INDIAN BOXING
-
ఇండియన్ బాక్సింగ్ లీగ్‌కు వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ ఆమోదం
ఇండియన్ ప్రొఫెషనల్ బాక్సింగ్ లీగ్ (IPBL) మరియు 12R ఫాంటసీ బాక్సింగ్ యాప్‌కు వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ (WBC) యొక్క అధికారిక అమోదం లభించింది. ఐపీబీఎల్ భారత్‌లో డబ్ల్యూబీసీ గుర్తింపు పొందిన ఏకైక ప్రొఫెషనల్ బాక్సింగ్ లీగ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఐపీబీఎల్ ద్వారా ఔత్సాహిక భారతీయ బాక్సర్లకు విశ్వవ్యాప్త గుర్తింపు దక్కే అవకాశం ఉంది. ఈ డీల్ ఐపీబీఎల్ సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుందని లీగ్ అడ్వైజర్ రానా దగ్గుబాటి అన్నాడు. భారత్‌లో బాక్సింగ్‌ను ప్రముఖ క్రీడగా మార్చేందుకు ఐపీబీఎల్ బృందంతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నానని తెలిపాడు. ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్ (ఐబీసీ) వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్‌తో కలిసి చాలా కాలంగా భారత్‌లో బాక్సింగ్ ఎదుగుదలకు పని చేస్తుందని ఐపీబీఎల్ సహ వ్యవస్థాపకుడు ప్రశాంత్ సింగ్ అన్నాడు. ఐబీసీ రెండు వేల మంది క్రియాశీల బాక్సర్లకు మద్దతు ఇస్తుందని ఆయన తెలిపాడు. -
నేనింకా రిటైర్ కాలేదు.. రిటైర్మెంట్ కథనాలను కొట్టిపారేసిన మేరీ కోమ్
భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ రిటైర్మెంట్ ప్రకటించినట్లు ఇవాల్టి ఉదయం నుంచి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాజాగా కోమ్ ఈ ప్రచారంపై స్పందిస్తూ.. తన రిటైర్మెంట్పై వచ్చిన వార్తాల్లో ఎంత మాత్రం నిజం లేదని కొట్టిపారేసింది. తాను ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదని.. ఒకవేళ ఆ నిర్ణయం తీసుకుంటే వ్యక్తిగతంగా మీడియా ముందుకు వస్తానని ఆమె తెలిపింది. ఈ మేరకు కోమ్ ప్రముఖ మీడియా సంస్థకు వివరణ ఇచ్చింది. ఇదిలా ఉంటే, 41 ఏళ్ల మేరీ కోమ్ మహిళల బాక్సింగ్‌లో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా, ఒలింపిక్ విన్నర్‌గా (2012 ఒలింపిక్స్‌లో 51 కేజీల విభాగంలో కాంస్య పతకం) నిలిచిన కోమ్.. పురుష బాక్సర్లు కూడా సాధించలేని ఎన్నో ఘనతలు సాధించి చాలా సందర్భాల్లో విశ్వవేదికపై భారత కీర్తిపతాకను రెపరెపలాడించింది. ఓవరాల్‌గా మేరీ కోమ్ తన కెరీర్లో 13 స్వర్ణాలు సహా మొత్తం 19 పతకాలను సాధించి బాక్సింగ్ లెజెండ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మేరీ కోమ్ ప్రతిభకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆమెకు 2002లో అర్జున అవార్డు, 2009లో ఖేల్ రత్న అవార్డు, 2006లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్, 2020లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందజేసింది. మేరీకోమ్ 2016లో రాజ్యసభ సభ్యురాలిగా నియమితురాలైంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ కోమ్ రింగ్‌లో ఎన్నో అపురూప విజయాలు సాధించి ఔరా అనిపించింది. -
రిటైర్మెంట్ ప్రకటించిన బాక్సింగ్ దిగ్గజం
భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ సంచలన ప్రకటన చేసింది. ఇకపై బాక్సింగ్ రింగ్‌లోకి దిగేది లేదని ప్రకటించింది. వయో పరిమితి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అన్ని కేటగిరీల పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొంది. భవిష్యత్‌లో బాక్సింగ్‌తో అనుసంధానమై ఉంటానని తెలిపింది. కాగా, అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ (ఐబీఏ) నిబంధనల ప్రకారం 40 ఏళ్లకు పైబడిన క్రీడాకారులు ప్రొఫెషనల్ బాక్సింగ్ టోర్నమెంట్లలో పాల్గొనడానికి అనుమతి లేదు. గతేడాదే ఏజ్ లిమిట్‌ను దాటిన 41 ఏళ్ల మేరీ కోమ్ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంది. మహిళల బాక్సింగ్‌లో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా, ఒలింపిక్ విన్నర్‌గా (2012 ఒలింపిక్స్‌లో 51 కేజీల విభాగంలో కాంస్య పతకం) నిలిచిన కోమ్.. పురుష బాక్సర్లు కూడా సాధించలేని ఎన్నో ఘనతలు సాధించి చాలా సందర్భాల్లో విశ్వవేదికపై భారత కీర్తిపతాకను రెపరెపలాడించింది. ఓవరాల్‌గా మేరీ కోమ్ తన కెరీర్లో 13 స్వర్ణాలు సహా మొత్తం 19 పతకాలను సాధించి బాక్సింగ్ లెజెండ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మేరీ కోమ్ ప్రతిభకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆమెకు 2002లో అర్జున అవార్డు, 2009లో ఖేల్ రత్న అవార్డు, 2006లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్, 2020లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందజేసింది. మేరీకోమ్ 2016లో రాజ్యసభ సభ్యురాలిగా నియమితురాలైంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ కోమ్ రింగ్‌లో ఎన్నో అపురూప విజయాలు సాధించి ఔరా అనిపించింది. -
ఔరా... మేరీ!
న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ తానేంటో ఇది వరకే చాలాసార్లు నిరూపించుకుంది. అలాంటి చాంపియన్ బాక్సర్ తనకు పతకాలు తెచ్చే కేటగిరీ (48 కేజీలు) కోసం వీరోచిత కసరత్తే చేసి ఔరా అనిపించింది. కేవలం 4 గంటల్లోనే 2 కిలోల బరువు తగ్గింది. పోలాండ్‌లో జరిగిన బాక్సింగ్ చాంపియన్‌షిప్ కోసం అక్కడికి వెళ్లేసరికి ఆమె బరువు 50 కేజీలుగా ఉంది. పోటీలకు ముందు నిర్వహించే వేయింగ్ కార్యక్రమానికి మరో 4 గంటలు సమయం మాత్రమే ఉండటంతో బరువు తగ్గించుకోవడంపై దృష్టి సారించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏకబిగిన స్కిప్పింగ్ చేసింది. ఆమె పడ్డ కష్టానికి ఫలితం వచ్చింది. వేయింగ్ సమయానికి సరిగ్గా 48 కేజీల బరువుతో పోటీకి అర్హత సాధించింది. అనంతరం తన పంచ్ పవర్‌తో షరామాములుగా బంగారు పతకం గెలిచింది. దీనిపై ఆమె మాట్లాడుతూ ‘ఒకవేళ వెయింగ్‌లో 48 కేజీలకు పైబడి ఉంటే నాపై అనర్హత వేటు పడేది. అందుకే 4 గంటలపాటు తీవ్రంగా చెమటోడ్చాను. వేయింగ్ సమయానికి సరైన బరువుతో సిద్ధమయ్యాను’ అని చెప్పింది. -
ఆసియా క్రీడలకు హుసాముద్దీన్
న్యూఢిల్లీ: రెండేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో ఆకట్టుకునే ప్రదర్శన చేస్తోన్న తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్‌కు తగిన గుర్తింపు లభించింది. వచ్చే ఆగస్టు–సెప్టెంబర్‌లో ఇండోనేసియా వేదికగా జరిగే ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బాక్సింగ్ జట్టులో హుసాముద్దీన్‌కు (56 కేజీలు) స్థానం దక్కింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన 24 ఏళ్ల హుసాముద్దీన్ ఏప్రిల్‌లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి కాంస్య పతకం సాధించాడు. గతవారం జర్మనీలో జరిగిన కెమిస్ట్రీ కప్ అంతర్జాతీయ టోర్నీలో హుసాముద్దీన్ స్వర్ణం దక్కించుకున్నాడు. ఫలితంగా ఎలాంటి ట్రయల్స్ లేకుండానే అతనికి జట్టులో బెర్త్ ఖాయమైంది. భారత పురుషుల బాక్సింగ్ జట్టు: అమిత్ పంగల్ (49 కేజీలు), గౌరవ్ సోలంకి (52 కేజీలు), మొహమ్మద్ హుసాముద్దీన్ (56 కేజీలు), శివ థాపా (60 కేజీలు), ధీరజ్ (64 కేజీలు), మనోజ్ కుమార్ (69 కేజీలు), వికాస్ కృషన్ (75 కేజీలు). మహిళల జట్టు: సర్జూబాలా దేవి (51 కేజీలు), సోనియా లాథెర్ (57 కేజీలు), పవిత్ర (60 కేజీలు). -
'రియోలో పతకం సాధిస్తా'
న్యూఢిల్లీ: త్వరలో బ్రెజిల్లో జరిగే రియో ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తానని భారత బాక్సర్ వికాస్ క్రిషన్ పేర్కొన్నాడు. ఇటీవల జరిగిన ప్రపంచ క్వాలిఫయింగ్ పోటీలో వికాస్ క్రిషన్(75కేజీ) సెమీస్ కు చేరి రియో అర్హత సాధించిన సంగతి తెలిసిందే. అయితే రియోలో కూడా పతకం సాధిస్తాననే ధీమా వ్యక్తం చేశాడు. ' నాకు రియోలో పతకం సాధిస్తాననే నమ్మకం ఉంది. కనీసం కాంస్య పతకమైనా సాధిస్తా. రెండు బౌట్లు గెలిస్తే కాంస్య పతకం గెలిచే అవకాశ ఉంది. నా వరల్డ్ ర్యాంకింగ్‌ను బట్టి రియోలో డ్రా కూడా నాకు అనుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నా. తొలి రెండు బౌట్లలో కఠినమైన ప్రత్యర్థులు ఎదురుపడకపోవచ్చు. ఇదే కేటగిరిలో గతంలో విజేందర్ సింగ్ కాంస్య పతకం సాధించాడు. కనీసం కాంస్య పతకాన్ని సాధిస్తానని నాకు కూడా బలమైన నమ్మకం ఉంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో పతకం సాధించలేకపోయా. ఈసారి మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చిన అవకాశాన్ని వదులుకోను. పతకం సాధించడానికి శతవిధిలా ప్రయత్నిస్తా' వికాస్ క్రిషన్ తెలిపాడు. తాను రియో ఒలింపిక్స్ కు అర్హత సాధిస్తానని తొలుత అనుకోలేదన్నాడు. వరల్డ్ క్వాలిఫయింగ్ పోటీలకు తీవ్రమైన ఒత్తిడిలో సన్నద్దమయ్యానని, ఒక్కరోజు కూడా విశ్రాంతి లేకుండా శ్రమించానన్నాడు. దీంతో ఫలితాన్ని సాధించానన్నాడు. ఈ పోరులో మూడు బౌట్లను ఏకపక్షంగా గెలిచి సత్తాచాటడంతో తనపై నమ్మకం పెరిగిందన్నాడు. -
మన బాక్సర్లను వారే అడ్డుకుంటున్నారా..!
అంతర్జాతీయ వేదికలపై సత్తాచాటుతున్నా.. స్వదేశంలో అధికారుల వల్లే మన బాక్సర్లు వెనక బడుతున్నారా..? ఆసియా స్థాయిలో పతకాల పంట పండిస్తున్నా.. ప్రపంచ స్థాయి క్రీడల్లో పతకాలు రాక పోవడానికి ఆసోషియేషన్లే కారణమా..? ఈ మాట అంటున్నది కడుపు మండిన బాక్సర్ కాదు.. అంతర్జాతీ బాక్సింగ్ అసోషియేషన్ అధ్యక్షుడు. ఇక్కడ జరుగుతున్న ఆసియా సీనియర్ పురుషుల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో పాల్గొన్నడాక్టర్ చింగ్ కు వూ ఇలా స్పందించారు. భారత్ కి చెందిన ముగ్గురు బాక్సర్లు సెమీస్ లో ప్రవేశించడం గురించి ప్రస్తావించిన ఆయన భారత బాక్సింగ్ కు మంచి భవిష్యత్ ఉందని అన్నారు. ఆసియా స్ధాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న ఇండియ్ బాక్సర్లు మరింత కృషి చేస్తే... సెమీ ప్రొఫెషనల్ వాల్డ్ సీరీస్ ఆఫ్ బాక్సింగ్ లో సత్తా చాటగలరని అభిప్రాయపడ్డారు. ఆసియా ఖండంలో మంచి బాక్సింగ్ వాతావరణం ఉందని తెలిపారు. ఆసియా ఛాంపియన్ షిప్ లో పాల్గొన్నా అయన మీడియాతో మాట్లాడారు. కజకిస్తాన్, ఉబ్జెకిస్తాన్, చైనా, థాయ్ లాండ్, మంగోలియా, బారత్ లు ప్రపంచ స్థాయి బాక్సర్లను తయారు చేస్తున్నారని కితాబిచ్చాడు. అయితే భారత్ లో అడ్మినిష్ట్రేషన్ ఇబ్బందులు ఉన్నాయని వాటిని తొలగించుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. అంతే కాదు.. ఇప్పటి వరకూ దేశంలో చురుకైన ఫెడరేషన్ లేదని తెలిపారు. భారత్ కి అతిపెద్ద మార్కెట్ ఉందని.. ప్రపంచ బాక్సింగ్ సిరీస్ (WSB)లో సత్తా చాటగలదని అన్నారు. ఆసియా, థాయ్ లాండ్ లలో ఫెడరేషన్ లకు తాము ఎంతో సాహాయం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. దీని కోసం ప్రత్యేకంగా ఒక ప్రాజక్టు చేపట్టనున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మంది క్రీడాకారులు బాక్సింగ్ ని ఎంచుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే ఈవెంట్ లో ముగ్గురు భారతీయ బాక్సర్లు సెమీఫైనల్ కు క్వాలిఫై కావడం తెలిసిందే. ఈ ఈవెంట్ దోహాలో జరగనున్న ప్రపంచ ఛాంపియన్ షిప్ కు క్వాలిఫైయ్యింగ్ ఈవెంట్ కాగా.. ప్రపంచ ఛాంపియన్ షిప్ రియో ఒలింపిక్స్ కు తొలి క్వాలిఫైయ్యింగ్ ఈవెంట్. -
ప్రొఫెషనల్‌గా విజేందర్
లండన్: భారత బాక్సింగ్‌లో ఎన్నో ‘తొలి ఘనత’లను సొంతం చేసుకున్న స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ ప్రొఫెషనల్‌గా మారాడు. అమెచ్యూర్ కెరీర్‌కు స్వస్తి చెప్పిన ఈ హర్యానా బాక్సర్... లండన్‌లోని క్వీన్స్‌బెర్రీ ప్రమోషన్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నాడు. ‘ప్రొఫెషనల్‌గా మారిన నేను కెరీర్లో కొత్త అధ్యాయాన్ని మొదలుపెడుతున్నాను. తీవ్రంగా శ్రమించి ప్రపంచస్థాయిలో భారత్‌కు మరింత పేరు తేవాలని అనుకుంటున్నాను’అని విజేందర్ వ్యాఖ్యానించాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2009 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం, 2010 గ్వాంగ్జూ ఆసియా క్రీడల్లో స్వర్ణం, కామన్వెల్త్ గేమ్స్‌లలో రజతం, రెండు కాంస్యాలు నెగ్గిన విజేందర్ భారత బాక్సింగ్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు. ప్రొఫెషనల్‌గా మారడంతో 29 ఏళ్ల విజేందర్ ఇకపై భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశాలకు తెరపడింది. -
