
రోహ్‌తక్: జాతీయ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి గోనెళ్ల నిహారిక రజత పతకం సాధించింది. జూనియర్ ప్రపంచ చాంపియన్ అయిన నిహారిక ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. 69–75 కేజీల వెయిట్ కేటగిరీలో శుక్రవారం జరిగిన మహిళల పసిడి పతక పోరులో నిహారిక (తెలంగాణ) 0–5తో ఆస్థా పహ్వా (ఉత్తరప్రదేశ్) చేతిలో ఓడిపోయింది. 45–48 కేజీల వెయిట్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జి. రమ్యకు కూడా రెండో స్థానం దక్కింది. ఫైనల్లో నీతు (హరియాణా) 5–0తో రమ్య (ఏపీ)పై గెలిచింది. పురుషుల 46–49 కేజీల వెయిట్ కేటగిరీ ఫైనల్లో ఆర్. సాయి కుమార్ (ఏపీ) రజతాన్ని గెలుచుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment