ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళా టిక్‌టాకర్‌పై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్ట్14 పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఓ టిక్‌టాకర్ తన ఆరుగురు స్నేహితులతో కలిసి లాహోర్‌లోని మినార్-ఇ-పాకిస్తాన్ వద్ద టిక్‌టాక్ వీడియోను చిత్రీకరించాలనుకున్నారు. ఆ సమయంలో సుమారు 300మంది ఆమెను చుట్టిముట్టి దాడికి పాల్పడ్డారు. ఆమెను గాల్లోకి ఎగరేస్తూ దుస్తులు చించడానికి యత్నించారు. ఆమె చుట్టూ చేరిన వందలాది మంది నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించారు. కానీ ఎంతకు సాధ్యం కాలేదు.
ఈ పరిస్థితిని గమనించిన సెక్యూరిటీ గార్డు మినార్-ఇ-పాకిస్తాన్ గేటు తెరవటంతో అక్కడి నుంచి తన స్నేహితులతో ఆమె బయటపడింది. బలవంతంగా ఆమె చేతి ఉన్న ఉంగరం, చెవి రింగులు, తన స్నేహితుల వద్ద ఉన్న మోబైల్ ఫోన్, ఐడీ కార్డు, రూ.15 వేలను లాక్కున్నారు. ఈ ఘటనపై సదరు టిక్‌టాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది. వీడియో చూసిన నెటిజన్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
This is one of the many videos that are being shared on WhatsApp groups showing how men were groping her and touching her. Look at the number of people in this video!! All she wanted to do was celebrate Independence Day at minar e Pakistan. Is that a crime? pic.twitter.com/9LPaWAo4wQ
— Nida Abbas (@OutOnAbudget) August 16, 2021
Comments
Please login to add a commentAdd a comment