
హైదరాబాద్: వరల్డ్ చెస్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు పాతబస్తీ మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ ప్రతాప్ నాగరాజు ఎంపికయ్యారు. జూలై 22 నుంచి 29 వరకు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జరిగే అమెచ్యూర్ వరల్డ్ చెస్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నాగరాజు భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. 62 కేజీల విభాగంలో అతను పోటీపడతాడు.
గత కొన్నేళ్లుగా జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహించిన పలు టోర్నీల్లో నాగరాజు నిలకడగా పతకాలు సాధించాడు. ఈ సందర్భంగా ఆయన ఎంపిక అవ్వడం పట్ల స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆర్. దేవేందర్, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment