నాగనిక ఓటమి | Naganika defeat | Sakshi
Sakshi News home page

నాగనిక ఓటమి

Published Thu, May 21 2015 1:02 AM | Last Updated on Sun, Sep 3 2017 2:23 AM

Naganika defeat

తైపీ : ప్రపంచ జూనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్ గొన్నెల నాగనిక పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. ప్లస్ 80 కేజీల విభాగంలో నేరుగా క్వార్టర్ ఫైనల్లో బరిలోకి దిగిన నాగనిక 0-3 తేడాతో మోర్కా జెస్సికా (జర్మనీ) చేతిలో ఓడిపోయింది. ఒకవేళ ఈ బౌట్‌లో నాగనిక గెలిచుంటే ఆమెకు కనీసం కాంస్య పతకం ఖాయమయ్యేది. మరోవైపు భారత్‌కే చెందిన సవిత (50 కేజీలు), మన్‌దీప్ సంధూ (52 కేజీలు), సాక్షి (54 కేజీలు) సెమీఫైనల్‌కు చేరుకొని కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు.  సవిత 3-0తో వాలెరియా రొడియోనోవా (రష్యా)పై, మన్‌దీప్ 3-0తో నాగీ ఎంజెలా (హంగేరి)పై గెలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement