
సాక్షి, హైదరాబాద్: భారత పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్‌జీఎఫ్‌ఐ) జాతీయ బాక్సింగ్ చాంపియన్ షిప్‌లో హైదరాబాద్ కుర్రాడు మొహమ్మద్ సొహైల్ ఆకట్టుకున్నాడు. అస్సాంలో జరిగిన ఈ టోర్నీ అండర్–17 బాలుర 75–80 వెయిట్ కేటగిరీలో సొహైల్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. మాసబ్‌ట్యాంక్‌లోని స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్‌లో సొహైల్ బాక్సింగ్‌లో శిక్షణ పొందుతున్నాడు. పెద్దపల్లి వేదికగా జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లోనూ మొహమ్మద్ సొహైల్ రాణించాడు.
Comments
Please login to add a commentAdd a comment