World Boxing Organization
-
ఇండియన్ బాక్సింగ్ లీగ్‌కు వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ ఆమోదం
ఇండియన్ ప్రొఫెషనల్ బాక్సింగ్ లీగ్ (IPBL) మరియు 12R ఫాంటసీ బాక్సింగ్ యాప్‌కు వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ (WBC) యొక్క అధికారిక అమోదం లభించింది. ఐపీబీఎల్ భారత్‌లో డబ్ల్యూబీసీ గుర్తింపు పొందిన ఏకైక ప్రొఫెషనల్ బాక్సింగ్ లీగ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఐపీబీఎల్ ద్వారా ఔత్సాహిక భారతీయ బాక్సర్లకు విశ్వవ్యాప్త గుర్తింపు దక్కే అవకాశం ఉంది. ఈ డీల్ ఐపీబీఎల్ సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుందని లీగ్ అడ్వైజర్ రానా దగ్గుబాటి అన్నాడు. భారత్‌లో బాక్సింగ్‌ను ప్రముఖ క్రీడగా మార్చేందుకు ఐపీబీఎల్ బృందంతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నానని తెలిపాడు. ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్ (ఐబీసీ) వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్‌తో కలిసి చాలా కాలంగా భారత్‌లో బాక్సింగ్ ఎదుగుదలకు పని చేస్తుందని ఐపీబీఎల్ సహ వ్యవస్థాపకుడు ప్రశాంత్ సింగ్ అన్నాడు. ఐబీసీ రెండు వేల మంది క్రియాశీల బాక్సర్లకు మద్దతు ఇస్తుందని ఆయన తెలిపాడు. -
ప్రాణం తీసిన పంచ్
మాస్కో: రింగ్‌లో ప్రత్యర్థి పిడిగుద్దులు ఓ యువ బాక్సర్ ఉసురు తీశాయి. ప్రొఫెషనల్ ఆటలో భౌతిక దాడి స్థాయిలో విసిరిన పంచ్‌లు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. ఈ విషాద ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాలు... మేరీలాండ్ పరిధి అక్సన్ హిల్‌లో గత శుక్రవారం రాత్రి మాక్సిమ్ డడ్‌షెవ్ (రష్యా), సుబ్రియెల్ మటియాస్ (ప్యూర్టోరికో) మధ్య ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య (ఐబీఎఫ్) సూపర్ లైట్ వెయిట్ విభాగంలో బౌట్ జరిగింది. ఇందులో మటియాస్ వరుసగా విసిరిన పంచ్‌ల ధాటికి 28 ఏళ్ల డడ్‌షెవ్ దిమ్మతిరిగింది. డ్రెస్సింగ్ రూమ్ వరకు సైతం నడవలేని పరిస్థితుల్లో ఉన్న అతడిని హుటాహుటిన వాషింగ్టన్‌లోని ఆస్పత్రిలో చేర్చారు. మెదడులో అంతర్గతంగా తీవ్ర రక్తస్రావం కావడంతో చిక్సిత పొందుతూ మంగళవారం మృతి చెందాడు. డడ్‌షెవ్ తాను తలపడిన గత 13 బౌట్లలో అజేయంగా నిలిచాడు. శుక్రవారం నాటి పోరులో మాత్రం మటియాస్ ముందు నిలవలేకపోయాడు. ఆరంభం నుంచే దూకుడు చూపిన మటియాస్... ప్రత్యర్థి తప్పించుకోలేనంతగా బలమైన పంచ్‌లు విసిరాడు. వీటికి డడ్‌షెవ్ తాళలేకపోయాడు. 11వ రౌండ్ తర్వాత కుప్పకూలిన అతడు గ్లోవ్స్ చాటున తలదాచుకుంటూ ‘ఇక ఆపదల్చుకున్నాను’ అని సంకేతాలిచ్చాడు. కానీ, అప్పటికే నష్టం జరిగిపోయింది. ఆస్పత్రిలో అత్యవసర వార్డులో చేర్చి చికిత్స చేసినా ప్రాణం దక్కలేదు. దీనిపై కార్నర్మన్ మెక్గ్రిట్ మాట్లాడుతూ... బౌట్‌ను ఆపేలా డడ్షెవ్ను ఒప్పించలేకపోయానని అంటున్నాడు. మరోవైపు రష్యా బాక్సింగ్ సమాఖ్య ఈ బౌట్‌పై విచారణ జరుపుతోంది. ఈ బౌట్లో నిబంధనల ఉల్లంఘన జరిగిందని సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఉమర్ క్రెమ్లెవ్ ఆరోపించాడు. డడ్షెవ్కు భార్య, కుమారుడు ఉన్నారు. అతడి కుటుంబాన్ని ఆదుకుంటామని ఉమర్ ప్రకటించారు. -
విజేందర్ సింగ్ మరో నాకౌట్ విజయం
-
విజేందర్ మరో నాకౌట్ విజయం
న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన అనంతరం పరాజయమన్నది లేకుండా దూసుకెళుతున్న విజేందర్ సింగ్ మరో నాకౌట్ విజయం సాధించాడు. ప్రపంచ బాక్సింగ్ ఆర్గనైజేషన్ (డబ్లు్యబీవో) ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్ పోరులో నేటి (శనివారం) రాత్రి జరిగిన బౌట్ లో భారత బాక్సర్ విజేందర్ సత్తా చాటాడు. డిఫెండింగ్ చాంప్‌గా బరిలోకి దిగుతున్న చెకాతో విజేందర్ పది రౌండ్లపాటు జరగాల్సిన ఫైట్ లో మాజీ ప్రపంచ చాంపియన్ ఫ్రాన్సిస్ చెకా (టాంజానియా)తో మూడో రౌండ్లోనే ప్రత్యర్థి చెకాను నాకౌట్ చేసి టైటిల్ నిలబెట్టుకున్నాడు. పంచ్ విసరడమే నా పని. బౌట్ లో అదే చేయబోతున్నానని చెప్పిన విజేందర్ ఢిల్లీలోని త్యాగరాజ్ స్డేడియం రింగ్ లో తాను చెప్పింది చేసి చూపించాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్ లో అడుగుపెట్టిన విజేందర్ ఇప్పటివరకూ 8 విజయాలు సాధించగా, అందులో ఏడు నాకౌట్ విజయాలు ఉండటం విశేషం. విజేందర్ పంచ్ లను తట్టుకోలేక మూడో రౌండ్లోనే ఓటమిని అంగీకరించాడు. విజేందర్ ప్రత్యర్థి చెకా 43 ఫైట్లలో తలపడగా 32 విజయాలున్నాయి. ఇందులో 17 నాకౌట్స్ ఉన్నాయి. -
విజేందర్ సత్తాకు పరీక్ష
న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన అనంతరం అపజయమన్నది లేకుండా దూసుకెళుతున్న విజేందర్ సింగ్ మరో నాకౌట్ విజయంపై కన్నేశాడు. ప్రపంచ బాక్సింగ్ ఆర్గనైజేషన్ (డబ్లు్యబీవో) ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్ పోరులో భాగంగా మాజీ ప్రపంచ చాంపియన్ ఫ్రాన్సిస్ చెకా (టాంజానియా)తో నేడు (శనివారం) విజేందర్ తలపడనున్నాడు. డిఫెండింగ్ చాంప్‌గా బరిలోకి దిగుతున్న చెకాతో విజేందర్ పది రౌండ్లపాటు ఫైట్ చేయనున్నాడు. ఇప్పటిదాకా విజేందర్కు ఎదురైన అత్యంత అనుభవశాలి బాక్సర్ చెకానే. అందుకే రింగ్‌లో సత్తా చూపిస్తానని సవాల్ విసిరాడు. అయితే ఇందుకు విజేందర్ దీటుగా స్పందించాడు. ‘పంచ్ విసరడమే నా పని. బౌట్లో అదే చేయబోతున్నాను. ఈ టైటిల్ ఎక్కడికీ పోదు’ అని అన్నాడు. 34 ఏళ్ల చెకా ఇప్పటిదాకా 43 ఫైట్లలో తలపడగా 32 విజయాలున్నాయి. ఇందులో 17 నాకౌట్స్ ఉండగా.. 16 ఏళ్ల కెరీర్లో 300 రౌండ్లలో తలపడ్డాడు. విజేందర్ కేవలం 27 రౌండ్లు మాత్రమే ఆడాడు. ఈ బౌట్‌తో పాటు ఐదు అండర్కార్డ్ బౌట్స్ కూడా జరుగుతాయి. అన్ని బౌట్లు రాత్రి గం. 7.30 నుంచి 10.30 వరకు స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి.