ప్రొఫెషనల్‌గా విజేందర్
లండన్: భారత బాక్సింగ్‌లో ఎన్నో ‘తొలి ఘనత’లను సొంతం చేసుకున్న స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ ప్రొఫెషనల్‌గా మారాడు. అమెచ్యూర్ కెరీర్‌కు స్వస్తి చెప్పిన ఈ హర్యానా బాక్సర్... లండన్‌లోని క్వీన్స్‌బెర్రీ ప్రమోషన్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నాడు. ‘ప్రొఫెషనల్‌గా మారిన నేను కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని మొదలుపెడుతున్నాను. తీవ్రంగా శ్రమించి ప్రపంచస్థాయిలో భారత్‌కు మరింత పేరు తేవాలని అనుకుంటున్నాను’అని విజేందర్ వ్యాఖ్యానించాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2009 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం, 2010 గ్వాంగ్‌జూ ఆసియా క్రీడల్లో స్వర్ణం, కామన్వెల్త్ గేమ్స్‌లలో రజతం, రెండు కాంస్యాలు నెగ్గిన విజేందర్ భారత బాక్సింగ్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు. ప్రొఫెషనల్‌గా మారడంతో 29 ఏళ్ల విజేందర్ ఇకపై భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశాలకు తెరపడింది.