సాక్షి, హైదరాబాద్: జాతీయ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర జట్ల కోసం ఈనెల 4, 5 తేదీల్లో బాక్సింగ్ సెలక్షన్‌స జరుగనున్నాయి. తెలంగాణ బాక్సింగ్ సంఘం ఆధ్వర్యంలో యూత్ పురుషుల, మహిళల విభాగాల్లో ఈ ఎంపిక పోటీలు జరుగుతారుు. ఎల్బీ స్టేడియంలోని బాక్సింగ్ హాల్ వేదికగా సెలక్షన్‌స నిర్వహిస్తారు.
ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏపీ రెడ్డి (944163038)ని సంప్రదించవచ్చు. జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్ న్యూఢిల్లీలో జనవరి 16 నుంచి 22 వరకు జరుగుతుంది.