Star boxer Vijender Singh
-
విజేందర్‌లో ఆ సత్తా ఉంది: లీ బియర్డ్
లండన్: ప్రొఫెషనల్ సర్క్యూట్లో ఇప్పటి వరకు చూపిన ఏకాగ్రత, క్రమశిక్షణను అలాగే కొనసాగిస్తే భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ భవిష్యత్‌లో ప్రపంచ చాంపియన్ అవుతాడని అతని ట్రెయినర్ లీ బియర్డ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘నేను చాలా మందికి శిక్షణ ఇచ్చా. వాళ్లతో పోలిస్తే విజేందర్ నైపుణ్యం అమోఘం. ప్రపంచ చాంపియన్‌కు కావాల్సిన లక్షణాలన్నీ అతనిలో ఉన్నాయి’ అని బియర్డ్ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు తలపడిన ఆరు బౌట్లలో విజేందర్... టెక్నికల్ నాకౌట్ ద్వారా ప్రత్యర్థులను ఓడించాడు. ‘ వీటిన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే రెండు వారాల వ్యవధిలోనే విజేందర్ రెండు బౌట్లలో పోటీపడ్డాడు. ఇది చాలా గొప్ప ప్రదర్శన. తన కంటే మెరుగైన ప్రత్యర్థులపై పోటీపడటమంటే సాధారణ విషయం కాదు. రింగ్‌లో విజేందర్ చాలా వేగంగా స్పందిస్తాడు అతని ఆలోచనా విధానం, కదలికలు, పంచ్ పవర్ సూపర్బ్. అయితే పెద్ద ఫైట్స్‌లో గెలవాలంటే కొన్ని కీలక సర్దుబాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓవరాల్‌గా భవిష్యత్‌లో ప్రపంచ టైటిల్‌కు ఇతడు కూడా ఓ పోటీదారు అవుతాడు’ అని బియర్డ్ విశ్లేషించారు. -
‘నాతో పోటీకి ముందు ఆలోచించి మాట్లాడాలి’
మాంచెస్టర్: భవిష్యత్‌లో తనతో పోటీకి ముందు ప్రత్యర్థులు ఆచితూచి మాట్లాడాలని స్టార్ బాక్సర్ విజేందర్ హెచ్చరించాడు. ఆదివారం సామెట్తో జరిగిన పోరులో విజేందర్ నాకౌట్ విజయంతో హ్యాట్రిక్ సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ బౌట్‌కు ముందు సామెట్ మాటల యుద్ధం ప్రారంభిస్తూ భారత బాక్సర్ తనకు పోటీయే కాదని, అతడి ఎముకలు విరిచేస్తానని సవాల్ విసిరాడు. ‘ఫైట్‌కు ముందు సామెట్ మాటలతో నేను అద్భుత ప్రదర్శన ఇవ్వాలని భావించాను. అది సాధించాను. సవాల్ విసిరినంతగా అతడి ఆట లేదు. మూడు విజయాలతో ఈ ఏడాదిని ముగించినందుకు ఆనందంగా ఉంది’ అని విజేందర్ అన్నాడు. -
ప్రొఫెషనల్‌గా విజేందర్
లండన్: భారత బాక్సింగ్‌లో ఎన్నో ‘తొలి ఘనత’లను సొంతం చేసుకున్న స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ ప్రొఫెషనల్‌గా మారాడు. అమెచ్యూర్ కెరీర్‌కు స్వస్తి చెప్పిన ఈ హర్యానా బాక్సర్... లండన్‌లోని క్వీన్స్‌బెర్రీ ప్రమోషన్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నాడు. ‘ప్రొఫెషనల్‌గా మారిన నేను కెరీర్లో కొత్త అధ్యాయాన్ని మొదలుపెడుతున్నాను. తీవ్రంగా శ్రమించి ప్రపంచస్థాయిలో భారత్‌కు మరింత పేరు తేవాలని అనుకుంటున్నాను’అని విజేందర్ వ్యాఖ్యానించాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2009 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం, 2010 గ్వాంగ్జూ ఆసియా క్రీడల్లో స్వర్ణం, కామన్వెల్త్ గేమ్స్‌లలో రజతం, రెండు కాంస్యాలు నెగ్గిన విజేందర్ భారత బాక్సింగ్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు. ప్రొఫెషనల్‌గా మారడంతో 29 ఏళ్ల విజేందర్ ఇకపై భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశాలకు తెరపడింది.