ఫైనల్లో ఆశిష్, రయీస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఆశిష్, రయీస్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. ఎథిక్స్ స్పోర్ట్స్ ఫౌండేషన్ సహకారంతో జరుగుతున్న ఈ పోటీలను బుధవారం ఎల్బీ స్టేడియంలో సీనియర్ బాక్సర్ వెంకట్‌రావు ప్రారంభించారు. 46 కేజీల విభాగం సెమీఫైనల్ పోటీల్లో మొహమ్మద్ నవీద్... అబ్దుల్ హకీం మొహమ్మద్‌పై, ఆశిష్.. దినేశ్‌పై గెలిచి ఫైనల్‌కు చేరుకున్నారు. 48 కేజీల విభాగంలో రయీస్.. నిరాజ్‌పై, చైతన్య... మురళీకృష్ణపై నెగ్గి ఫైనల్ చేరారు.
ఇతర సెమీఫైనల్స్ ఫలితాలు: 50 కేజీల విభాగంలో మొహమ్మద్ ఉస్మాన్.. సయ్యద్ హుస్సేన్‌పై, భరత్ కుమార్.. బి. వంశీపై; 52 కేజీల విభాగంలో పవన్ కల్యాణ్.. సాయి సుమీత్‌పై, శ్రీనివాస్... నవీన్‌పై; 54 కేజీల విభాగంలో త్రిజోత్ సింగ్.. శ్రీకాంత్ గౌడ్‌పై, అజయ్.. భరత్‌పై, 57 కేజీల విభాగంలో హరీశ్.. పవన్‌పై, ఏవీ పవన్.. సుహాస్‌పై; 60 కేజీల విభాగంలో హర్షిత్.. సాయి మనీశ్‌పై; 63 కేజీల విభాగంలో రాహుల్.. నిఖిల్ భద్రాద్రిపై; 75 కేజీల విభాగంలో ఆర్యవ్ మిశ్రా.. సయ్యద్ అహ్మద్‌పై, రంగా రోహిత్.. రాజేశ్‌పై; 80+ విభాగంలో జి. వంశీ.. శామ్సన్‌పై, సాయిరాం.. విశాల్‌పై గెలిచి ఫైనల్స్‌లో ప్రవేశించారు. 63 కేజీల విభాగంలో వేణు.. 70 కేజీల విభాగంలో రాకేశ్, హనుమాన్‌లకు సెమీఫైనల్లో ‘బై’ లభించింది.