుంటోంది.
లైంగిక వేధింపులకు గురై బయటకు చెప్పుకోలేకపోతున్న అమ్మాయిల కోసం, వాళ్లు చేసే పోరాటాలకు అండగా నిలబడ్డం కోసం ౖ‘టెమ్ ఈజ్ అప్’ పనిచేస్తుంది. ఈ టైమ్ ఈజ్ అప్ కోసం నెల రోజులుగా భారీ ఎత్తున ఫండ్స్ వచ్చిపడుతున్నాయి. అయితే ఆ ఫండ్స్ అన్నీ కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డ దర్శకులు, నిర్మాతల సినిమాలకు పనిచేసిన నటులు తాము ఆయా సినిమాలకు తీసుకున్న రెమ్యునరేషన్‌ను వెనక్కి ఇచ్చే క్రమంలో పుట్టినవే! ‘‘మేం ఆ దర్శకుడి/నిర్మాత సినిమాకు పనిచేసి తప్పు చేశాం. ఆ సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ అంతా టైమ్ ఈజ్ అప్‌కు డొనేట్ చేస్తున్నాం’’ అని అన్నది ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా కనిపిస్తోన్న, చాలామంది స్టార్స్ చేస్తోన్న ఓ పోస్ట్.
హార్వీ వెయిన్‌స్టీన్
Comments
Please login to add a commentAdd a comment