
కారులోని కెమెరాలో నమోదైన దృశ్యం తాలుకూ ఫోటో
బీజింగ్: మహిళా ప్రయాణికురాలిపై లైంగిక దాడికి యత్నించిన క్యాబ్ డ్రైవర్‌ను చైనా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన సిచువాన్ ప్రావిన్సులోని లేషాన్‌లో గత వారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఫయూన్ టాక్సీ కంపెనీకి చెందిన క్యాబ్‌ను సదరు మహిళ బుక్ చేసుకుంది. క్యాబ్‌లో ఎక్కిన తర్వాత డ్రైవర్ ఆమెతో మాటలు కలిపాడు. అందంగా ఉన్నావంటూ ఆమె వివరాలు తెలుసుకునే యత్నం చేశాడు. ఆపై ఆమెపై చేతులేసి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె ప్రతిఘటించేసరికి లైంగిక దాడికి యత్నించాడు. ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదంతా పగటిపూటే చోటు చేసుకోవటం గమనార్హం.
ఇక కారులోని కెమెరాను పరిశీలించిన పోలీసులు డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించింది నిజమేనని నిర్ధారించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితునిపై కేసు నమోదు చేసి 10 రోజుల రిమాండ్‌కు పంపించారు. అతని లైసెన్స్ కూడా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక క్యాబ్ డ్రైవర్ నిర్వాకంపై ‘లేషాన్ ఫయూన్ టాక్సీ కంపెనీ’ స్పందించింది. సదరు డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించినట్లు ప్రకటించింది.ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది. కాగా, చైనాలో ఈ తరహా నేరాలు ఇటీవల తరచుగా చోటుచేసుకుంటున్నాయి. ఈ మధ్యే హెనాన్ ప్రావిన్సులోని జెంగ్జావూలో ఓ యువతి అతికిరాతకంగా అత్యాచారం, హత్యకు గురైంది.
Comments
Please login to add a commentAdd a comment