
ఎలోర్డా కప్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో భారత మహిళా బాక్సర్ సిమ్రన్‌జిత్ కౌర్ శుభారంభం చేసింది. కజకిస్తాన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన 60 కేజీల విభాగం తొలి రౌండ్‌లో సిమ్రన్‌జిత్ 5–0తో ఇస్చనోవా (కజకిస్తాన్)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్ చేరింది. పురుషుల 54 కేజీల విభాగం తొలి రౌండ్‌లో అనంత చొపాడె 3–2తో గన్‌బోల్డ్ (మంగోలియా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరాడు.
చదవండి: Wimbledon 2022: పోరాడి ఓడిన సెరెనా విలియమ్స్..!