న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ తానేంటో ఇది వరకే చాలాసార్లు నిరూపించుకుంది. అలాంటి చాంపియన్ బాక్సర్ తనకు పతకాలు తెచ్చే కేటగిరీ (48 కేజీలు) కోసం వీరోచిత కసరత్తే చేసి ఔరా అనిపించింది. కేవలం 4 గంటల్లోనే 2 కిలోల బరువు తగ్గింది. పోలాండ్‌లో జరిగిన బాక్సింగ్ చాంపియన్‌షిప్ కోసం అక్కడికి వెళ్లేసరికి ఆమె బరువు 50 కేజీలుగా ఉంది. పోటీలకు ముందు నిర్వహించే వేయింగ్ కార్యక్రమానికి మరో 4 గంటలు సమయం మాత్రమే ఉండటంతో బరువు తగ్గించుకోవడంపై దృష్టి సారించింది.
ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏకబిగిన స్కిప్పింగ్ చేసింది. ఆమె పడ్డ కష్టానికి ఫలితం వచ్చింది. వేయింగ్ సమయానికి సరిగ్గా 48 కేజీల బరువుతో పోటీకి అర్హత సాధించింది. అనంతరం తన పంచ్ పవర్‌తో షరామాములుగా బంగారు పతకం గెలిచింది. దీనిపై ఆమె మాట్లాడుతూ ‘ఒకవేళ వెయింగ్‌లో 48 కేజీలకు పైబడి ఉంటే నాపై అనర్హత వేటు పడేది. అందుకే 4 గంటలపాటు తీవ్రంగా చెమటోడ్చాను. వేయింగ్ సమయానికి సరైన బరువుతో సిద్ధమయ్యాను’ అని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment