స్నేహితునితో కలిసి మెడికల్ షాప్‌కు వెళ్తున్న 22 ఏళ్ల గారో తెగకు చెందిన యువతిపై మద్యం మత్తులో ఉన్న కొందరు వ్యక్తులు దాడి చేశారు. అస్సాంలోని గొలపర జిల్లాలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. తమ కులం, మతం కాని వ్యక్తితో తిరుగుతోందని తాగుబోతులు ఈ అకృత్యానికి పాల్పడ్డారు. ఆమెను జుట్టు పట్టుకుని కొట్టారు. దుర్భాషలాడతూ కాళ్లతో తన్నారు. ఆమెతో ఉన్న ముస్లిం యువకుడిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. భయంతో యువతి తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా మరోమారు ఆమెను కాలితో తన్ని ఫోన్ లాక్కున్నారు.