Sravanthi Ravi Kishore
-
IFFI: కిడకి అభినందనలు
ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా ‘కిడ’. పూ రామన్, కాళీ వెంకట్ ప్రధాన పాత్రల్లో ఆర్ఏ వెంకట్ దర్శకత్వంలో తెరకెక్కింది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని గోవాలో జరుగుతున్న ‘ఇఫీ’ (‘భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు’)లో ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శించగా, వీక్షకులు ‘స్టాండింగ్ ఒవేషన్’తో అభినందించారు. ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ– ‘‘ఏఆర్ వెంకట్‌కి ‘కిడ’ తొలి సినిమా అయినా బాగా తీశాడు. సినిమాకు భాషాపరమైన ఎల్లలు, హద్దులు లేవు. మంచి సినిమా వస్తే చూస్తారనే నమ్మకంతో తమిళంలో తీశాను’’ అన్నారు. ఆర్ఏ వెంకట్ మాట్లాడుతూ– ‘‘తాత, మనవడు, మేక చుట్టూ ఈ చిత్ర కథ తిరుగుతుంది. పనోరమాలో పదర్శించిన సినిమాని చాలామంది స్టూడెంట్స్ చూశారు.. వారికి బాగా నచ్చింది. నా తొలి సినిమాకు రవికిశోర్లాంటి నిర్మాత లభించడం నా అదృష్టం’’ అన్నారు. -
Nuvve Nuvve@20 Years: 'నువ్వే నువ్వే’లోని ఈ డైలాగ్స్ గుర్తున్నాయా?
త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ... ప్రముఖ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ పతాకంపై 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన సినిమా 'నువ్వే నువ్వే'. తరుణ్, శ్రియ జంటగా నటించారు. ప్రకాశ్ రాజ్, చంద్ర మోహన్, సునీల్, రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, అనితా చౌదరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 2002లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల అభిమానంతో పాటు పురస్కారాలూ దక్కాయి. నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రం విభాగంలో 'సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్'గా 'నువ్వే నువ్వే' నిలిచింది. వెండి నందిని 'స్రవంతి' రవికిశోర్‌కి అందించింది. ఉత్తమ సంభాషణల రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ నంది అవార్డు అందుకున్నారు. ఫిలింఫేర్ సౌత్ అవార్డుల్లో ఉత్తమ సహాయ నటుడిగా ప్రకాశ్ రాజ్ పురస్కారం అందుకున్నారు. ఈ సినిమాలోని డైలాగ్స్ అప్పట్లో బాగా పేలాయి. ‘నువ్వే నువ్వే’ విడుదలై సోమవారానికి (అక్టోబర్ 10) నాటికి 20 ఏళ్ళు. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని కొన్ని డైలాగులు.. ► అమ్మ, ఆవకాయ్, అంజలి... ఎప్పుడూ బోర్ కొట్టవు. ► ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు... పోషించే శక్తి వచ్చేసరికి ప్రేమించే టైం ఉండదు. ► కన్నతల్లిని, దేవుణ్ణి మనమే వెళ్లి చూడాలి. వాళ్ళు మన దగ్గరకు రావాలని కోరుకోవడం మూర్ఖత్వం. ►ఆడపిల్లలు పుట్టినప్పుడు వాళ్లు ఏడుస్తారు. పెళ్లి చేసుకొని వెళ్లేటప్పుడు మనల్ని ఏడిపిస్తారు. ►సంపాదించడం చేతకాని వాడికి ఖర్చుపెట్టే అర్హత లేదు. చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు. ►డబ్బుతో బ్రెడ్ కొనగలరు, ఆకలిని కొనలేరు. బెడ్ కొనగలరు, నిద్రని కొనలేరు. ► మనం తప్పు చేస్తే తప్పని, కరెక్ట్ చేస్తే రైట్ అని చెప్పేవాళ్ళు మంచివాళ్లు. మనం ఏం చేసినా భరించే వాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళు. ►ఒకడు రిక్షా తొక్కడం దగ్గర మొదలుపెట్టి కోటీశ్వరుడు అయ్యాడు కదా అని... వారి కొడుక్కి కొత్త రిక్షా కొనిపెట్టి ఎదగమనడం అంత బాగుండదు. ►ఎక్కడికి వెళ్లాలో తెలిసినప్పుడు... ఎలా వెళ్లాలో చెప్పడానికి నేనెవర్ని? ►నీ జీవితంలో వంద మార్కులు ఉంటే 20 నాకు, 80 వాడికి. ఇంకో పదిహేను మార్కులు వేసి మీ నాన్నను పాస్ చేయలేవమ్మా? ► డబ్బులు ఉన్నవాళ్ళంతా ఖర్చుపెట్టలేరు. ఖర్చు పెట్టేవాళ్లంతా ఆనదించలేరు. ►తాజ్ మహల్... చార్మినార్... నాలాంటి కుర్రాడు చూడటానికే! కొనడానికి మీలాంటి వాళ్ళు సరిపోరు. ► నేను దిగడం అంటూ మొదలుపెడితే ఇది మొదటి మెట్టు. దీని బట్టి నా ఆఖరి మెట్టు ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోండి. -
ఆయన కారణంగానే ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు'ని తెలుగులో రిలీజ్ చేస్తున్నాం: గౌతమ్ మీనన్
శింబు హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం 'వెందు తనిందదు కాడు'. ఇందులో సిద్దీ ఇధ్నానీ హీరోయిన్గా నటించింది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారి. కె. గణేష్ భారీ ఎత్తున నిర్మించారు. ఈ చిత్రాన్ని 'ది లైఫ్ ఆఫ్ ముత్తు'గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది ప్రసిద్ధ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్. నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ విడుదల చేశారు. సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో తెలుగు మీడియాతో చిత్ర బృందం ముచ్చటించింది. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ మాట్లాడుతూ ''తొలుత తెలుగులో ఈ సినిమా విడుదల చేయాలనే ఆలోచన లేదు. 'స్రవంతి' రవికిశోర్ గారు ఫోన్ చేశారు. 'నేను పాటలు విన్నాను. బావున్నాయి. ట్రైలర్ చూశా. నాకు నచ్చింది. తెలుగులో కూడా విడుదల చేద్దాం' అన్నారు. తమిళనాడులో ఒక పల్లెటూరిలో సినిమా కథ జరుగుతుంది. తెలుగులో విడుదల చేయాలనుకున్నప్పుడు... ఏ ఊరు అయితే బావుంటుంది? హీరో మాట్లాడే యాస ఎలా ఉండాలి? అని కొంత రీసెర్చ్ చేశాం. డబ్బింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాం. సాధారణంగా నేను రివ్యూలు చదవను. కొన్ని రివ్యూలలో 'గౌతమ్ మీనన్ సినిమాల్లో హీరో బైక్ మీద తిరుగుతూ అమ్మాయితో పాటలు పాడుకుంటాడు' అని రాశారు. కానీ, ఈ సినిమాలో అవి ఏవీ లేవు. నేను ఇంతకు ముందు తీసిన సినిమాలకు డిఫరెంట్ సినిమా ఇది. శింబు కాబట్టి... సినిమాను ఇంత రియలిస్టిక్ గా చేశా. మరో హీరో అయితే స్టార్ డమ్, ఫ్యాన్స్ వంటి విషయాలు దృష్టిలో పెట్టుకుని కొన్ని అంశాలు యాడ్ చేయాలి. శింబు అటువంటివి పట్టించుకోడు. నాకు అతనితో ఒక కంఫర్ట్ జోన్ ఉంది. సో... ఈజీగా చేశా. తమిళంలో పేరున్న రచయిత జయమోహన్ ఈ చిత్రానికి కథ అందించారు. ఆయన వైఫ్ కథ విని 'లవ్ స్టోరీస్ తీసే దర్శకుడికి లవ్ లేని కథ ఇచ్చావా?' అని అడిగారట. నాతో ఆ విషయం చెప్పేసరికి కథ నుంచి బయటకు వెళ్ళకుండా లవ్ సీన్స్ రాశాం. తెలుగు, తమిళ ప్రేక్షకుల నుంచి సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. దీనికి సీక్వెల్ చేసే ఆలోచన కూడా ఉంది. రెండు మూడు రోజుల్లో ఆ వివరాలు వెల్లడిస్తా. 'స్రవంతి' రవికిశోర్ గారి నిర్మాణంలో రామ్ హీరోగా వచ్చే ఏడాది ఒక సినిమా చేస్తాను. నిజం చెప్పాలంటే... ఆ సినిమా కోసం జయమోహన్ గారితో డిస్కషన్స్ చేస్తున్న సమయంలో 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' కథ విని చేయడం జరిగింది. తెలుగులో సినిమా విజయం సాధించింది అంటే ఆ సక్సెస్ క్రెడిట్ ఆయనదే' అని అన్నారు. నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ మాట్లాడుతూ ''గౌతమ్ మీనన్, నాకు మధ్య ఎప్పటి నుంచో పరిచయం ఉంది. మేం ఒక సినిమా చేయాలనుకుంటున్నాం. ఆ సినిమా చర్చలో మధ్యలో 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' గురించి తెలిసింది. నిజం చెప్పాలంటే... తమిళ్ వెర్షన్ విడుదలయ్యే వరకూ నేను సినిమా చూడలేదు. నాకు పూర్తిగా తెలియదు. మొన్న సినిమా చూశా. ప్రేక్షకులను ఇన్ఫ్లూయెన్స్ చేయాలని కాదు గానీ... నాకు సినిమా బాగా నచ్చింది. ఇంతకు ముందు మా సంస్థ ద్వారా 'నాయకుడు', 'పుష్పక విమానం' , 'రెండు తోకల పిట్ట', 'రఘువరన్ బీటెక్' చిత్రాలు విడుదల చేశాం. ఆ సినిమాల తరహాలో ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది'' అని అన్నారు. హీరోయిన్ సిద్ధీ ఇధ్నానీ మాట్లాడుతూ ''గౌతమ్ మీనన్ సినిమాలో కథానాయికగా నటించడం, ఈ రోజు ఆయన పక్కన కూర్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. తెలుగులో సినిమాను విడుదల చేసిన 'స్రవంతి' రవికిశోర్ గారికి థాంక్స్. శింబు, గౌతమ్ మీనన్, ఏఆర్ రెహమాన్ కలిసి సినిమా చేస్తున్నారని తెలిసి మా మేనేజర్‌కి పోస్టర్ స్క్రీన్ షాట్ పంపించా. అప్పటికి నాకు అవకాశం వస్తుందని అనుకోలేదు. తర్వాత నాకు అవకాశం రావడంతో మాటలు రాలేదు. తెలుగులో కొన్ని సినిమాలు చేశా. కొంత విరామం తర్వాత ఈ సినిమాతో విజయం అందుకోవడం సంతోషంగా ఉంది' అని అన్నారు. -
నాలుగు రోజుల్లోనే లాభాలొచ్చాయి
‘‘నేను శైలజ’ వంటి క్లాస్ సినిమాతో పాటు ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి మాస్ సినిమాలో చక్కగా నటించాడు రామ్. కానీ ఇప్పటివరకూ రామ్ ద్విపాత్రాభినయం చేయలేదు. ‘రెడ్’లో ఆదిత్య తో మాస్ ఆడియన్స్‌కి, సిద్ధార్థ క్యారెక్టర్‌తో క్లాస్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యాడు’’ అన్నారు ‘స్రవంతి’ రవికిశోర్. రామ్ హీరోగా, మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రెడ్’. తిరుమల కిశోర్ దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలైంది. రవికిశోర్ మాట్లాడుతూ.. ‘‘ఈ నెల 22న మలయాళంలో, ఆ తర్వాత వివిధ భాషల్లో ‘రెడ్’ విడుదల కానుంది. ప్రేక్షకులకు మా సినిమా నచ్చుతుందని, వసూళ్లు వస్తాయని నమ్మకం ఉండేది.. అది నిజమైంది. నాలుగు రోజుల్లోనే లాభాలు వచ్చాయి. మంచి స్క్రిప్ట్ వచ్చి రామ్ ఎగ్జయిట్ అయితే తప్పకుండా ప్యాన్ ఇండియా రేంజ్లో సినిమా చేస్తాడనుకుంటున్నాను. మా బ్యానర్లో తర్వాతి చిత్రం ఇంకా ఫైనల్ కాలేదు’’ అన్నారు. -
మా `రెడ్` యూనిట్‌కు అలాంటి అనుభవాలే..
‘‘కొన్ని సంఘటనలను అవతలివాళ్లు చెబుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. మరికొన్నిసార్లు నమ్మబుద్ధి కాదు. ఆ మాటల్లో అతిశయోక్తులు ధ్వనిస్తాయి. కానీ అలాంటి సంఘటనలు మన జీవితంలో ఎదురైనప్పుడు? అవే దృశ్యాలు మళ్లీ మళ్లీ కళ్ల ముందు మెదులుతుంటాయి. ఇప్పుడు మా `రెడ్` యూనిట్ సభ్యులకు కూడా అలాంటి అనుభవాలే మెదిలినట్టు. మా`రెడ్`టీమ్‌లో ఈ మధ్య దీనికి సంబంధించిన చర్చే ఎక్కువగా జరుగుతోంది`` అని అంటున్నారు ప్రముఖ నిర్మాత `స్రవంతి` రవికిశోర్. ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం`రెడ్`. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇందులో హీరోగా నటించారు. ఫిబ్రవరి లో ఈ చిత్రంలోని రెండు పాటల చిత్రీకరణ ఇటలీలో జరిగింది. కోవిడ్-19తో అల్లాడుతున్నఇటలీ గురించి, అక్కడ ఆ వైరస్ సోకడానికి కొన్నాళ్ల ముందు గడిపిన క్షణాల గురించి`స్రవంతి` రవికిశోర్ వివరించారు. (‘మణిశర్మ మెలోడీ వచ్చేది ఎప్పుడంటే?’) `స్రవంతి` రవికిశోర్ మాట్లాడుతూ.. ``సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో -5 డిగ్రీల ఉష్ణోగ్రతతో, ఎటుచూసినా స్వచ్ఛంగా సుందరంగా ఉంటుంది డోలమైట్స్. ఈ పర్వత తీర ప్రాంతంలో ఇప్పటిదాకా పలు హాలీవుడ్ సినిమాల షూటింగులు జరిగాయి. తెలుగు సినిమాల షూటింగ్‌లు ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు రామ్‌తో తీస్తున్న `రెడ్` షూటింగ్ అక్కడ చేద్దామని మా డైరక్టర్ కిశోర్ తిరుమల అన్నారు. అప్పటికే ఆ ప్రాంతం గురించి తెలుసు కాబట్టి వెంటనే ఓకే అనుకున్నాం. రెండు పాటలు చిత్రీకరించడానికి టీమ్‌తో ఇటలీ చేరుకున్నాం. టుస్కాన్, ఫ్లారెన్స్, డోలమైట్సలో హీరో రామ్, హీరోయిన్ మాళవికా శర్మ మీద పాటలు చిత్రీకరించాం. ఇటీవల రిలీజ్ చేసిన ‘నువ్వే నువ్వే’ లిరికల్ సాంగ్‌లో లేక్‌గార్డ్ అందాలు కూడా కనిపిస్తాయి. లేక్‌గార్డ్ ప్రస్తావన ఎందుకంటే... ఈ ప్రాంతం బెర్గామోకి కేవలం గంటం పావు ప్రయాణ దూరంలో ఉంటుంది. ఇప్పుడు ఇటలీలో కోవిడ్-19కి ఎపిక్ సెంటర్‌గా బెర్గామో గురించి అందరికీ తెలిసిందే. ఫిబ్రవరి15న లేక్ గార్డలోనూ, ఫిబ్రవరి 16న డోలమైట్స్లోనూ షూటింగ్ చేశాం. మేం అక్కడి నుంచి తిరిగి వచ్చిన ఆరు రోజులకు... అంటే ఫిబ్రవరి 22న డోలమైట్స్కు బ్రిటిష్ స్కై టీం వెళ్లీంది’’ అని చెప్పారు. (ఇలాంటి కేస్ ఇదే ఫస్ట్ టైమ్..) ఇక ‘‘అక్కడికి వెళ్లిన 22 మందిలో 17 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అప్పటిదాకా సుందరంగా, అద్భుతమైన అనుభవంగా అనిపించిన డోలమైట్ గురించి ఆలోచించగానే మమ్మల్ని కరోనా కలవర పెట్టింది. కేవలం వారం రోజులు ముందుగా అక్కడి నుంచి వచ్చిన మా యూనిట్ అంతా సురక్షితంగా ఉంది. ఇలాంటి విషయాల గురించి ఆలోచించినప్పుడు అదృష్టం కాక మరేంటి? అని అనిపిస్తుంది. ఈ విషయాన్నే అక్కడ పాటలకు కొరియోగ్రఫీ చేసిన శోభి మాస్టర్, మా యూనిట్ సభ్యులు గుర్తుచేస్తున్నారు. ఇటలీలోనే కాదు మన దగ్గరా కరోనా కలవరపెడుతోంది. ఈ వైరస్ బారి నుంచి తప్పించుకోవడమే మన ముందున్న కర్తవ్యం. మానవాళి సురక్షితంగా ఉండాల్సిన ఈ తరుణంలో వినోదం గురించి ఆలోచించడాన్ని మేం కూడా వాయిదా వేశాం. అయితే ఏప్రిల్ 9న ‘రెడ్’ విడుదల చేయాలనుకున్నాం కానీ ప్రస్తుతం పరిస్థుతులు అనుకూలంగా లేవు. సమాజం మామూలు స్థితికి వచ్చాక, అప్పుడు `రెడ్` విడుదల గురించి ప్రకటిస్తాం. కరోనా కోరల్లో చిక్కుకోకుండా ఉండాలంటే అందరూ ఇళ్లల్లోనే ఉండాలి. పరిశుభ్రతను పాటించాలి`` అని అన్నారు. (ఆనందంగా ఉన్నప్పుడే వినోదం ) కాగా రామ్, నివేదా పేతురాజ్,మాళవికా శర్మ, అమృతా అయ్యర్ తదితరులు నటిస్తున్న చిత్రం ‘రెడ్’. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: జునైద్, సమర్పణ: కృష్ణ పోతినేని, నిర్మాత: 'స్రవంతి' రవికిశోర్, దర్శకత్వం: కిశోర్ తిరుమల. -
ఆనందంగా ఉన్నప్పుడే వినోదం
‘‘మనిషి ఆనందంగా ఉంటేనే వినోదం వైపు దృష్టి మళ్లుతుంది. కరోనా గురించి ప్రజానీకం కంగారు పడుతున్న ఈ తరుణంలో వినోదాన్ని వాయిదా వేద్దాం. పరిస్థితులన్నీ కుదురుకున్నప్పుడే సినిమాల గురించి మాట్లాడుకుందాం. అప్పటివరకు అందరి క్షేమమే మా కాంక్ష’’ అన్నారు నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్. ఈ శార్వరి (తెలుగు కొత్త సంవత్సరం) నామ సంవత్సరం అన్ని విధాలా అందరికీ కలిసి రావాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఈ సందర్భంగా రవికిశోర్ మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం మానవాళి కరోనా వైరస్‌తో యుద్ధం చేస్తోంది. ప్రపంచమంతా సంక్షోభంలో ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనుకునే సంస్కృతి మనది. ఎవరికి వారై ఉంటూ, కలిసికట్టుగా కరోనా వైరస్‌ను పారదోలుదాం. ఈ తెలుగు నూతన సంవత్సరంలో చీకటిని తరిమి కొత్త వెలుగును ఆహ్వానిద్దాం... ఆస్వాదిద్దాం. యావత్ ప్రపంచం ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలి’’ అన్నారు. ‘నేను..శైలజ.., ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రాల తర్వాత హీరో రామ్, దర్శకుడు ‘కిశోర్’ తిరుమల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘రెడ్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్. ఈ సినిమాను ఏప్రిల్ 9న విడుదల చేయాలనుకున్నారు. కరోనా కారణంగా ప్రస్తుతానికి థియేటర్లన్నీ మూతపడ్డాయి. ఏప్రిల్‌లో పరిస్థితిని బట్టి ‘రెడ్’ విడుదల తేదీని నిర్ణయిస్తారు. -
ఇస్మార్ట్ శంకర్ ‘రెడ్’ ప్రారంభం
‘ఇస్మార్ట్ శంకర్’తో ఎనర్జటిక్ హీరో రామ్ పోతినేని బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. అయితే ఆ సినిమా విడుదలై వందరోజులు పూర్తయినప్పటికీ మరో సినిమాను ఆనౌన్స్ చేయలేదు. అయితే దీపావళి కానుకగా తన కొత్త సినిమాను ప్రకటించాడు రామ్. తనకు ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ వంటి హిట్ చిత్రాలను అందించినటువంటి కిశోర్ తిరుమల దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా రెండ్రోజుల క్రితం ఈ సినిమాకు ‘రెడ్’అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశాడు. తాజాగా ఆ చిత్ర షూటింగ్ బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్, బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్ చార్మి, తదితరులు హాజరయ్యారు. పూజాకార్యక్రమాలు నిర్వహించిన అనంతరం హీరో రామ్‌పై పూరి తొలి క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించాడు. కాగా, ఇది రామ్‌కు 18వ చిత్రం. కృష్ణ పోతినేని సమర్పణలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రామ్ పెదనాన్న ‘స్రవంతి’ రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. ఇక రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. రామ్ సరసన నటించే హీరోయిన్ను ఇంకా ఫైనల్ చేయలేదని చిత్ర యూనిట్ పేర్కొంది. అంతేకాకుండా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. ఇక ఇప్పటివకే విడుదలైన ఫస్ట్ లుక్‌లో రామ్ రఫ్‌గా కనిపించాడు. అంతేకాకుండా రామ్ లుక్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా, ‘రెడ్’ సినిమా తమిళంలో సూపర్ హిట్ అందుకున్న ‘తడమ్’కు రిమేక్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ మొదటిసారి ద్విపాత్రాభియం చేస్తున్నట్టు సమాచారం. మరి ‘రెడ్’ చిత్రంతో రామ్ మరో సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి. ఇదిలా ఉంటే, కిశోర్ తిరుమల ఈ ఏడాది ‘చిత్రలహరి’ సినిమాతో హిట్ అందుకున్నారు. ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్‌ను మళ్లీ ట్రాక్‌పైకి తీసుకొచ్చారు. ఇప్పుడు రామ్‌తో ముచ్చటగా మూడోసారి పనిచేస్తున్నారు. మరి హ్యాట్రిక్ సాధిస్తారో లేదో చూడాలి. రీఎంట్రీ ఇవ్వనున్న శృతిహాసన్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘కాటమ రాయుడు’ తర్వాత మరో తెలుగు సినిమాలో కనిపించలేదు శృతి హాసన్. ఆ సినిమా వచ్చి రెండేళ్లు కావస్తున్నా మరే తెలుగు సినిమాకు సైన్ చేయలేదు. తాజాగా రవితేజ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనుంది ఈ కోలీవుడ్ బ్యూటీ. డాన్ శీను, బలుపు వంటి బ్లాక్ బస్టర్ హిట్లనందించిన గోపిచంద్ మలినేని దర్వకత్వంలో రవితేజ ఓ సినిమా తీయబోతున్నారు. ఇది రవితేజకు 66వ చిత్రం కావడం విశేషం. అయితే ఈ సినిమాకు సంబంధించిన రీసెంట్ అప్డేట్ ప్రకారం ఈ చిత్రంలో రవితేజ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటించనుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా శృతిహాసన్ సైతం ట్విటర్ వేదికగా స్పందిస్తూ ఈ సినిమా షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం రవితేజ ‘డిస్కోరాజా’షూటింగ్ శరవేగంగా జరపుకుంటోంది. వీఐ ఆనంద్ దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Welcoming ..the multi talented actress @shrutihaasan on board 😊👍👍 #RT66 pic.twitter.com/Coym47HUDF — Gopichand Malineni (@megopichand) October 30, 2019 -
అడ్వెంచర్ ట్రిప్ స్టార్ట్
ఎనర్జిటిక్ హీరో రామ్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ కుదిరింది. ఇద్దరి స్టైల్‌కి తగ్గట్టుగానే యాక్షన్ అడ్వెంచర్‌లో సాగే న్యూ ఏజ్ సినిమాకు శ్రీకారం చుట్టారు. పి.కృష్ణ చైతన్య సమర్పణలో రామ్, మాళవిక శర్మ జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ యాక్షన్ అడ్వెంచర్‌ను ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ‘స్రవంతి’ రవికిషోర్ మాట్లాడుతూ– ‘‘మే7 నుంచి జార్జియాలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. మే లాస్ట్ వీక్ వరకూ ఫస్ట్ షెడ్యూల్ చేస్తాం. తర్వాత ఇటలీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తాం. విదేశాల్లో షెడ్యూల్ అయిపోయాక కాశ్మీర్, లడఖ్‌లో భారీ షెడ్యూల్ ప్లాన్ చే శాం. ఇది న్యూ ఏజ్ మూవీలా ఉంటుంది’’ అన్నారు. ‘‘రామ్‌కి సరిపోయే కథ ఇది. స్క్రిప్ట్ గ్రిప్పింగ్‌గా ఉంటుంది. యాక్షన్, అడ్వెంచర్ అంశాలు ఉంటాయి. టాప్ టెక్నీషియన్స్ మా సినిమాకు పని చేయబోతున్నారు. అందర్నీ మెప్పించే చిత్రం అవుతుంది’’ అన్నారు ప్రవీణ్ సత్తారు. ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ ఘట్టమనేని. -
రామ్ కొత్త సినిమా ఓపెనింగ్
యంగ్ హీరో రామ్ తన తదుపరి చిత్రాన్ని గరుడవేగ సినిమాతో ఘనవిజయం సాధించిన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటిస్తున్నారు. శ్రీ స్రవంతి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ రోజు (26-04-2018) పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఇప్పటికే కాంబినేషన్ పరంగా మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకునే స్థాయిలో ఉంటుందంటున్నారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ ‘ఈ రోజు హైదరాబాద్‌లో నిరాడంబరంగా పూజా కార్యక్రమాలను నిర్వహించాం. మే 7 నుంచి జార్జియాలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. మే నెలాఖరు వరకు తొలి షెడ్యూల్ సాగుతుంది. ఆ తర్వాత స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీలోని సుందరమైన ప్రదేశాల్లో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తాం. విదేశాల నుంచి తిరిగి వచ్చాక కాశ్మీర్, లడఖ్‌లో భారీ షెడ్యూల్స్ చేస్తాం. న్యూ వేవ్ లో సాగే చిత్రమిది. మరిన్ని విశేషాలను త్వరలోనే వెల్లడిస్తాం’ అని చెప్పారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ ‘హీరో రామ్‌కి చక్కగా సరిపోయే కథ కుదిరింది. స్క్రిప్ట్ గ్రిప్పింగ్‌గా ఉంది. యాక్షన్, అడ్వంచరస్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. న్యూ వేవ్‌లో సాగే సినిమా. మే నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. ప్రముఖ సాంకేతిక నిపుణులు, నటీనటులు మా చిత్రానికి పనిచేస్తారు. అందరినీ మెప్పించే సినిమా అవుతుంది’ అని అన్నారు. -
'నేను శైలజ నా చివరి సినిమా'
ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన స్టార్ ప్రొడ్యూసర్ స్రవంతి రవికిశోర్ ఇక పై సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ప్రేమంట, మసాల, శివమ్ లాంటి డిజాస్టర్ల తరువాత నేను శైలజ సినిమాతో మంచి విజయం సాధించిన స్రవంతి రవికిశోర్, ఈ సినిమా సక్సెస్ మీట్‌తో తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక పై తాను నిర్మాణ రంగానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నానని తెలిపారు. స్రవంతి రవికిశోర్ నిర్మాణ రంగం నుంచి తప్పుకున్నా.. స్రవంతి మూవీస్ బ్యానర్ మాత్రం కొనసాగుతుందని తెలిపారు. రామ్ సోదరుడు కృష్ణ చైతన్య ఇక పై ఆ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలకు నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు. త్వరలోనే నేను శైలజ లాంటి సూపర్ హిట్ సినిమాను అందించిన హీరో రామ్, డైరెక్టర్ కిశోర్ తిరుమలల కాంబినేషన్లో మరో సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు, ఈ సినిమాతోనే కృష్ణ చైతన్య నిర్మాతగా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాడు. -
అంజలి సినిమా చూసి ...
‘అంజలి’ సినిమా చూసి..సినీరంగంపై ఆసక్తిపెంచుకున్నా అప్రెంటిస్ స్థాయి నుంచి డెరైక్టర్ స్థాయికి ‘కొలంబస్’ సినిమా డెరైక్టర్ రమేష్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ శుక్రవారం విడుదలైన ‘కొలంబస్’ ఇంటర్వ్యూ ‘నేను పుట్టి, పెరిగిన వరంగల్ జిల్లాయే నా ఆత్మ..నా గురువు. దాని ఒడిలోనే చదువు పాఠాలు..బతుకు పాఠాలు నేర్చుకున్నాను’ అని అంటున్నారు కొలంబస్ సినిమా దర్శకుడు(డెరైక్టర్) రమేష్ సామల. పదోతరగతి పరీక్షలు పూర్తయ్యాక స్నేహితులతో కలిసి సునీల్ థియేటర్లో సినిమా చూశాక ఆయనకు సినిమాలపై మక్కువ పెరిగింది. ఎలాగైనా సినిమాల్లోకి అడుగిడాలనే ఆ తపన..డిగ్రీ తర్వాత సాకారమైంది. ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలో అప్రెంటిస్‌గా మొదలైన రమేష్ ప్రస్థానం నేడు దర్శకుడి స్థాయికి చేరింది. ఆయన దర్శకత్వం వహించిన కొలంబస్ సినిమా శుక్రవారం విడుదలైన సందర్భంగా వరంగల్‌కు వచ్చిన రమేష్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ. - పోచమ్మమైదాన్ సాక్షి : మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి? రమేష్ : మాది వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేళీ గ్రామం. వరంగల్‌కు వచ్చినప్పుడల్లా బంధువులు,స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతా. చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే చాలా ఇష్టం. ఆ ఇష్టానికి కొంతమంది ప్రోత్సాహం చేదోడు తోడై నన్ను ఈస్థాయికి తీసుకెళ్లారు. సాక్షి : సినిమా రంగంలోకే ఎందుకు ప్రవేశించాలనుకున్నారు? రమేష్ : వరంగలే నా ఆత్మ.. నా గురువు. వరంగల్‌లో పుట్టడం వల్లే నేను ఈ స్థాయికి వచ్చా. నాకు స్ఫూర్తి కూడా నా జిల్లానే. నేను పదోతరగతి పరీక్షలు రాశాక మా ఫ్రెండ్స్‌తో కలిసి వరంగల్‌లోని సునిల్ థియేటర్లో అంజలి సినిమాకు వెళ్లాం. ఆ సినిమా చిత్రీకరించిన పద్ధతిని చూశాక.. ఎలాగైనా సినీరంగంలోకి అడుగిడాలనే తపన కలిగింది. ఆ తపనను డిగ్రీ అయిపోయే వరకు అణచుకున్నాను. చాలామందిలో ఇలాంటి తపనలుంటాయి. అయితే తపనలు నెరవేరాలంటే ఓపిక, ప్రాక్టీస్, కృషి, అధ్యయనం అవసరమని గ్రహించాలి. ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు’ అనే పెద్దలమాటను నేటి యువత గ్రహిస్తే విజయూలు ఏ రంగంలోనైనా సొంతం చేసుకోవచ్చు. సాక్షి : సినీరంగంలో మీరు మర్చిపోలేని ఘటన ఏదైనా ఉందా? రమేష్ : నేను సినిమా థియేటర్లను గుడిగా భావిస్తా. ఎందుకంటే నాకు జీవితాన్ని, ఉపాధినిచ్చే పవిత్ర కేంద్రాలవి. అందుకే థియేటర్లకు గుడికి వెళ్లినంత భక్తిగా వెళ్లేవాణ్ని. డిగ్రీ చదివేరోజుల్లో.. ఆ తర్వాత కూడా వరంగల్‌లో నాకు మా ఇంటి కన్నా..అలంకార్ థియేటర్‌తో ఎక్కువ అనుబంధం ఉండేది. ఎప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడికొచ్చినా అలంకార్ సినిమా థియేటర్ వద్ద కాసేపు ఆగేవాణ్ని. ఒకరోజు నేనొచ్చే సరికి అలంకార్ థియేటర్ లేదు. ఆ సందర్భంలో నేను నా ప్రాణమిత్రుణ్ని పోగొట్టుకున్నంత బాధపడ్డాను. ఆ ఘటన నాకు తీవ్ర ఆవేదన మిగిల్చింది. సాక్షి : చదువుకునే రోజుల నుంచీ సినిమాలే మీ ఆసక్తా? రమేష్ : నేను వరంగల్‌లోని సీకేఎం కళాశాలలో ఇంటర్, డిగ్రీ కేఎన్ఆర్ కళాశాలలో పూర్తిచేశా. పదోతరగతి పరీక్షల తర్వాత అంజలి సినిమా చూసి సినిమాలపై పెంచుకున్న ఆసక్తి డిగ్రీ నాటికి మరింత పెరిగింది. సినిమా నిర్మాణం, దర్శకత్వం, సాంకేతిక అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేసేవాణ్ని. మిత్రులతో కూడా సినిమాలపై చర్చించేవాణ్ని. ఎవరైనా ఏదైనా రంగంలో ఎదగాలంటే ఆ రంగంపై అధ్యయనం చేయూలి. డిగ్రీ తర్వాత హైదరాబాద్‌కు వెళ్లి సినీ అవకాశాలను వెతికాను. దొరికిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నా. సాక్షి : మహా సముద్రంలాంటి సినీరంగంలో అవకాశాలు ఎలా వెతికారు? రమేష్ : మనం ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే కష్టాన్ని లెక్కచేయొద్దు..ఇష్టంగా ముందుకుసాగాలి. నేనూ అదే చేశాను. హైదరాబాద్‌కు వెళ్లిన తర్వాత సినీరంగానికి చెందిన స్రవంతి రవికిశోర్‌ను కలిసి పరిచయం చేసుకున్నాను. తర్వాత విజయభాస్కర్‌ను రవి కిశోర్ పరిచయం చేశారు. అప్పుడు విజయభాస్కర్ వెంకటేశ్ హీరోగా ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా తీస్తున్నారు. అందులో నన్ను అప్రెంటిస్‌గా చేర్చుకున్నారు. అక్కడ సినిమా నిర్మాణం, దర్శకత్వం, డైలాగ్ రైటింగ్‌లపై ఓనమాలు నేర్చుకున్నా. సాక్షి : మీరు వివిధస్థాయిల్లో పనిచేసిన సినిమాలేవి? రమేష్ : ఉషాకిరణ్ మూవీస్‌కు విజయభాస్కర్ పరిచయం చేశారు. దీంతో ‘ఇష్టం’ సినిమాలో అసిస్టెంట్ డెరైక్టర్‌గా అవకాశమొచ్చింది. ఆపై ‘మన్మధుడు’ సినిమాకూ అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేశా. మల్లీశ్వరీ, తుఝే మేరీ ఖసం, జై చిరంజీవ, అతిథి,సలీం, రగడ, అనగనగా ఒక ధీరుడు సినిమాలకు అసోసియేట్ డెరైక్టర్‌గా చేసే అవకాశాలొచ్చాయి. ఇష్క్ సినిమాకు అసోసియేట్ డెరైక్టర్‌గా, రచయితగా పని చేశాను. కొలంబస్ సినిమాకు డెరైక్టర్‌గా,డైలాగ్ రైటర్‌గా చేశాను. సాక్షి : వరంగల్ జిల్లాలో సినీరంగం అభివృద్ధికి అవకాశాలున్నాయూ? రమేష్ : వరంగల్ జిల్లాలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి చాలా అవకాశాలున్నాయి. హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉండటం బాగా కలిసొచ్చే అంశం. ఇక్కడ మంచి లోకేషన్లున్నాయి. ఖిలా వరంగల్, రామప్ప, లక్నవరం, వేయిస్తంభాల గుడి, భద్రకాళీ అమ్మవారి దేవాలయూలు చక్కటి లొకేషన్లుగా ఉపయోగపడతాయి. నాకు ఎంతో ఇష్టమైన లొకేషన్లు ఇవి. ఎంఎస్ రాజు వర్షం సినిమాలో వరంగల్‌లో ఉన్న లోకేషన్లను పరిచయం చేశారు. తెరపై కొలంబస్ సినిమా ద్వారా వరంగల్‌కు చెందిన నన్ను పరిచయం చేశారు. త్వరలో నేను దర్శకత్వంవహించే సినిమాలను వరంగల్‌లో కొంత భాగం షూటింగ్ నిర్వహిస్తా. సాక్షి: సినీరంగంలోకి ప్రవేశించాలనుకునే యువతకు మీరిచ్చే సందేశమేంటి? రమేష్: కొత్తగా సినీరంగంలోకి రావాలనుకునే వారు మొట్టమొదట అధ్యయనం చేయడం నేర్చుకోవాలి. నటన..డెరైక్షన్..మ్యూజిక్..డైలాగ్ రైటింగ్..ఎడిటింగ్..ఇలా ఏ విభాగమైనా కావొచ్చు. అవగాహన పెంచుకోవాలి. ఇంటర్నెట్లో..నిపుణుల పర్యవేక్షణలో ఎంచుకున్న విభాగంపై అధ్యయనం చేయూలి. ఎంచుకున్న సబ్జెక్టుపై పట్టు పెంచుకోవాలి. ఆ తర్వాత అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించాలి. అవగాహన లేకుండా అవకాశాలు కావాలంటే కష్టం. సాక్షి : మీ దర్శకత్వంలో విడుదలైన కొలంబస్ సినిమా గురించి చెప్పండి.. రమేష్ : కొలంబస్ సినిమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శుక్రవారం 150 థియేటర్లలో విడుదలైంది. సుమంత్ అశ్విన్ హీరోగా, హీరోయిన్లుగా సీర త్ కపూర్, మీస్తి చక్రవర్తిలు నటించారు. సంగీత దర్శకునిగా జీతన్‌ను పరిచయం చేశాను. తొలిసారి నేను దర్శకత్వం వహించిన సినిమా విడుదలవడం ప్రత్యేకమైన ఆనందాన్నిచ్చింది. నేను భాగం పంచుకున్న ప్రతి సినిమాను వరంగల్‌కే వచ్చి చూస్తా. అందుకే కొలంబస్ సినిమాను సైతం చూసేందుకు శుక్రవారం వరంగల్‌కే వచ్చాను. ఫ్రెండ్స్‌తో కలిసి ఆనందంగా ఫిల్మ్ చూశా. -
నిర్విఘ్నంగా సినిమా పండగ
క్యూ కిటకిటలాడుతోంది. చవితి మంటపాల్లో భక్తులు... రిలీజ్‌ల కోసం నిర్మాతలు.... ఇప్పటి నుంచి దీపావళి దాక.... 50 రోజులు... 50 సినిమాలు... సినిమా చూపిస్త మామా... నీకు సినిమా చూపిస్త మామా... ప్రేక్షకులు ఫుల్. ప్చ్.... థియేటర్లు నిల్. స్వామీ... గణనాయకా... థియేటర్లు కూడా నీ హోల్డ్‌లో తీసుకొని మాకు కాసిన్ని పడేయ్ తండ్రీ.... తెలిసిన హీరో... లేత స్టార్... తాజా కుర్రాడు.... తోపులాటలో ఎవరు ముందు ఎవరు వెనుక? శశివర్ణం... చతుర్భుజం.... ఎగ్జిబిటర్లు హ్యాపీగా ఉన్నారు. ఒక సినిమా అడిగితే నాలుగు ఇస్తామంటున్నారు. ఇండస్ట్రీ కళకళలాడుతోంది. వినోదం పంట పండుతోంది. ‘సాక్షి’ తన వంతుగా ఈ సమాచారంతో పాఠక దేవుళ్ళకు నైవేద్యం అందిస్తోంది. సినిమా పేరు: బ్రూస్లీ... శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్‌చరణ్ నటి స్తున్న యాక్షన్ ఎంటర్టైనర్. అక్టోబర్ 16న రిలీజ్‌కు సిద్ధమవుతున్నారు. చిరంజీవి గెస్ట్ అప్పీయరెన్స్ స్పెషల్ ఎట్రాక్షన్. సినిమా పేరు: అఖిల్ హీరో నితిన్ నిర్మాణంలో అఖిల్ తెరంగేట్రం. రూ. 50 కోట్ల బడ్జెట్‌తో వి.వి. వినాయక్ దర్శకత్వంలో వస్తున్న సోషియో ఫ్యాంటసీ. అక్టోబర్ 22న రిలీజ్. సినిమా పేరు: బెంగాల్ టైగర్ సంపత్ నంది దర్శకత్వంలో రవితేజ చేస్తున్న భారీ చిత్రం. తమన్నా, రాశీఖన్నా హీరోయిన్లు. బొమన్ ఇరాని స్పెషల్ ఎట్రాక్షన్. అక్టోబర్ రిలీజ్. సినిమా పేరు: శివమ్ దాదాపు రూ. 20 కోట్ల బడ్జెట్‌తో శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో రామ్ నటిస్తున్న ‘ఢీ’, ‘కందిరీగ’ తరహా యాక్షన్ ఎంటర్టైనర్. అక్టోబర్ 2న రిలీజ్. సినిమా పేరు: షేర్ మల్లికార్జున్ దర్శకత్వంలో బయటి బేనర్లో కల్యాణ్‌రామ్ చేస్తున్న సినిమా. పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. అక్టోబర్ సెకండ్ వీక్‌లో విడుదల. సోనాల్ చౌహాన్ నాయిక. సినిమా పేరు: సాహసం శ్వాసగా సాగిపో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మరోసారి నాగచైతన్య చేస్తున్న చిత్రం. మంఝిమ కథానాయిక. యాక్షన్ లవ్‌స్టోరీ. నవంబ ర్లో రిలీజ్. ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్. సినిమా పేరు: నాయకి తెలుగు తమిళ భాషల్లో త్రిష నటిస్తున్న హారర్ థ్రిల్లర్. గోవి దర్శకుడు. రఘు కుంచె సంగీతం. 1980ల నాటి కథ, లుక్స్ ఉంటాయి. షూటింగ్లో ఉంది. సినిమా పేరు: కొలంబస్ ఆర్.సామల దర్శకత్వంలో సుమంత్ అశ్విన్ నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్. సీరత్ కపూర్, మిస్తీ హీరోయిన్స్. నవంబర్‌లో రిలీజ్. సినిమా పేరు: కృష్ణాష్టమి వాసు వర్మ దర్శకత్వంలో సునీల్ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్. కోన వెంకట్ కథ. దినేష్ సంగీతం. త్వరలో విడుదల. సినిమా పేరు: సుబ్రమణ్యం ఫర్ సేల్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ నటించిన సినిమా. రెజీనా హీరోయిన్. పిల్లా నువ్వు లేని జీవితం తర్వాత మరో ఎంటర్టైనర్. ఈ నెల 24న రిలీజ్. సినిమా పేరు: కంచె రెండో ప్రపంచయుద్ధం నేపధ్యంలో వరుణ్‌తేజ్ నటిస్తున్న క్రిష్ చిత్రం. చిరంతన్ భట్ సంగీతం. అదిరిపోయే లొకేషన్స్‌లో చిత్రీకరణ. అక్టోబర్ 2 విడుదల. సినిమా పేరు: శంకరాభరణం నిఖిల్, నందిత కాంబినేషన్లో ఉదయ్ నందనవనం దర్శకత్వంలో వస్తున్న క్రైమ్ కామెడీ. పాత శంకరాభరణానికీ దీనికీ సంబంధం లేదు. నవంబర్‌లో విడుదల. సినిమా పేరు: పులి చాలాకాలం తర్వాత శ్రీదేవి నటిస్తున్న చిత్రం. హీరో విజయ్. దర్శకత్వం సింబు దేవన్. జానపద స్వభావం ఉన్న సినిమా. అక్టోబర్1న రిలీజ్. సినిమా పేరు: కుమారి 21 ఎఫ్. రాజ్‌తరుణ్ హీరోగా నటించిన మూడో సినిమా. సుకుమార్ కథ, మాటలు సమకూర్చడం విశేషం. సూర్యప్రతాప్ దర్శకుడు. అక్టోబర్ 30న రిలీజ్. సినిమా పేరు : భలే మంచిరోజు సుధీర్ బాబు హీరోగా శ్రీరామ్ ఆదిత్వ రచన, దర్శకత్వంలో విజయ్, శశి నిర్మిస్తున్న సినిమా ఇది. సన్ని ఎమ్మార్ సంగీతం. కొత్త తరహా కథతో థ్రిల్ చేసే కథనం. సినిమా పేరు : గరమ్ మదన్ దర్శకత్వంలో ఆది హీరోగా రూపొందుతున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇది. ఆదా శర్మ కథానాయిక. బ్రహ్మానందం పికె గెటప్ స్పెషల్. పాటలు మినహా పూర్తి. సినిమా పేరు : నిర్మలా కాన్వెంట్ హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ నాగార్జున నిర్మిస్తున్న చిత్రం. నాగార్జున స్పెషల్ రోల్. నాగ కోటేశ్వరరావు దర్శకుడు. షూటింగ్ జరుగుతోంది. సినిమా పేరు : అబ్బాయితో అమ్మాయి రమేష్ వర్మ దర్శకత్వంలో నాగ శౌర్య నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్. ఇళయరాజా సంగీతం. సినిమా దాదాపుగా పూర్తయ్యింది. త్వరలో విడుదల. సినిమా పేరు : త్రిపుర గీతాంజలి ఫేమ్ రాజకిరణ్ దర్శకత్వంలో కలర్స్ స్వాతి నటించిన ద్విభాషా చిత్రం. కలల నేపథ్యంలో వస్తున్న థ్రిల్లర్. సుమారు 5 కోట్ల బడ్జెట్. అక్టోబర్‌లో రిలీజ్. సినిమా పేరు : కొబ్బరి మట్ట సంపూర్ణేశ్‌బాబు హీరోగా రూపక్ రోనాల్డ్ సన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. పెదరాయుడు, పాపా రాయుడు, ఆండ్రాయుడుగా సంపూ త్రిబుల్ పోజ్. సంక్రాంతి బరిలో... పెద్ద పండుగ దసరాకు యువ హీరోల పోటీ సాగుతుంటే, వచ్చే ఏడాది సంక్రాంతికి సీనియర్ సినీ హీరోలు బరిలో దిగుతున్నారు. శ్రీనివాస్ దర్శకత్వంలో బాబాయ్ బాలకృష్ణ ‘డిక్టేటర్’గా రావడానికి తయారవుతున్నారు. సుకుమార్ డెరైక్షన్‌లో అబ్బాయి చిన్న ఎన్టీయార్ కూడా ఆ టైమ్‌కి ‘నాన్నకు ప్రేమతో...’ (వర్కింగ్ టైటిల్) అని చెప్పాలనుకుంటున్నారు. చిరంజీవి ఫ్యామిలీ నుంచి కూడా సంక్రాంతి మొనగాళ్ళు వస్తున్నారు. బాబీ డెరైక్షన్‌లో పవన్‌కల్యాణ్ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’గా మరోసారి పోలీస్ యూనిఫామ్‌లో సందడి చేయనున్నారు. ఈ భారీ యాక్షన్ బాక్సాఫీస్ వార్ మధ్యలో ప్రేమపుష్పాలు కూడా పూస్తున్నాయి. ‘నువ్వే - నువ్వే’ తరువాత చాలాకాలం విరామానికి త్రివిక్రమ్ ఒక పూర్తిస్థాయి ప్రేమకథతో యువ హీరో నితిన్‌ను ‘అ...ఆ...’ అనిపిస్తున్నారు. వరస చూస్తుంటే, కొత్త ఏడాది ప్రారంభంలో మొదటి రెండు వారాలూ తెలుగు లోగిళ్ళలోనే కాక, సినిమాహాళ్ళలోనూ పండుగ వాతావరణం సందడి చేయనుంది. క్రిస్మస్ కానుకలు... ఈ డిసెంబర్లో కూడా ప్రముఖ హీరోల పెద్ద చిత్రాల హంగామా కొనసాగనుంది. మోహన్‌బాబు, నాగార్జున లాంటి సీనియర్ హీరోలతో పాటు గోపీచంద్, రామ్ లాంటి యువ హీరోలు కూడా ఈ డిసెంబర్ సినిమా సీజన్‌కు కళ తేనున్నారు. మోహన్‌బాబు, ‘అల్లరి’ నరేశ్ కలసి నటిస్తున్న వినోదభరిత చిత్రం ‘మామ మంచు - అల్లుడు కంచు’ చిత్రం ఈ క్రిస్మస్ సంబరాన్ని పెంచనుంది. దర్శకుడు శ్రీనివాసరెడ్డి తనదైన తరహాలో ఇందులో కామెడీ పండిస్తారని భావిస్తున్నారు. కల్యాణ్‌కృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ, నాగార్జున నిర్మిస్తున్న ‘సోగ్గాడే... చిన్ని నాయనా’ రిలీజ్ కూడా ఆ సీజన్లోనే. చాలాకాలం తర్వాత నాగ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో రమ్యకృష్ణ నటించడం మరో స్పెషల్ ఎట్రాక్షన్. పదేళ్ళ క్రితం నాటి ‘యజ్ఞం’ తరువాత ఏ.ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో గోపీచంద్ చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ డిసెంబర్లో వస్తుంది. రచయిత కిశోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘హరికథ’ కూడా ప్రేక్షకులకు క్రిస్మస్ కానుకే. వేర్వేరు జానర్ల ఈ చిత్రాలతో తెలుగు తెర కొత్త ఏడాదికి స్వాగతం పలకనుంది. బాహుబలి, రుద్రమదేవి లాంటి పెద్ద సినిమాలు వస్తాయంటూ, మిగిలిన సినిమాలు రిలీజ్ చేయకుండా బంగారం లాంటి సమ్మర్ సీజన్ అంతా మనకు మనమే వృథా చేసుకున్నాం. అలా షూటింగ్‌లు, రిలీజ్లు డిలే చేసుకుంటూ వచ్చిన సినిమాలన్నీ ఇప్పుడు ఒక్కసారిగా రిలీజ్‌కు వచ్చాయి. అందుకే సినిమాల క్లాష్ సమస్య, థియేటర్ల సమస్య. - ప్రముఖ నిర్మాత - హీరో నితిన్ తండ్రి ఎన్. సుధాకరరెడ్డి కొన్ని వారాల వ్యవధిలోనే ఇన్ని సినిమాలు బరిలో ఉండటం అంటే ఒక రకంగా మా కత్తితో మేమే పొడుచుకోవడమే. ఇలా ఒకేసారి పెద్ద సినిమాలన్నీ రావడం వల్ల రావాల్సినంత రెవెన్యూ రాదు. నిర్మాతలకూ, బయ్యర్లకూ రావాల్సిన ఆదాయంలో దాదాపు 25 శాతం కోత పడుతుంది. అంటే డబ్బు కొంత నష్టపోవడానికి ముందే సిద్ధపడి సినిమా రిలీజ్ చేయడమన్న మాట. ఇది నిజంగా బాధ కలిగించే విషయం. - ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ -
బంపర్ ఆఫర్!
మనం ఒకటి అనుకుంటే దైవం వేరే తలుస్తుందట. రాశీ ఖన్నా విషయంలో అదే జరిగింది. యాడ్ ఫిలిమ్స్‌కి కాపీ రైటర్‌గా చేస్తూ, అలా కొనసాగిపోవాలనుకున్న ఆమెకు అనుకోకుండా హిందీ చిత్రం ‘మద్రాస్ కేఫ్’కి అవకాశం రావడం, ఇక ఆ తర్వాత కలం పెట్టుకునే తీరిక లేకుండా కెమెరా ముందు బిజీ కావడం చకచకా జరిగిపోయాయి. ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంలో కథానాయికగా, ‘మనం’లో చేసిన అతిథి పాత్ర ద్వారా ఆమె అందర్నీ ఆకట్టుకున్నారు. ఫలితంగా ఏకంగా గోపీచంద్ సరసన ‘జిల్’లో అవకాశం కొట్టేశారు. ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ రాశీని వరించింది. లవర్ బోయ్ రామ్ సరసన ‘శివం’లో నటించే అవకాశం రాశీ ఖన్నాకు దక్కింది. శ్రీనివాసరెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ, ‘స్రవంతి మూవీస్ పతాకం’పె ‘స్రవంతి’ రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత నెల 27న మొదలైన ఈ చిత్రం షెడ్యూల్ ఈ నెల 20 వరకూ హైదరాబాద్‌లో జరుగుతుంది.పస్తుతం పీటర్ హేన్స్ ఆధ్వర్యంలో పోరాట సన్నివేశాలు తీస్తున్నారు. ఆ తర్వాత ప్రధాన తారాగణంపై టాకీ సీన్స్ కూడా తీయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం: రసూల్ ఎల్లోర్, సమర్పణ: కృష్ణ చైతన్య.