భార్యను చంపాలనుకున్న ప్రముఖ నటుడు | Johnny Depp tried to smother Amber Heard with a pillow | Sakshi
Sakshi News home page

భార్యను చంపాలనుకున్న ప్రముఖ నటుడు

Published Thu, Jun 2 2016 1:05 PM | Last Updated on Sat, Aug 11 2018 8:48 PM

భార్యను చంపాలనుకున్న ప్రముఖ నటుడు - Sakshi

భార్యను చంపాలనుకున్న ప్రముఖ నటుడు

న్యూయార్క్: ప్రముఖ హాలీవుడ్ దంపతులు జానీ డెప్‌- అంబర్‌ హర్డ్‌ విడాకుల వ్యవహారంలో మరో విషయం వెలుగుచూసింది. దిండుతో ఊపిరాడకుండా చేసి భార్య, నటి అంబర్ హర్డ్‌ను చంపేందుకు డెప్‌ ప్రయత్నించినట్టు తాజాగా వెల్లడైంది.  52 ఏళ్ల డెప్‌ నుంచి తనకు విడాకులు ఇవ్వాలంటూ గత నెల 23న అంబర్‌ (30) కోర్టులో విడాకుల పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో అంబర్ స్నేహితుడు కొన్ని సంచలన విషయాలు వెల్లడించాడు.

ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన డెప్‌ తన భార్య అంబర్‌ను చంపేందుకు ప్రయత్నించాడని, దిండుతో ఊపిరాడకుండా చేసి ఆమెను చంపాలని చూశాడని, దీంతో భయభ్రాంతులకు గురైన అంబర్‌ తన మొబైల్‌ మెసెజ్‌ పంపిందని ఆమె స్నేహితుడు న్యూయార్క్ పోస్టు పత్రికకు తెలిపాడు. 'నేను వెంటనే ఆమె అపార్ట్‌మెంటుకు వెళ్లాను. అక్కడ ఆమె ముఖంపై కమిలిన గాయం ఉంది. పెదవి చీరుకుపోయింది. ఒక కన్నుకు గాయంతో వాపు వచ్చింది. తలపై కొన్ని వెంట్రుకలు ఊడిపోయి ఉన్నాయి. ఆమె దీన స్థితి చూసి నేను షాక్‌ తిన్నాను. తనను  దిండుతో చంపాలని డెప్‌ చూశాడని, తనను విషమిచ్చి చంపేందుకు అతను వెనుకాడబోడని అంబర్‌ చెప్పింది' అని ఆయన వివరించాడు. డెప్‌ ఎప్పుడూ గొడవపడుతూ తనను తీవ్రంగా కొట్టేవాడని, ఆమె పట్ల డెప్‌ దురుసుగా ప్రవర్తించడం తాను కూడా చాలాసార్లు  చూశానని పత్రికకు తెలిపారు.

ఇప్పటికే అంబర్‌ భర్త డెప్‌పై గృహహింస కేసు పెట్టింది. అతని నుంచి విడాకులు తీసుకునేందుకు కోర్టును ఆశ్రయించింది. కోర్టు కూడా ఈ ఇద్దరు దంపతులు వేర్వేరుగా ఉండాలని ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. 'పైరెట్స్ ఆఫ్‌ ది కరేబియన్‌' వంటి చిత్రాలతో జానీ డెప్‌ అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement