KATE HUDSON
-
‘మీటూ’ టు ‘టైమ్ ఈజ్ అప్’!
మీటూ.. నాలుగు నెలలుగా ప్రపంచాన్ని ఊపేస్తోన్న ఉద్యమం. హార్వీ వెయిన్‌స్టీన్ అనే నిర్మాత తమపై చేసిన లైంగిక వేధింపులను ఒక్కొక్కరుగా హాలీవుడ్ నటీమణులు బయటపెట్టడంతో ఈ ఉద్యమం మొదలైంది. ఈ నాలుగు నెలల్లో ఈ ఉద్యమం హాలీవుడ్ స్టార్స్ దగ్గర్నుంచి ఇండియాలోని సాధారణ యువతి వరకూ చేరింది. ఆడవాళ్లు తమపై జరిగిన లైంగిక దాడులను బయటకొచ్చి చెప్పుకునేందుకు ఈ ఉద్యమం తోడుగా నిలిచింది. అలాంటి ఉద్యమానికి కొనసాగింపుగా హాలీవుడ్లో తాజాగా ‘టైమ్ ఈజ్ అప్’ అనే ఉద్యమం ఊపందుకుంటోంది. లైంగిక వేధింపులకు గురై బయటకు చెప్పుకోలేకపోతున్న అమ్మాయిల కోసం, వాళ్లు చేసే పోరాటాలకు అండగా నిలబడ్డం కోసం ౖ‘టెమ్ ఈజ్ అప్’ పనిచేస్తుంది. ఈ టైమ్ ఈజ్ అప్ కోసం నెల రోజులుగా భారీ ఎత్తున ఫండ్స్ వచ్చిపడుతున్నాయి. అయితే ఆ ఫండ్స్ అన్నీ కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డ దర్శకులు, నిర్మాతల సినిమాలకు పనిచేసిన నటులు తాము ఆయా సినిమాలకు తీసుకున్న రెమ్యునరేషన్‌ను వెనక్కి ఇచ్చే క్రమంలో పుట్టినవే! ‘‘మేం ఆ దర్శకుడి/నిర్మాత సినిమాకు పనిచేసి తప్పు చేశాం. ఆ సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ అంతా టైమ్ ఈజ్ అప్‌కు డొనేట్ చేస్తున్నాం’’ అని అన్నది ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా కనిపిస్తోన్న, చాలామంది స్టార్స్ చేస్తోన్న ఓ పోస్ట్. హార్వీ వెయిన్‌స్టీన్ -
నగ్నంగా నటించినా నో ప్రాబ్లం!
లాస్ ఏంజిల్స్: వెండితెరపై కాస్తా ఎక్స్పోజింగ్ చేయాలన్న సంప్రదాయబద్ధమైన కుటుంబం నుంచి వచ్చిన నటీమణులు మోహమాటపడుతుంటారు. అయితే హాలీవుడ్ నటి కేట్ హడ్సన్ మాత్రం తనకు ఆ ప్రాబ్లం లేదని చెప్తోంది. తాను నగ్నంగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడతానని, ఒంటిపై నూలుపోగు లేకుండా ఉన్నా తన కుటుంబం పెద్దగా ఇబ్బంది పడదని ఈ అమ్మడు చెప్తోంది. మిమ్మల్ని మీరు ఎలా ఇష్టపడాలో చెప్తూ 'ప్రెట్టీ హ్యాపీ' పేరిట ఓ పుస్తకాన్ని తీసుకొస్తున్న ఈ 36 ఏళ్ల సుందరి కొనన్ ఒబ్రియాన్ టాక్ షోలో మాట్లాడింది. దుస్తులు వేసుకొనే విషయంలో తనకు తన తల్లే స్ఫూర్తి అని, ఆమె ఇంటివద్ద చిన్న చిన్న దుస్తులు మాత్రమే వేసుకుంటుందని తెలిపింది. 'నేను దుస్తులు వేసుకోవడం కన్నా నగ్నంగా ఉండటానికే ప్రాధాన్యమిస్తా. దుస్తులనేవి ఆంక్షల్లాంటివే. కాబట్టి ఇంటికి వెళ్లగానే నగ్నంగా ఉండాలనుకుంటా. మీరు డ్యాన్సర్ అయితే మీ దేహంతో కంఫర్టబుల్‌గా ఉండగలరు. ఇంకా చెప్పాలంటే మా అమ్మ కూడా డ్యాన్సరే. ఇంట్లో తను చిన్న చిన్న దుస్తులు మాత్రమే వేసుకుంటుంది' అని ఈ ఆస్కార్ విన్నింగ్ స్టార్ చెప్పింది. 'అద్దంలో మన ప్రతిబింబాన్ని చూసుకున్నప్పుడు కంఫర్టబుల్‌గా ఫీలవ్వగలగాలి. మనల్ని మనం అంగీకరించాలి. అలాంటి కుటుంబం నుంచి నేను వచ్చాను' అని కేట్ తెలిపింది. -
బాటమ్ లైన్!
అందమా అందుమా అందనంటే అందమా... అంటూ అందాన్ని అపురూపంగా ఆరాధించే రోజులు పోయినట్టున్నాయి. వారు.. వీరు అని లేదు... అన్ని ‘వుడ్’ల భామలు మాకేంటి తక్కువంటూ ‘అందాంద’ ప్రదర్శనలో పోటీపడుతుంటే.. ఇక దాని కోసం పాట్లు పడాల్సిన పనేముంటుందంటున్నారు రసిక ప్రియులు! చెప్పొచ్చేదేమంటే... హాలీవుడ్ బ్యూటీ కేట్ హడ్సన్ రీసెంట్గా జరిగిన ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో అందాల విందు చేసిందట. బాటమ్లెస్లో దర్శనమిచ్చి టాప్ లేపిందట. బిగ్‌స్క్రీన్ సుందరి ఒక్కసారిగా ఇలా కళ్లముందుకొచ్చి అలా ‘బోల్డ్’గా వయ్యారాలు ఒలకబోస్తుంటే... అక్కడున్నవారంతా ‘కల కాదిది... నిజమైనది’ అంటూ ఆస్వాదించేశారనేది ఓ వెబ్సైట్ కథనం!