
సాక్షి, విశాఖపట్నం: జాతీయ సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో రైల్వేస్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్‌ఎస్‌పీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన 49 కేజీల తొలి రౌండ్‌లో శ్యామ్ 5–0తో హెచ్‌పీ కుమార్ (మణిపూర్)ను ఓడించాడు. ఇదే విభాగంలో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కె.క్రాంతి 3–2తో శివాజీ మోరే (మహారాష్ట్ర)పై గెలిచాడు. 52 కేజీల విభాగం తొలి రౌండ్‌లో అప్పలరాజు (ఆంధ్రప్రదేశ్) 0–5తో విజయ్ అరోరా (జార్ఖండ్) చేతిలో ఓడిపోయాడు.
మరోవైపు తెలంగాణ బాక్సర్లు బి.దీపక్ (49 కేజీలు) 3–2తో రిషి కుమార్ (రాజస్తాన్)పై, ఎన్.లలిత్ కిశోర్ (60 కేజీలు) 3–2తో రమణ్ (జార్ఖండ్)పై గెలిచి ముందంజ వేశారు. తెలంగాణకే చెందిన డి.ధర్మరాజు (హెవీవెయిట్), మొహమ్మద్ మోసిన్ (సూపర్ హెవీవెయిట్) కూడా తమ ప్రత్యర్థులపై గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment