![బంపర్ ఆఫర్!](/styles/webp/s3/article_images/2017/09/3/71430761022_625x300.jpg.webp?itok=LigNyFkY)
బంపర్ ఆఫర్!
మనం ఒకటి అనుకుంటే దైవం వేరే తలుస్తుందట. రాశీ ఖన్నా విషయంలో అదే జరిగింది. యాడ్ ఫిలిమ్స్‌కి కాపీ రైటర్‌గా చేస్తూ, అలా కొనసాగిపోవాలనుకున్న ఆమెకు అనుకోకుండా హిందీ చిత్రం ‘మద్రాస్ కేఫ్’కి అవకాశం రావడం, ఇక ఆ తర్వాత కలం పెట్టుకునే తీరిక లేకుండా కెమెరా ముందు బిజీ కావడం చకచకా జరిగిపోయాయి. ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంలో కథానాయికగా, ‘మనం’లో చేసిన అతిథి పాత్ర ద్వారా ఆమె అందర్నీ ఆకట్టుకున్నారు. ఫలితంగా ఏకంగా గోపీచంద్ సరసన ‘జిల్’లో అవకాశం కొట్టేశారు. ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ రాశీని వరించింది.
లవర్ బోయ్ రామ్ సరసన ‘శివం’లో నటించే అవకాశం రాశీ ఖన్నాకు దక్కింది. శ్రీనివాసరెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ, ‘స్రవంతి మూవీస్ పతాకం’పె ‘స్రవంతి’ రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత నెల 27న మొదలైన ఈ చిత్రం షెడ్యూల్ ఈ నెల 20 వరకూ హైదరాబాద్‌లో జరుగుతుంది.పస్తుతం పీటర్ హేన్స్ ఆధ్వర్యంలో పోరాట సన్నివేశాలు తీస్తున్నారు. ఆ తర్వాత ప్రధాన తారాగణంపై టాకీ సీన్స్ కూడా తీయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం: రసూల్ ఎల్లోర్, సమర్పణ: కృష్ణ చైతన్య.