సరితాదేవిపై ఏడాది నిషేధం
న్యూఢిల్ల: భారత బాక్సర్ సరితా దేవిపై అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య ఏడాది పాటు నిషేధం విధించింది. ఆసియా గేమ్స్‌లో తనకు అన్యాయం జరిగిందని సరిత ఆరోపిస్తూ కాంస్య పతకాన్ని తీసుకునేందుకు నిరాకరించడంతో ఆమెపై చర్యలు తీసుకున్నారు. తొలుత జీవితకాలం నిషేధం విధించాలని భావించారు. కాగా సరిత వెనక్కు తగ్గి కాంస్య పతకాన్ని మళ్లీ స్వీకరించడం, భారత బాక్సింగ్ సమాఖ్య చేసిన ప్రయత్నాలతో నిషేధాన్ని ఏడాదికి తగ్గించారు. గత అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ 1 వరకు నిషేధం అమల్లో ఉంటుంది. ఇక భారత కోచ్ బీఐ ఫెర్నాండెజ్‌ను రెండేళ్లు నిషేధించారు. కాగా సరితపై నిషేధాన్ని తొలగించాలని కోరుతూ కేంద్ర క్రీడల శాఖ అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్యకు లేఖ రాసింది. -
కాంస్య పతకం మళ్లీ అందుకున్నసరితా దేవి
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ సరితా దేవి కాంస్య పతక వివాదం ముగిసింది. అప్పట్లో పతకం తీసుకునేందుకు నిరాకరించిన సరితా దేవి మనసు మార్చుకుంది. వెనక్కు ఇచ్చేసిన పతకాన్ని సరిత భారత ఒలింపిక్ సంఘం నుంచి మళ్లీ తీసుకుంది. ఇటీవల జరిగిన ఆసియా గేమ్స్ సందర్భంగా సెమీఫైనల్స్‌లో వివాదాస్పద రీతిలో ఓడిపోయిన సరితాదేవి కాంస్య పతకం తీసుకునేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. పోడియం మీద కన్నీరు మున్నీరుగా విలపిస్తూ.. తన కాంస్య పతకాన్ని తిరిగి ఇచ్చేసింది. సెమీఫైనల్స్‌లో మ్యాచ్‌లో జడ్జీలు సరితా దేవి ఓడిపోయినట్టు ప్రకటించడం వివాదాస్పదమైంది. సరిత పతకం వేసుకోడానికి కూడా నిరాకరించి.. దాన్ని రజతపతకం సాధించిన జీనా పార్క్కే ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటన చూసి షాకైన జీనా పార్క్.. ఏం చేయాలో తెలియక పోడియం మీదే కాంస్య పతకం వదిలేసి అక్కడినుంచి ఆమె కూడా వెళ్లిపోయింది. దాంతో నిర్వాహకులు కాంస్యపతకాన్ని తమవద్దే ఉంచుకున్నారు. ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాఖ్య భావించింది. ఆ తర్వాత రాజీమార్గంతో వ్యవహరించడం, తాజాగా సరిత పతకం తీసుకోవడంతోఈ వివాదం ముగిసినట్టయ్యింది. -
భారత బాక్సర్లకు అనుమతి
పాటియాల : ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు భారత్‌కు మార్గం సుగమమైంది. ఈ ఒక్క టోర్నీలో పాల్గొనేందుకు అంతర్జాతీయ అమోచ్యూర్ బాక్సింగ్ అసోసియేషన్ (ఏఐబీఏ) అనుమతించింది. అయితే దీని తర్వాత జరగబోయే టోర్నీల్లో పాల్గొనాలంటే మాత్రం కచ్చితంగా నవంబర్‌లోగా ఎన్నికలు నిర్వహించాలని భారత బాక్సింగ్ సమాఖ్య (ఐబీఎఫ్)ను ఆదేశించింది. రెండు రోజుల సెలక్షన్ ట్రయల్స్ అనంతరం ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే 10 మంది సభ్యులుగల భారత జట్టును ఎంపిక చేశారు. ప్రపంచ చాంపియన్‌షిప్ అక్టోబరు 11 నుంచి 27 వరకు కజకిస్థాన్‌లో జరుగుతుంది. భారత జట్టు: నానో సింగ్ (49 కేజీలు), మదన్ లాల్ (52 కేజీలు), శివ థాపా (56 కేజీలు), వికాస్ మాలిక్ (60 కేజీలు), మనోజ్ కుమార్ (64 కేజీలు), మన్దీప్ జాంగ్రా (69 కేజీలు), విజేందర్ (75 కేజీలు), సుమీత్ సాంగ్వాన్ (81 కేజీలు), మన్‌ప్రీత్ సింగ్ (91 కేజీలు), సతీశ్ (ప్లస్ 91 కేజీలు).