బీజేపీకి బిగ్‌ షాక్‌ | BJP Hisar MP Brijendra Singh Resign, Likely To Join Congress Updates | Sakshi
Sakshi News home page

ఎన్నికల వేళ.. బీజేపీకి బిగ్‌ షాక్‌

Published Sun, Mar 10 2024 12:49 PM | Last Updated on Sun, Mar 10 2024 2:21 PM

BJP Hisar MP Brijendra Singh Resign Likely To Join Congress Updates - Sakshi

లోక్‌సభ ఎన్నికల ముందర బీజేపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ పార్టీ ఎంపీ బ్రిజేందర్‌ సింగ్‌ Brijendra Singh(51) ఆదివారం బీజేపీకి రాజీనామా ప్రకటించారు. రాజీనామా ప్రకటించిన కొన్నిగంటలకే ఏఐసీసీ ప్రెసిడెంట్‌ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిపోయారు. 

హర్యానా రాజకీయ దిగ్గజం, కేంద్ర మాజీ మంత్రి చౌద్రీ బీరేందర్‌ సింగ్‌(77) తనయుడే ఈ బ్రిజేందర్‌ సింగ్‌.  హర్యానా హిసార్‌ పార్లమెంటరీ స్థానం నుంచి బ్రిజేందర్‌ సింగ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముందుగా తన రాజీనామాను ఎక్స్‌ అకౌంట్‌ ద్వారా పోస్ట్‌ చేశారాయన. 

ఆ తర్వాత బ్రిజేందర్‌ సింగ్‌.. ఖర్గేతోపాటు పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. రాజకీయ, సైద్ధాంతిక విబేధాల వల్లే తాను  బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరినట్లు మీడియాకు బ్రిజేందర్‌ తెలియజేశారు. రైతుల ఆందోళన, రెజ్లర్ల నిరసనలు.. ఇలా చాలాకారణాలు ఉన్నాయని చెప్పారాయన. అలాగే.. కాంగ్రెస్‌ చేరిక సంతోషాన్ని ఇస్తోందని బ్రిజేందర్‌ చెప్పారు. 

గతంలో 42 ఏళ్ల పాటు కాంగ్రెస్‌తో అనుబంధం కొనసాగించిన బీరేందర్‌ సింగ్‌.. 2014లో అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఇక ఆయన తనయుడైన బ్రిజేందర్‌ 1998లో సివిల్స్‌ 9వ ర్యాంకర్‌. ఐఏఎస్‌ అధికారిగా 21 ఏళ్లపాటు సొంత రాష్ట్రానికి సేవలు అందించిన బ్రిజేందర్‌ గత సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. హిసార్‌ ఎంపీగా.. పార్లమెంట్‌లో పలు కమిటీలకు సైతం బ్రిజేందర్‌ పని చేశారు.


తండ్రి బీరేందర్‌తో బ్రిజేందర్‌

జాట్‌ కమ్యూనిటీకి చెందిన బ్రిజేందర్‌ కుటుంబానికి ముందు తరాల నుంచే హర్యానా రాజకీయాల్లో మంచి పలుకుబడి ఉంది. అయితే ఈసారి ఎన్నికల్లో ఆయనకు సీటు దక్కకపోవచ్చనే సంకేతాలు అందుతున్నాయి. దీంతో కాంగ్రెస్‌లో చేరి ఆయన పోటీ చేయొచ్చని తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement