క్రేజీ కాంబోలో యాక్షన్‌ థ్రిల్లర్‌ | John Cena Joins Jackie Chan for Action Thriller | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 14 2018 4:31 PM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM

John Cena Joins Jackie Chan for Action Thriller - Sakshi

జాకీ చాన్‌.. జాన్‌ సీనా

లాస్‌ ఏంజెల్స్‌: క్రేజీ కాంబినేషన్‌లో హాలీవుడ్‌లో ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌ తెరకెక్కోబోతోంది. యాక్షన్‌ హీరో జాకీ చాన్‌, ప్రముఖ రెజ్లర్‌ జాన్‌ సీనా హీరోలుగా ఓ చిత్రం రాబోతుంది. అమెరికన్‌ డైరెక్టర్‌ స్కాట్‌ వా డైరెక్షన్‌లో ‘ప్రాజెక్ట్‌ ఎక్స్‌’ గా చిత్రం తెరకెక్కబోతుండగా.. చాన్‌-సీనాలను హీరోలుగా కన్ఫర్మ్‌ చేసినట్లు తెలుస్తోంది. 

తొలుత ఈ సినిమాకు ఎక్స్‌-బాగ్దాద్‌ పేరును పరిశీలించగా.. హాలీవుడ్‌ దిగ్గజం సిల్వస్టర్‌ స్టాలోన్‌ పేరును హీరోగా పరిశీలించారు. అయితే అనూహ్యాంగా సిల్వస్టర్‌ను తప్పించి.. ఆప్లేస్‌లో జాన్‌ సీనాను తీసుకున్నారు. టైటిల్‌ను కూడా ప్రాజెక్టు ఎక్స్‌గా మార్చినట్లు స్కాట్‌ ఓ ప్రెస్‌ మీట్‌లో ప్రకటించారు. ఈ చిత్రానికి జాకీ చాన్‌ సహనిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం.

కాగా, హాంగ్‌ కాంగ్‌కు చెందిన జాకీ చాన్‌ యాక్షన్‌ చిత్రాలకు పెట్టింది పేరు. 150కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన.. ఆ మధ్య ‘ది ఫారినర్‌’ చిత్రంతో అలరించారు. ప్రస్తుతం షాంగై నూన్‌, రష్‌ హవర్‌ సీక్వెన్స్‌ పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. మరోవైపు డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్‌గా పేరొందిన జాన్‌ సీనా.. 2006లో ది మెరైన్‌ ద్వారా హీరోగా మారారు. సుమారు అరడజనుపైగా చిత్రాల్లో నటించిన సీనా.. త్వరలో ‘ది రాక్‌’(డ్వెన్‌ జాన్సన్‌) నిర్మాతగా తెరకెక్కించనున్న ఓ చిత్రంలో కూడా నటించబోతున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement