బిలీవ్‌ ఇన్ యూ అంటున్న రాశిఖన్నా | rasikhanna says believe in you | Sakshi
Sakshi News home page

బిలీవ్‌ ఇన్ యూ అంటున్న రాశిఖన్నా

Published Mon, Mar 6 2017 3:20 AM | Last Updated on Tue, Sep 5 2017 5:17 AM

బిలీవ్‌ ఇన్  యూ అంటున్న రాశిఖన్నా

బిలీవ్‌ ఇన్ యూ అంటున్న రాశిఖన్నా

సామాజిక స్పృహ ఉన్న నటీమణులు చాలా తక్కువ మందే ఉంటారు. చేసేది వ్యాపారమే అయినా అందులోనూ ప్రజలకు అవసరమైనదో, వారికి స్ఫూర్తి నిచ్చే విషయాలు ఉండాలని భావించేవారు అరుదనే చెప్పాలి. వర్ధమాన నటి రాశిఖన్నా అలాంటి స్ఫూర్తిదాయకమైన ఒక వీడియోను ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ హైదరాబాదీ బ్యూటీ టాలీవుడ్‌లో కథానాయకిగా ఎదుగుతున్న నటి. అంతే కాదు కోలీవుడ్, మాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరిక్షించుకునే స్టేజీలో ఉంది. అయితే ఆదిలోనే మెడ్రాస్‌ కేఫ్‌ అనే హిందీ చిత్రంలో నటించింది. మొత్తానికి బహుభాషా నటిగా అవతారమెతి్తన రాశిఖన్నా తమిళంలో సైతాన్  కా బచ్చా అనే చిత్రంతో పాటు నయనతార నటిస్తున్న ఇమైకా నోడిగళ్‌ చిత్రంలోనూ నటిస్తోంది.

ఈ రెండు చిత్రాలతో కోలీవుడ్‌లో తన భవిష్యత్‌ ఆధారపడి ఉంటుంది. తెలుగులో కథానాయకిగా బిజీగా ఉన్న రాశిఖన్నా తాజాగా జూనియర్‌ ఎన్టీఆర్‌తో రొమాన్స్  చేసే లక్కీఛాన్స్  కొట్టేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఓకే నటిగా అమ్మడు చాలా హ్యాపీగానే ఉంది. ఇప్పుడు నిర్మాతగా, కవిగానూ మారడం విశేషం. నిర్మాతగా అనగానే తనేదో చిత్రం నిర్మిస్తోందని అనుకోకండి. ఒక వీడియో ఆల్బమ్‌ను రూపొందించింది.బిలీవ్‌ ఇన్  యూ పేరుతో రూపొందించిన ఈ ఆల్బమ్‌ను అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా విడుదల చేయడానికి సిద్ధం అయ్యింది.

బిలీవ్‌ ఇన్  యూ( నిన్ను నీవు నమ్ము)ఈ పేరే అందరిలోనూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఉంది కదూ‘ ఇందులో ఒక కవితను కూడా రాశిఖన్నా రాసిందట. ఐయామ్‌ నాట్‌ ది సైజ్‌ ఆఫ్‌ మై జీన్స్ ..ఐయామ్‌ ది సైజ్‌ ఆఫ్‌ మై స్మైల్‌ వంటి అందరికీ, ముఖ్యంగా మహిళలకు స్ఫూర్తిని కలిగించే కవితను రాశిఖన్నా ఈ ఆల్బమ్‌ కోసం రాసిందట.ఈ నెల 8వ తేదీన విడుదల కానున్న ఈ వీడియో ఆల్బమ్‌ పొందే స్పందన కోసం చాలా ఎగ్జైట్‌గా ఎదురు చూస్తున్నట్లు నటి రాశిఖన్నా పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement