![Kranti, Shyam in Quarters](/styles/webp/s3/article_images/2017/10/28/box.jpg.webp?itok=9_sVdm_2)
సాక్షి, విశాఖపట్నం: జాతీయ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కె.క్రాంతి... రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్‌ఎస్‌పీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ బాక్సర్ శ్యామ్ కుమార్ క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖాయం చేసుకున్నారు.
49 కేజీల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్‌లలో క్రాంతి 5–0తో వీర్ సింగ్ (హిమాచల్‌ప్రదేశ్)పై గెలుపొందగా... శ్యామ్ 4–1తో హిమాంశు శర్మ (పంజాబ్)ను ఓడించాడు. 60 కేజీల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో వి.దుర్గా రావు (ఆంధ్రప్రదేశ్) 3–2తో సచిన్ (చండీగఢ్)పై నెగ్గగా... వన్‌లాల్‌రియత్‌కిమా (మిజోరం) చేతిలో లలిత్ కిశోర్ (తెలంగాణ) ఓడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment