హో చి మిన్ సిటీ (వియత్నాం): తన పాత వెయిట్ కేటగిరికి మారిపోయాక బరిలోకి దిగిన తొలి అంతర్జాతీయ టోర్నమెంట్‌లో భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఆసియా మహిళల చాంపియన్ షిప్ లో భాగంగా శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 48 కేజీల విభాగంలో చైనీస్ తైపీ బాక్సర్ మెంగ్ చియె పింగ్ పై మేరీకోమ్ విజయం సాధించి సెమీస్ లోకి ప్రవేశించారు. తద్వారా పతకాన్ని ఖాయం చేసుకుంది మేరీకోమ్. ఈ చాంపియన్ షిప్ లో మేరీకోమ్ తో పాటు శిక్షా(54 కేజీలు, ప్రియాంక చౌదరి(60 కేజీలు)లు సైతం సెమీస్ కు చేరారు.
అంతకుముందు ఆసియా చాంపియన్ షిప్ లో ఐదుసార్లు తలపడిన 34 ఏళ్ల మేరీకోమ్.. నాలుగుసార్లు స్వర్ణం పతకాలు సాధించగా, ఒకసారి రజత పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. సెమీఫైనల్లో జపాన్ బాక్సర్ సుబాసా కోమురాతో మేరీకోమ్ తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment