Madras Cafe
-
బిలీవ్ ఇన్ యూ అంటున్న రాశిఖన్నా
సామాజిక స్పృహ ఉన్న నటీమణులు చాలా తక్కువ మందే ఉంటారు. చేసేది వ్యాపారమే అయినా అందులోనూ ప్రజలకు అవసరమైనదో, వారికి స్ఫూర్తి నిచ్చే విషయాలు ఉండాలని భావించేవారు అరుదనే చెప్పాలి. వర్ధమాన నటి రాశిఖన్నా అలాంటి స్ఫూర్తిదాయకమైన ఒక వీడియోను ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ హైదరాబాదీ బ్యూటీ టాలీవుడ్లో కథానాయకిగా ఎదుగుతున్న నటి. అంతే కాదు కోలీవుడ్, మాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరిక్షించుకునే స్టేజీలో ఉంది. అయితే ఆదిలోనే మెడ్రాస్ కేఫ్ అనే హిందీ చిత్రంలో నటించింది. మొత్తానికి బహుభాషా నటిగా అవతారమెతి్తన రాశిఖన్నా తమిళంలో సైతాన్ కా బచ్చా అనే చిత్రంతో పాటు నయనతార నటిస్తున్న ఇమైకా నోడిగళ్ చిత్రంలోనూ నటిస్తోంది. ఈ రెండు చిత్రాలతో కోలీవుడ్‌లో తన భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. తెలుగులో కథానాయకిగా బిజీగా ఉన్న రాశిఖన్నా తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేసే లక్కీఛాన్స్ కొట్టేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఓకే నటిగా అమ్మడు చాలా హ్యాపీగానే ఉంది. ఇప్పుడు నిర్మాతగా, కవిగానూ మారడం విశేషం. నిర్మాతగా అనగానే తనేదో చిత్రం నిర్మిస్తోందని అనుకోకండి. ఒక వీడియో ఆల్బమ్‌ను రూపొందించింది.బిలీవ్ ఇన్ యూ పేరుతో రూపొందించిన ఈ ఆల్బమ్‌ను అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా విడుదల చేయడానికి సిద్ధం అయ్యింది. బిలీవ్ ఇన్ యూ( నిన్ను నీవు నమ్ము)ఈ పేరే అందరిలోనూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఉంది కదూ‘ ఇందులో ఒక కవితను కూడా రాశిఖన్నా రాసిందట. ఐయామ్ నాట్ ది సైజ్ ఆఫ్ మై జీన్స్ ..ఐయామ్ ది సైజ్ ఆఫ్ మై స్మైల్ వంటి అందరికీ, ముఖ్యంగా మహిళలకు స్ఫూర్తిని కలిగించే కవితను రాశిఖన్నా ఈ ఆల్బమ్ కోసం రాసిందట.ఈ నెల 8వ తేదీన విడుదల కానున్న ఈ వీడియో ఆల్బమ్ పొందే స్పందన కోసం చాలా ఎగ్జైట్‌గా ఎదురు చూస్తున్నట్లు నటి రాశిఖన్నా పేర్కొంది. -
ఉప్మా 40 పైసలు, ఫిల్టర్ కాఫీ 15 పైసలే!
ముంబై: తమ వ్యాపారాలు ప్రారంభించాకా వార్షికోత్సవాలను జరుపుకోవడంలో ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇలాంటి విశేష సందర్భాన్ని ఆసక్తికరమైన రీతిలో సెలబ్రేట్ చేసుకుంది ముంబైలోని మతుంగా మద్రాస్ కేఫ్. 1940లో మొదలైన ఈ కేఫ్ ఇటీవలే 75 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో తమ కేఫ్‌కు వచ్చే వాళ్లకు ఈ సందర్భం గుర్తుండిపోయేలా చేశారు దాని నిర్వాహకులు. తమ కేఫ్ ప్రారంభమైన సమయంలో తినుబండారాలు ఏ ధరకు అందించారో.. 75 ఏళ్లను పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా వాటిని అవే ధరలకు అందించారు. ఉప్మా కేవలం 40 పైసలకు, ఫిల్టర్ కాఫీని పదిహేను పైసలకు అందించారు. ఇవేగాక ఈ మద్రాస్ కేఫ్‌లో దక్షిణాది స్పెషల్స్ అయిన రసం, బటర్ ఇడ్లీ, దోసె, అప్పలం, మైసూర్ పాక్ వంటి వాటిని కూడా 1940 నాటి ధరలకు అందించారు. తమ రెస్టారెంట్‌కు వచ్చిన వారికి పాతధరలతో కొత్త అనుభవాన్ని ఇచ్చారు. అయితే ఈ ఆఫర్ పరిమిత సమయం మాత్రమే. -
బంపర్ ఆఫర్!
మనం ఒకటి అనుకుంటే దైవం వేరే తలుస్తుందట. రాశీ ఖన్నా విషయంలో అదే జరిగింది. యాడ్ ఫిలిమ్స్‌కి కాపీ రైటర్‌గా చేస్తూ, అలా కొనసాగిపోవాలనుకున్న ఆమెకు అనుకోకుండా హిందీ చిత్రం ‘మద్రాస్ కేఫ్’కి అవకాశం రావడం, ఇక ఆ తర్వాత కలం పెట్టుకునే తీరిక లేకుండా కెమెరా ముందు బిజీ కావడం చకచకా జరిగిపోయాయి. ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంలో కథానాయికగా, ‘మనం’లో చేసిన అతిథి పాత్ర ద్వారా ఆమె అందర్నీ ఆకట్టుకున్నారు. ఫలితంగా ఏకంగా గోపీచంద్ సరసన ‘జిల్’లో అవకాశం కొట్టేశారు. ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ రాశీని వరించింది. లవర్ బోయ్ రామ్ సరసన ‘శివం’లో నటించే అవకాశం రాశీ ఖన్నాకు దక్కింది. శ్రీనివాసరెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ, ‘స్రవంతి మూవీస్ పతాకం’పె ‘స్రవంతి’ రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత నెల 27న మొదలైన ఈ చిత్రం షెడ్యూల్ ఈ నెల 20 వరకూ హైదరాబాద్‌లో జరుగుతుంది.పస్తుతం పీటర్ హేన్స్ ఆధ్వర్యంలో పోరాట సన్నివేశాలు తీస్తున్నారు. ఆ తర్వాత ప్రధాన తారాగణంపై టాకీ సీన్స్ కూడా తీయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం: రసూల్ ఎల్లోర్, సమర్పణ: కృష్ణ చైతన్య. -
'మద్రాస్ కేఫ్' లో సచ్ఛీలత లేదు
కోల్‌కతా: జాన్ అబ్రహాం, నర్గీస్ ఫక్రీ ప్రధాన పాత్రధారులుగా సూజిత్ సర్కార్ దర్శకత్వంలో రూపొందిన మద్రాస్ కేఫ్ చిత్రంలో ఎటువంటి సచ్ఛీలత లేదని శ్రీలంక ఫిల్మ్ మేకర్ ప్రసన్నా విత్నేజ్ అభిప్రాయపడ్డాడు. ఈ సినిమా ఘన విజయాన్ని సాధించనప్పటికీ ఈ చిత్రంలో సచ్చీలత లేదని పేర్కొన్నాడు. 19వ కోల్‌కతా ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరైన ప్రసన్న సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ సినిమాలో ఏ ఒక్క సన్నివేశం కూడా మనసును కదిలించలేదని పేర్కొన్నాడు. కాగా, పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం విజయంపట్ల ప్రభుత్వం చాలా సంతోషంగా ఉందన్నాడు. శ్రీలంకలో జరిగే సివిల్ వార్ ను ఆధారంగా చేసుకుని ఈ చిత్రం రూపొందినా, సినిమా పూర్తిగా ఆకట్టుకోలేక పోయిందన్నాడు. బాలీవుడ్ చిత్రాలతో తమ సినిమాలు పోటీ పడుతుండటం లేదని తెలిపాడు. కాగా, శ్రీలంక చిత్రాలకు బాలీవుడ్ నుంచి మంచి పోటీ ఉందన్నాడు. దీనికి ఈ మధ్యనే విడుదలైన క్రిష్ -3ని ఉదాహరణగా పేర్కొన్నాడు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం లంకలో భారీ విజయాన్ని సొంత చేసుకుందని తెలిపాడు. లంక సినిమాలకు భారత్ లో పెద్దగా మార్కెట్ లేకపోవడం వల్ల తాను చింతించడంలేదన్నాడు. -
'మద్రాస్ కేఫే' సినిమా రివ్యూ!
‘విక్కి డోనర్’తో సంచలన విజయం సాధించిన శుజిత్ సర్కార్, జాన్ అబ్రహంలు మళ్లీ ‘మద్రాస్ కేఫే’ అనే చిత్రాన్ని రూపొందించారు. ఈసారి రెగ్యులర్ బాలీవుడ్ మసాలా చిత్రంతో కాకుండా.. శ్రీలంక ప్రభుత్వానికి, తమిళుల మధ్య జరిగిన అంతర్యుద్ధం, భారత్‌లో మాజీ ప్రధాని హత్యకు కుట్ర ఎలా జరిగిందనే నేపథ్యంతో తెరకెక్కిన ‘మద్రాస్ కేఫే’ అనే చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రెగ్యులర్ పొలిటికల్ డ్రామా తెరెకెక్కిన ‘మద్రాస్ కేఫే’ చిత్ర కథను పరిశీలిద్దాం! ప్రత్యేక తమిళ ఈలం కోసం పోరాటం చేస్తున్న ఎల్టీఎఫ్కు శ్రీలంక ప్రభుత్వానికి మధ్య భీకరమైన దాడులు జరగడం, అందులో వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడాన్ని అడ్డుకోవడానికి భారత ప్రభుత్వం శాంతి సైన్యాన్ని ఆదేశానికి పంపిస్తుంది. అయితే కొన్ని పరిస్థితుల వల్ల శాంతి సైన్యాన్ని భారత్ వెనక్కి ర ప్పిస్తుంది. శాంతి సైన్యం వల్ల తమకు అన్యాయం జరిగిందని భావించిన ఎల్టీఎఫ్ భారత ప్రభుత్వంపై పగ తీర్చుకోవడానికి సిద్ధమవుతుంది. ఆ సమయంలోనే భారత్‌లో ఎన్నికలు రావడం.. ఆ ఎన్నికల్లో మాజీ ప్రధాని హత్యకు కుట్రపన్ని ఎలా చంపారనేదే ఈ చిత్ర కథ. ఈ చిత్రంలో విక్రమ్ సింగ్ పాత్రలో జాన్ అబ్రహం ‘రా’ అధికారిగా నటించాడు. జాఫ్నాలో ఎల్టీ ఎఫ్ అధినేత అన్న ప్రభాకర్ అధిపత్యానికి గండి కొట్టడానికి జాఫ్నాకు పంపిన అధికారి పాత్రలో జాన్ అబ్రహం అద్బుతంగా నటించాడు. ఇప్పటి వరకు జాన్ చేసిన పాత్రలు ఒక ఎత్తు.. విక్రమ్ సింగ్ పాత్ర మరో ఎత్తు. ఈ చిత్రం ద్వారా జాన్ మీద మంచి నటుడి గా ముద్ర పడటం ఖాయం. మద్రాస్ కేఫే లాంటి విభిన్న కథా చిత్రానికి జాన్ అబ్రహం నిర్మాతగా వ్యవహరించడం మరో పెద్ద సాహసం. ఇక ఈ చిత్రంలో జయ అనే జర్నలిస్ట్ పాత్రలో బాలీవుడ్ తార నర్గీస్ ఫక్రీ నటించింది. శ్రీలంకలో యుద్ద వార్తలను కవరేజ్ చేసే బ్రిటిష్ జర్నలిస్టుగా నర్గీస్ అందరికీ గుర్తుండిపోతుంది. ఈ చిత్రంలో ఇంటలిజెన్స్ అధికారి ఆర్డీ పాత్రలో క్విజ్ మాస్టర్ సిద్దార్థ బసు నటించాడు. సిద్ధార్థ బసు నటనలో చక్కటి పరిణతి ప్రదర్శించి ఫుల్ మార్కులు కొట్టేశాడు. శ్రీలంకలో జరిగిన వాస్తవ సంఘటనలను, యాక్షన్ సీన్లను ఊపిరి బిగపెట్టి చూసేంతగా దర్శకుడు శుజిత్ సర్కార్ తెరకెక్కించాడు. వినోదానికి తావులేని స్క్రిప్ట్‌ను దర్శకుడు తెరపై నడిపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. చిత్ర తొలి భాగంలో శ్రీలంక ప్రభుత్వానికి, తమిళుల మధ్య జరిగే పోరాటాలు సహజసిద్దంగా ఉన్నాయి. ద్వితీయ భాగంలో భారత మాజీ ప్రధాని హత్యకు కుట్ర, ఆ కుట్రను భగ్నం చేసేందుకు ఇంటలిజెన్స్ అధికారుల ప్రయత్నాలు, క్లైమాక్స్ చిత్రీకరణ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయి. సంగీత దర్శకుడు శంతను మోయిత్రా, క మల్జీత్ నేగి ఫోటోగ్రఫి, చంద్రశేఖర్ ప్రజాపతి ఎడిటింగ్ ‘మద్రాస్ కేఫే’ను హైరేంజ్లో నిలిపాయి. ఈ చిత్రంలో కొన్ని లోపాలు ఉన్నా.. పెద్దగా పట్టించుకునే రేంజ్లో లేకపోవడం మద్రాస్ కేఫేకు కలిసి వచ్చే అంశం. యాక్షన్, పొలిటికల్ డ్రామా, థ్రిల్లర్ సినిమాలను ఆదరించే ప్రేక్షకులు ‘మద్రాస్ కేఫే’ తప్పక నచ్చుతుంది. -
'మద్రాస్ కేఫే'కు వ్యతిరేకంగా బీజేపీ, తమిళుల నిరసన
'మద్రాస్ కేఫే' విడుదల నిలిపివేయాలంటూ భారతీయ తమిళులు, బీజేపీ మద్దతు దారులు ముంబైలోని ప్లకార్డులతో నిరసన చేశారు. 'మద్రాస్ కెఫే' చిత్రంలో తమ మనోభావాలకు వ్యతిరేకంగా సన్నివేశాలు చిత్రించారనే ఆరో్పణలతో తమిళులు నిరసన తెలుపుతున్నారు. బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం నటించి, నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 23 తేదిన విడుదలవుతోంది. -
'మద్రాస్ కేఫ్' రాజీవ్ హత్యకు సంబంధించినది కాదు
శ్రీలంకలో సాగుతున్న అంతర్యుద్ధంపై తాను తీస్తున్న 'మద్రాస్ కేఫ్' చిత్రంలో రాజీవ్ గాంధీ హత్యకు సంబంధించి కొన్ని సన్నివేశాలు ఉన్నమాట వాస్తవమే గానీ, ఆ సినిమా మాత్రం రాజీవ్ గురించి కానే కాదని చిత్ర దర్శకుడు షూజిత్ సర్కార్ తెలిపారు. చిత్ర నిర్మాత, బాలీవుడ్ హీరో, ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారి జాన్ అబ్రహంతో కలిసి ఈ విషయమై ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజీవ్ హత్యకు సంబంధించిన సన్నివేశాలు ఉన్న నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ నుంచి అనుమతి ఏమైనా తీసుకున్నారా అని విలేకరులు సర్కార్‌ను ప్రశ్నించారు. దీనిక.. ఇది రాజీవ్ జీవిత చిత్రం కాదని, ఆయన పాత్రధారికి, రాజీవ్ గాంధీకి కొన్ని పోలికలు ఉన్నమాట మాత్రం వాస్తవమేనని తెలిపారు. ఎల్టీటీఈకి చెందిన ఆత్మాహుతి దళం సభ్యుల దాడిలో రాజీవ్ మరణించగా, అలాంటి సంఘటననే సినిమా ట్రైలర్లో చూపించారు. అయితే, తాము వార్తాపత్రికలలో చదివి మాత్రమే ఆ సంఘటనను తీసుకున్నామని, ఇక దానిచుట్టూ ఉన్న మిగిలిన సంఘటనలను మాత్రం స్క్రిప్టు రచనలో ఊహాత్మకంగా రూపొందించినవేనని సర్కార్ చెప్పారు. వాస్తవంగా అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియదని, అయితే.. ప్రతి ఒక్కరికీ ఆ సంఘటన జరిగిందని మాత్రం తెలుసని ఆయన అన్నారు. మద్రాస్ కేఫ్ చిత్రం ఈనెల 23న విడుదల కానుంది. అయితే, దీనిపై ఇప్పటికే నామ్ తమిళర్, ఎండీఎంకే లాంటి పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎల్టీటీఈ కార్యకర్తలను ఇందులో ఉగ్రవాదులుగా చూపించారంటూ వారు మండిపడుతున్నారు. అయితే.. ఇప్పటికే ఈ చిత్ర ప్రాజెక్టుపై ఏడు సంవత్సరాలు వెచ్చించిన సర్కార్ మాత్రం.. ఈ సన్నివేశం చిత్రానికి చాలా కీలకమని వాదిస్తున్నారు. తమ చిత్రంలో జాతికి జరిగిన నష్టం గురించి మాత్రమే చెబుతున్నామన్నారు. చాలామంది పౌరులు అక్కడ ప్రాణాలు కోల్పోయారని, ఇంకా చాలామంది నిరాశ్రయులుగా మారిపోయారని, అక్కడి సజీవ చిత్రాన్నే తాము చూపిస్తున్నామని అన్నారు. -
ఏ ఒక్కరిని టెర్రరిస్ట్ అనలేదు: జాన్ అబ్రహం
'మద్రాస్ కేఫ్' చిత్రంలో తాము ఏ ఒక్కరిని టెర్రరిస్ట్ గా చిత్రీకరించలేదని బాలీవుడ్ నటుడు, నిర్మాత జాన్ అబ్రహం వివరణ ఇచ్చారు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్ టీ టీఈ) గ్రూప్ ను టెర్రరిస్టులుగా చిత్రీకరించారని వస్తున్న ఆరోపణలకు జాన్ అబ్రహం వివరణ ఇచ్చారు. 'తాము ఎవ్వరిని కూడా నొప్పించలేదు. ఎవరికి అనుకూలంగా వ్యవహరించలేదు. మద్రాస్ కేఫ్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వారికి చిత్రాన్ని చూపిస్తాం' అని జాన్ తెలిపాడు. వాస్తవ పరిస్థితులు, నిజాల ఆధారంగానే మద్రాస్ కేఫ్ ను రూపొందించాం అని అన్నాడు. ఎల్టీటీఈ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా చిత్రాన్ని రూపొందించారనే ఆరోపణలతో 'మద్రాస్ కేఫ్'ను నిషేధించాలని తమిళ సంస్థ నామ్ తమీజార్ వ్యవస్థాపకుడు సీమాన్ డిమాండ్ చేసిన నేపథ్యంలో జాన్ అబ్రహం స్పందించారు. ఆగస్టు 23న విడుదలవుతున్న ఈ చిత్రంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారికి 'మద్రాస్ కేఫ్' ను చూపించడానికి సిద్ధంగా ఉన్నామని.. అయినా.. ఈ చిత్రాన్ని రాజకీయ లబ్దికి ఉపయోగించుకోవాలని చూస్తే.. దానికి తాను ఏమి చేయలేనని ఆయన అన్నారు. చెన్నైలో ఏర్పాటు చేసిన మద్రాస్ కేఫ్ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జాన్ అబ్రహం పాల్గొన్నాడు.