
ఇండియన్ ప్రొఫెషనల్ బాక్సింగ్ లీగ్ (IPBL) మరియు 12R ఫాంటసీ బాక్సింగ్ యాప్‌కు వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ (WBC) యొక్క అధికారిక అమోదం లభించింది. ఐపీబీఎల్ భారత్‌లో డబ్ల్యూబీసీ గుర్తింపు పొందిన ఏకైక ప్రొఫెషనల్ బాక్సింగ్ లీగ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఐపీబీఎల్ ద్వారా ఔత్సాహిక భారతీయ బాక్సర్‌లకు విశ్వవ్యాప్త గుర్తింపు దక్కే అవకాశం ఉంది.
ఈ డీల్ ఐపీబీఎల్ సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుందని లీగ్ అడ్వైజర్ రానా దగ్గుబాటి అన్నాడు. భారత్‌లో బాక్సింగ్‌ను ప్రముఖ క్రీడగా మార్చేందుకు ఐపీబీఎల్ బృందంతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నానని తెలిపాడు. ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్ (ఐబీసీ) వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్‌తో కలిసి చాలా కాలంగా భారత్‌లో బాక్సింగ్ ఎదుగుదలకు పని చేస్తుందని ఐపీబీఎల్ సహ వ్యవస్థాపకుడు ప్రశాంత్ సింగ్ అన్నాడు. ఐబీసీ రెండు వేల మంది క్రియాశీల బాక్సర్‌లకు మద్దతు ఇస్తుందని ఆయన తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment