మరో బౌట్‌కు విజేందర్‌ రె‘ఢీ’ | Vijender Singh Looks To End Year On A Winning Note | Sakshi
Sakshi News home page

మరో బౌట్‌కు విజేందర్‌ రె‘ఢీ’

Published Tue, Nov 19 2019 9:57 AM | Last Updated on Tue, Nov 19 2019 9:57 AM

Vijender Singh Looks To End Year On A Winning Note - Sakshi

దుబాయ్‌: ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఆసియా పసిఫిక్, ఓరియంటల్‌ సూపర్‌ మిడిల్‌వెయిట్‌ చాంపియన్‌ విజేందర్‌ సింగ్‌ మరో బౌట్‌కు సిద్ధమయ్యాడు. నవంబర్‌ 22న జరిగే ఫైట్‌లో అతను కామన్వెల్త్‌ గేమ్స్‌ మాజీ చాంపియన్‌ చార్లెస్‌ అడామూ (ఘనా)తో పోటీపడతాడు. 10 రౌండ్ల పాటు జరిగే ఈ బౌట్‌లోనూ గెలిచి తన విజయాల సంఖ్యను 12కు పెంచుకోవాలని విజేందర్‌ పట్టుదలతో ఉన్నాడు.

2020లో ప్రపంచ బాక్సింగ్‌ టైటిల్‌ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ 34 ఏళ్ల బాక్సర్‌ ఈ మ్యాచ్‌ను సన్నాహకంగా భావిస్తున్నట్లు తెలిపాడు.  మరోవైపు తాను ఆడిన బౌట్‌లలో 33 గెలిచి, 14లో ఓడిన అడామూ... విజేందర్‌ విజయాల రికార్డుకు బ్రేక్‌ వేస్తానంటున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement