‘నాతో పోటీకి ముందు ఆలోచించి మాట్లాడాలి’ | Vijender Singh records third consecutive pro win | Sakshi
Sakshi News home page

‘నాతో పోటీకి ముందు ఆలోచించి మాట్లాడాలి’

Published Mon, Dec 21 2015 1:13 AM | Last Updated on Sun, Sep 3 2017 2:18 PM

‘నాతో పోటీకి ముందు ఆలోచించి మాట్లాడాలి’

‘నాతో పోటీకి ముందు ఆలోచించి మాట్లాడాలి’

మాంచెస్టర్: భవిష్యత్‌లో తనతో పోటీకి ముందు ప్రత్యర్థులు ఆచితూచి మాట్లాడాలని స్టార్ బాక్సర్ విజేందర్ హెచ్చరించాడు. ఆదివారం సామెట్‌తో జరిగిన పోరులో విజేందర్ నాకౌట్ విజయంతో హ్యాట్రిక్ సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ బౌట్‌కు ముందు సామెట్ మాటల యుద్ధం ప్రారంభిస్తూ భారత బాక్సర్ తనకు పోటీయే కాదని, అతడి ఎముకలు విరిచేస్తానని సవాల్ విసిరాడు. ‘ఫైట్‌కు ముందు సామెట్ మాటలతో నేను అద్భుత ప్రదర్శన ఇవ్వాలని భావించాను. అది సాధించాను. సవాల్ విసిరినంతగా అతడి ఆట లేదు. మూడు విజయాలతో ఈ ఏడాదిని ముగించినందుకు ఆనందంగా ఉంది’ అని విజేందర్ అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement