నగ్నంగా నటించినా నో ప్రాబ్లం! | Kate Hudson grew up in comfortably naked family | Sakshi
Sakshi News home page

నగ్నంగా నటించినా నో ప్రాబ్లం!

Published Sun, Feb 28 2016 9:11 AM | Last Updated on Tue, Oct 16 2018 8:34 PM

నగ్నంగా నటించినా నో ప్రాబ్లం! - Sakshi

నగ్నంగా నటించినా నో ప్రాబ్లం!

లాస్‌ ఏంజిల్స్‌: వెండితెరపై కాస్తా ఎక్స్‌పోజింగ్‌ చేయాలన్న సంప్రదాయబద్ధమైన కుటుంబం నుంచి వచ్చిన నటీమణులు మోహమాటపడుతుంటారు. అయితే హాలీవుడ్ నటి కేట్ హడ్సన్ మాత్రం తనకు ఆ ప్రాబ్లం లేదని చెప్తోంది. తాను నగ్నంగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడతానని, ఒంటిపై నూలుపోగు లేకుండా ఉన్నా తన కుటుంబం పెద్దగా ఇబ్బంది పడదని ఈ అమ్మడు చెప్తోంది.

మిమ్మల్ని మీరు ఎలా ఇష్టపడాలో చెప్తూ 'ప్రెట్టీ హ్యాపీ' పేరిట ఓ పుస్తకాన్ని తీసుకొస్తున్న ఈ 36 ఏళ్ల సుందరి కొనన్ ఒబ్రియాన్‌ టాక్‌ షోలో మాట్లాడింది. దుస్తులు వేసుకొనే విషయంలో తనకు తన తల్లే స్ఫూర్తి అని, ఆమె ఇంటివద్ద చిన్న చిన్న దుస్తులు మాత్రమే వేసుకుంటుందని తెలిపింది. 'నేను దుస్తులు వేసుకోవడం కన్నా నగ్నంగా ఉండటానికే ప్రాధాన్యమిస్తా. దుస్తులనేవి ఆంక్షల్లాంటివే. కాబట్టి ఇంటికి వెళ్లగానే నగ్నంగా ఉండాలనుకుంటా. మీరు డ్యాన్సర్‌ అయితే మీ దేహంతో కంఫర్టబుల్‌గా ఉండగలరు. ఇంకా చెప్పాలంటే మా అమ్మ కూడా డ్యాన్సరే. ఇంట్లో తను చిన్న చిన్న దుస్తులు మాత్రమే వేసుకుంటుంది' అని ఈ ఆస్కార్ విన్నింగ్ స్టార్ చెప్పింది. 'అద్దంలో మన ప్రతిబింబాన్ని చూసుకున్నప్పుడు కంఫర్టబుల్‌గా ఫీలవ్వగలగాలి. మనల్ని మనం అంగీకరించాలి. అలాంటి కుటుంబం నుంచి నేను వచ్చాను' అని కేట్ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement