
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ కుర్రాళ్లు అహ్మద్ బిన్ ఉస్మాన్, మొహమ్మద్ బిన్ ఉస్మాన్ సత్తా చాటారు. సుల్తానాబాద్‌లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో చెరో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. అండర్–19 బాలుర 49–52 వెయిట్ కేటగిరీ ఫైనల్లో వరంగల్‌కు చెందిన ఎ. విజయ్‌పై అహ్మద్ బిన్ ఉస్మాన్ (తపస్య జూనియర్ కాలేజి) గెలుపొంది విజేతగా నిలిచాడు. అంతకుముందు సెమీఫైనల్లో జె. రజనీకాంత్ (కరీంనగర్)ను అహ్మద్ ఓడించాడు. అండర్–14 బాలుర 38–40 కేజీల విభాగం ఫైనల్లో వరంగల్‌కు చెందిన అక్షయ్ రాజ్‌పై మొహమ్మద్ బిన్ ఉస్మాన్ విజయం సాధించాడు. అంతకుముందు సెమీఫైనల్లో ఆదిలాబాద్‌కు చెందిన మలిక్‌ను మొహమ్మద్ బిన్ ఉస్మాన్ ఓడించాడు.
Comments
Please login to add a commentAdd a comment